ఫ్యాషన్ డిజైనింగ్ | Fashion Designing Diploma Courses | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ డిజైనింగ్

Published Thu, Apr 2 2015 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

Fashion Designing  Diploma Courses

ఫ్యాషన్‌కు సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ కోర్సులు-బీడీఈఎస్ ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, బీడీఈఎస్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ నిట్‌వేర్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ లెదర్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ టెక్స్‌టైల్ డిజైన్, బీఎఫ్‌టెక్ (అపెరల్ ప్రొడక్షన్). బ్యాచిలర్ కోర్సుల్లో చేరడానికి అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం.  మాస్టర్ కోర్సులు: మాస్టర్ ఆఫ్ డిజైన్,మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. మాస్టర్ కోర్సుల్లో ప్రవేశించాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు 10వ తరగతి/ఇంటర్మీడియెట్ కావాలి. కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరాలంటే మాత్రం బ్యాచిలర్ లేదా పీజీ కోర్సులు చేయడం తప్పనిసరి.
 
 స్కిల్స్:
 సృజనాత్మకత, భిన్నంగా ఆలోచించడం, విశ్లేషణ సామర్థ్యం, తార్కిక ఆలోచన, కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన), మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం.
 
 అవకాశాలు:
 ఫ్యాషన్ అంటే చాలా మంది కేవలం దుస్తుల డిజైనింగ్ అనే భావనలో ఉంటారు. మనం ఉపయోగించే లెదర్ వస్తువులు, యాక్ససరీస్, టెక్స్‌టైల్, కమ్యూనికేషన్, అపెరల్ ప్రొడక్షన్, నిట్‌వేర్ వంటి విభాగాల్లో కూడా డిజైనర్ల సేవలు అవసరం. ఫ్యాషన్, న్యూ ట్రెండ్స్ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆసక్తి కారణంగా అంతే స్థాయిలో కొత్త పరిశ్రమలు, బొటిక్‌ల ఏర్పాటు సాగుతోంది. దీంతో ఈ కోర్సు పూర్తిచేసిన వారు డిజైనర్‌గా, ఫ్రీలాన్స్ డిజైన్ కన్సల్టెంట్, స్టయిలిస్ట్, కాస్ట్యుమ్ డిజైనర్, ఇల్‌స్ట్రేటర్స్, ప్యాట్రన్ ఇంజనీర్లు, ఫ్యాషన్ జర్నలిస్ట్, బ్రాండ్ మేనేజర్, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడొచ్చు.
 
 టాప్ రిక్రూటర్స్:
 అల్‌పైన్ ఇంటర్నేషనల్, ఐటీసీ లిమిటెడ్, స్వరోస్కీ ఇండియా, ఇండస్ లీగ్ క్లాతింగ్, మాధుర గార్మెంట్స్, ప్రొలైన్, స్పైకర్, పాంటాలూన్, లీవిస్, రాబియా లెదర్స్, పాంటాలూన్స్, షాపర్స్ స్టాప్.
 
 వేతనాలు:
 బ్యాచిలర్ డిగ్రీతో కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 25-30 వేల వేతనం లభిస్తుంది. తర్వాత ఉన్నత చదువులు, హోదా ఆధారంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మాస్ట ర్స్ డిగ్రీతో నెలకు రూ. 30-40 వేలు జీతం పొందొచ్చు.
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్
 వివరాలకు: www.nift.ac.in
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
 వివరాలకు: www.nid.edu
 సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-పుణే
 వెబ్‌సైట్: జ్ట్టిఞ://sid.edu.in
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-
 బెంగళూరు, వెబ్‌సైట్: http://iiftbangalore.com
 
 సృజనాత్మకత అవసరం
 ఫ్యాషన్ ఇప్పుడు దైనందిన జీవితంలో భాగమైంది. ఒకప్పుడు కేవలం డ్రెస్ డిజైన్‌కే పరిమితమైన ఫ్యాషన్ టెక్నాలజీ ఇప్పుడు హెయిర్ స్టైల్ నుంచి షూ వేర్ వరకు విస్తరించింది. ఏటా 15-20 శాతం వార్షిక వృద్ధి సాధిస్తోంది. ఫలితంగా అవకాశాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు సృజనాత్మకత, కొత్త ట్రెండ్స్‌పై నిరంతర అవగాహన అవసరం.
 - ఆర్.గోపాలకృష్ణ, జాయింట్ డెరైక్టర్,
 నిఫ్ట్, హైదరాబాద్ క్యాంపస్.
 
