
ఈ ఫ్యాషన్స్‌తో వెన్ను నొప్పి ఖాయం
న్యూఢిల్లీ: నేటితరంలో చాలామంది ఫ్యాషనబుల్‌గా ఉండడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా ఒంటికి అతుక్కుపోయే దుస్తులను ఎక్కువగా ధరిస్తున్నారు. అయితే ఇలా ఒంటికి అతుక్కుపోయే డ్రెస్‌లు నరాల పనితీరుమీద ఒత్తి డి కలిగిస్తాయని, దీంతో వెన్నునొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీలోని క్యూఐ స్పైన్ క్లినిక్‌కి చెందిన వెన్నునొప్పి నిపుణులు సూరజ్ బఫ్నా ఈ సమస్యపై తన సూచనలిస్తున్నారు.
► ఒంటికి అతుక్కుపోయే జీన్స్ నడుము, తొడలు, కండరాలపై ఒత్తిడిన కలుగజేస్తాయి. ఇది మోకాలి జాయింట్ పేయిన్స్‌కి కారణమవుతాయి.
► బరువైన బ్యాగ్‌లు ధరించడం కూడా ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. సాధారణంగా బ్యాగ్‌ను ఏదైనా ఒకవైపే ఎక్కువగా ధరిస్తాం. అధిక బరువు ఉన్న బ్యాగ్‌లను ఒకే వైపు ఉంచడంతో వెన్ను మీద అధిక భారం పడుతుంది. ఇది వెన్ను నొప్పిని కలిగిస్తుంది.
► నగరాల్లో యువతులు ఎక్కువగా హైహీల్స్ ధరిస్తున్నారు. ఇది పాదాలు, వెన్నెముకపై ఒత్తిడి కలిగిస్తుంది. తొడ కండరాలు క్షీణించేలా చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ సమస్యలు తలెత్తడంతోపాటు, మోకాలి చిప్ప అరుగుదలకు కూడా కారణమవుతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా కంఫర్టబుల్ పాదరక్షలు వాడడం ఉత్తమం.