‘చిటియా కలైయా వే.. ఓ బేబీ మెరీ చిటియా కలైయా వే’ అనే ఈ హిందీ (‘రాయ్’ సినిమా) పాట భాషాకతీతంగా ఎంత హిట్టో తెలియని సినీ ప్రేక్షకుల్లేరు. అలాగే ఆ పాట మీద డాన్స్ చేసిన ఆ మూవీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రతిభ గురించి కూడా పరిచయం లేని అభిమానుల్లేరు. ఇక జాక్వెలిన్ స్టైల్ గురించి, ఫ్యాషన్‌లో ఆమెకున్న అభిరుచి, ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను తెలిపే బ్రాండ్స్ ఏంటో చూద్దామా !
'నా దృష్టిలో ఫ్యాషన్ అంటే సౌకర్యమే. 1990ల చివర్లో వచ్చిన ట్రెండ్స్ అంటే నాకు భలే ఇష్టం' అని ఫ్యాషన్‌పై తనకున్న మమకారాన్ని తెలిపింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆమె ఎక్కువగా వాడే బ్రాండ్స్‌లలో 'రోజ్ రూమ్' ఒకటి. ఈ 'రోజ్ రూమ్' బ్రాండ్ చీర ధర రూ. 15, 500. ఇక జ్యూయెలరీ విషయానికొస్తే 'అమ్‌రిస్'ను ఎక్కుగా ప్రిఫర్ చేస్తుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ బ్రాండ్‌లోని నెక్లెస్, కమ్మలు, ఉంగరం ధరలు నాణ్యత, డిజైన్ బట్టి ఉంటాయి.
రోజ్ రూమ్:
‘ఓ స్త్రీగా నాలో నేను దేన్ని నమ్ముతాను.. ఎలా ఉండాలనుకుంటాను.. ఏం కోరుకుంటానో అవే నా డిజైన్స్ ద్వారా చెప్పాలనుకుంటాను. నా దృష్టిలో దేవుడి అద్భుతమైన సృష్టి స్త్రీ. నా బ్రాండ్ ఆమెను మరింత అద్భుతంగా మలస్తుంది’ అంటోంది ‘రోజ్ రూమ్’ లేబుల్ వ్యవస్థాపకురాలు ఇషా. ఇంతకు మించి ఈ బ్రాండ్‌కు వివరణ, వర్ణన ఏం ఉంటుంది! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ధరలూ అందుబాటులోనే.
అమ్‌రిస్:
పన్నెండేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్. వ్యవస్థాపకురాలు.. ప్రేరణ రాజ్‌పాల్. నగల పట్ల, నగల డిజైన్స్ పట్ల తన అత్తగారికున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూయెలరీ బ్రాండ్‌ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలకూ అమ్‌రిస్‌ను విస్తరించారు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు.
Comments
Please login to add a commentAdd a comment