
స్పందన మృతదేహం
మలక్‌పేట: ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి ..సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌కు చెందిన జన్‌వాడ రాజు కుమార్తె స్పందన(21), కుమారుడు అభినయ్ మూసారంబాగ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ నగరంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. స్పందన బషీర్‌బాగ్‌లోని బొన్‌ఫైర్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. కొరియర్ కోసం ఆదివారం రాత్రి ఆమె సోదరుడు బయటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న స్పందన సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన అభినయ్ ఆమెను యశోద ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై బలరాజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.