 ఫైన్ ఆర్ట్స్
  ఇతర రంగాలకు భిన్నంగా.. కళాత్మాక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి చక్కని వేదికగా నిలుస్తు న్నాయి..ఫైన్ ఆర్ట్స్ కోర్సులు. తమ సృజనాత్మకత శక్తి, ఉహకల్పనతో గుర్తింపు పొందడానికి సరైన అవకాశాలు కల్పిస్తున్నాయి . పెయింటింగ్, ఫోటోగ్రఫీ, అప్లయిడ్ ఆర్ట్స్,స్కల్‌ప్చ్‌ర్, మ్యూజిక్, నాట్యం తదితర కోర్సులు ఫైన్‌ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి.
 
 ఇన్‌స్టిట్యూట్‌లు:
 జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌యూ), ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం.. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో డిప్లొమా నుంచి మాస్టర్ స్థాయి వరకు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో..వివిధ విభాగాల్లో డి ప్లొమా నుంచి మాస్టర్ స్థాయి కోర్సుల వరకు అందుబాటులో ఉన్నాయి.
 
 కోర్సులు:
 బీఎఫ్‌ఏ(అప్లయిడ్ ఆర్ట్), బీఎఫ్‌ఏ (ఫోటోగ్రఫీ), బీఎఫ్‌ఏ(స్కల్‌ప్చ్‌ర్), బీఎఫ్‌ఏ (పెయింటింగ్), బీఎఫ్‌ఏ (శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్). మాస్టర్ కోర్సులు: ఎంఎఫ్‌ఏ(అప్లయిడ్ ఆర్ట్), ఎంఎఫ్‌ఏ(పెయింటింగ్) , ఎంఎఫ్‌ఏ(స్కల్‌ప్చ్‌ర్), ఎంఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ), ఎంఏ(మ్యూజిక్), ఎంఏ (పెర్ఫామింగ్ ఆర్ట్స్), ఎంపీఏ-కూచిపూడి నృత్యం, ఎంపీఏ-ఆంధ్రనాట్యం, ఎంపీఏ-జానపద కళలు, ఎంఫిల్ సంగీతం, ఎంపీఏ డ్యాన్స్(కూచిపూడి, భరతనాట్యం), ఎంపీఏ డ్యాన్స్(ఫ్లోక్). ఇవి కాకుండా ఆయా విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, బ్రిడ్జ్, ఈవినింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీలను బట్టి అర్హత, ఎంపిక విధానం, కోర్సు వ్యవధి సంబంధిత అంశాలు మారుతు ఉంటాయి. కాబట్టి సంబంధిత. వివరాలను ఆయా వర్సీటీల వెబ్‌సైట్ల నుంచి పొందొచ్చు.
 
 అవకాశాలు:
 ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు చదువుకుంటూనే సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ విద్యార్థి నైపుణ్యం ఆధారంగా సంపాదన ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మ్యూజియం, పబ్లికేషన్స్, యూనివర్సిటీలు, అడ్వర్‌టైజింగ్, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లలో పలు హోదాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, ఫోటోగ్రఫీ, సంగీతం, నృత్య విభాగాల అభ్యర్థులు టెలివిజన్, సినిమా రంగాల్లో కూడా స్థిర పడొచ్చు. ప్రభుత్వ విభాగాల విషయానికొస్తే..ట్రైబల్ వేల్పేర్ డిపార్ట్‌మెంట్, దూరదర్శన్, ఆకాశవాణి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్లలలో అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, స్కల్పచర్, మ్యూజిక్‌లలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో కాంట్రాక్ట్‌బేస్డ్ పద్ధతిలో పని చేయవచ్చు. సొంతంగా ఆర్ట్ గ్యాలరీలను నెలకొల్పడం, ఆర్ట్ ఎగ్జిబిషన్లను నిర్వహించడం వంటి వాటి ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు. వివిధ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్లలో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్‌గా సేవలు అందించవచ్చు. సొంతంగా మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ స్కూళ్లను స్థాపించవచ్చు.
 
 వేతనాలు:
 అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలలో సాధారణంగా అసిస్టెంట్/అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్/గ్రాఫిక్ డిజైనర్/విజువలర్స్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ దశలో వీరికి నెలకు రూ. 8 వేల-రూ. 20 వేల వరకు ఉంటుంది. తర్వాత హోదాను బట్టి నెలకు రూ. 25 వేల నుంచి రూ. 40 వేలకు సంపాదించవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ-లెర్నింగ్ బిజినెస్ సంస్థల్లో గ్రాఫిక్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రారంభంలో రూ. 12 వేల నుంచి రూ. 25వేల వరకు ఆర్జించవచ్చు. థియేటర్, డ్రామా, ప్రొడక్షన్ హౌసెస్‌లలో ప్రారంభంలో రూ. 8 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదించవచ్చు.
 
 ఆ రెండిటితో అందలాలు..
 అభిరుచి, సృజనాత్మకత ఈ రెండు నైపుణ్యాలున్న విద్యార్థులకు ఉన్నత కెరీర్‌ను సొంతం చేసే రంగం.. ఫైన్ ఆర్ట్స్. ప్రకృతిలోని అద్భుతాలకు.. అందరినీ ఆకట్టుకునే విధంగా చిత్ర రూపం ఇచ్చే ఫోటోగ్రఫీ, శిల్పకళ వంటివన్నీ ఫైన్‌ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు మ్యూజియంలు, మీడియా హౌస్‌లు, యానిమేషన్ సంస్థలు,విజువల్ గ్రాఫిక్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.
 - బి. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్,
  కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ.
 
  డిజైనింగ్ కోర్సులు
  నేటి ఫ్యాషన్ యుగంలో ఆటోమొబైల్ నుంచి లైఫ్ స్టైల్ వరకు.. సిరామిక్స్ నుంచి ఇంటీరియర్ వరకు ఇలా అన్ని రంగాల్లో ప్రొఫెషనర్ల డిజైనర్ల అవసరం ఎంతో. అంతేకాకుండా మారుతున్న అభిరుచులకనుగుణంగా మార్కెట్లోకి ప్రవేశించే ప్రతి వస్తువును ప్రత్యేకంగా రూపొందించాలంటే ప్రొఫెషనల్ డిజైనర్లు కావాల్సిందే. ఇలా అన్ని రంగాలకు చెందిన వస్తువులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినూత్న రీతిలో డిజైన్ చేయడాన్ని తెలిపేవే డిజైనింగ్ కోర్సులు.
 
 స్పెషలైజేషన్స్:
 మోటార్ బైక్ నుంచి టీవీ రిమోట్ వరకు అన్ని వస్తువుల్లో డిజైనర్ల పాత్ర కీలకం. ఈ క్రమంలో ఉండే స్పెషలైజేషన్స్..ప్రొడక్ట్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫర్నీచర్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, సిరామిక్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ డిజైన్, ఆటోమొబైల్ డిజైన్ తదితరాలు.
 
 కావల్సిన స్కిల్స్:
 ఈ రంగంలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి..సృజనాత్మకత, వినూత్ననంగా ఆలోచించడం, ఆర్టిస్టిక్ వ్యూ, డ్రాయింగ్ వేసే నేర్పు, విశ్లేషణ సామర్థ్యం, కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన), మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం.
 
 అవకాశాలు:
 ప్రతి కంపెనీ, సంస్థ, కమ్యూనిటీలు అన్నీ మార్కెట్ ట్రెండ్‌ను అందుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అందరికీ డిజైనర్స్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్న సంస్థలు: ఆటోమొబైల్ కంపెనీలు, ఫ్యాషన్ స్టూడియోస్, మాన్యుఫాక్చరింగ్ సంస్థలు, మీడియా హౌసెస్, రిటైల్ సంస్థలు, సిరామిక్ ఇండస్ట్రీస్, గ్లాస్ వేర్ హౌసెస్, యానిమేషన్ స్టూడియోలు, గేమింగ్ కంపెనీలు, బోటిక్స్, టాయ్ ఇండస్ట్రీస్.
 
 కెరీర్-వేతనాలు:
 కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత అసోసియేట్, చీఫ్ డెరైక్టర్/డిజైనర్, క్రియేటివ్ డెరైక్టర్ వంటి హోదాలకు చేరుకోవచ్చు. ప్రారంభంలో సంవత్సరానికి రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు వేతనాన్ని అందుకోవచ్చు. తర్వాత హోదా ఆధారంగా రూ.8-10 లక్షల వరకు కూడా అందుకోవచ్చు.
 
 టాప్ రిక్రూటర్స్:
 మారుతీ సుజుకీ, రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా మోటార్స్, ట్రాక్ట ర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్, ఎల్‌జీ, వర్‌‌లపుల్, గోద్రేజ్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, జీఈ హెల్త్‌కేర్.
 
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)
 వివరాలకు: www.nid.edu
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గౌహతి
 వివరాలకు: www.iitg.ac.in
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-కాన్పూర్
 వివరాలకు: www.iitk.ac.in
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే
 వివరాలకు: www.iitb.ac.in
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు
 వివరాలకు: www.iisc.ernet.in
 
 ఫారెన్ లాంగ్వేజెస్
 గ్లోబలైజేషన్ కారణంగా .. మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌కు రావడం.. స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం.. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ నిత్యకృత్యమయ్యాయి. దాంతో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నవారికి డిమాండ్ ఏర్పడింది.
 
 ప్రవేశం.. కోర్సులు:
 బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి కావల్సిన అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. కొన్ని యూనివర్సిటీలు.. డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంటే మరికొన్ని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, కన్సల్టెన్సీలు కూడా సంబంధిత భాషల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి.
 
 డిమాండ్ ఉన్న భాషలు:
 ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్,జపనీస్, స్పానిష్,కొరియన్
 
 భాషతో కెరీర్ అవకాశాలు:
 ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ట్రాన్స్‌లేటర్స్, ఇంటిప్రిటేటర్స్, డీకోడర్స్, టెక్నికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్, టూర్ ఆపరేటర్స్, ఫ్యాకల్టీ వంటి వివిధ స్థాయిల్లో స్థిరపడొచ్చు. మీడియా, పార్లమెంట్, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్ హౌసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాల యాలు, హెచ్‌పీ,ఒరాకిల్,స్యామ్‌సంగ్, హ్యుందాయ్, ఎల్‌జీ, థామ్సన్, జీఈ, టూరిజం సంస్థలు, హోటల్ పరిశ్రమ, ఎయిర్‌లైన్ ఆఫీస్‌లు, వరల్డ్ బ్యాంక్, యూఎన్‌ఓ, యునెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.
 
 వేతనాలు.. టాప్ రిక్రూటర్స్:
 అనువాదకులు, ఇంటర్‌ప్రిటేటర్లుగా పనిచేసేవారికి ఆదాయం కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. భాష ఆధారంగా ట్రాన్స్‌లేటర్లకు ఒక్కో పేజీకి దాదాపు రూ. 200 నుంచి రూ. 500 వరకు లభిస్తంది. నెల వారీగా రూ. 20 నుంచి రూ. 40 వేల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. అధ్యాపకులకు ప్రారంభంలో 25వేలకుపైగా వేతనం లభిస్తుంది. ఇంటర్‌ప్రిటేటర్లకు గంటకు   రూ. 400-500 వరకు చెల్లిస్తున్నారు. రాయబార కార్యాలయాలు, కార్పొరేట్ హౌసెస్, ఫార్మాస్యూటికల్, మెడికల్, తదితర రంగాల్లో స్థిర పడిన వారికి రూ. 15 వేల నుంచి ప్రారంభంలో వేతనం ఉంటుంది.
 
 ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 ఇఫ్లూ-హైదరాబాద్
 వెబ్‌సైట్: www.efluniversity.ac.in
 ఢిల్లీ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.du.ac.in
 జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-ఢిల్లీ
 యూనివర్సిటీ ఆఫ్ ముంబై,వెబ్‌సైట్:www.mu.ac.in
 
 డీఈఈ సెట్
 ఇంటర్మీడియెట్ తర్వాత చిన్న వయసులోనే  ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అవకాశం కల్పిస్తోంది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇంటర్ తర్వాత రెండేళ్ల కాలవ్యవధి గల ఈ కోర్సులో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ ఏటా డీఈఈసెట్ నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా డీఎడ్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. దీని తర్వాత డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement