హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు.. | Hotel Management course | Sakshi
Sakshi News home page

హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు..

Published Thu, Jul 16 2015 1:22 AM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

Hotel Management course

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?    -రాధ, విజయవాడ
 ఫ్యాషన్ డిజైనింగ్.. చాలా విస్తృతమైన సబ్జెక్టు. ఇందులో గార్మెంట్ డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్ లాంటి వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది యువతకు మంచి ఉపాధి వేదికగా మారడంతో ఎక్కువమంది దీనివైపు ఆకర్షితులవుతున్నారు.హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్‌లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇందులో టెక్స్‌టైల్ డిజైన్, ఆక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ అండ్ కమ్యూనికేషన్ లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థ అపారెల్ ప్రొడక్షన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. ఈ సంస్థ మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌ను కూడా అందిస్తోంది.
 
 వెబ్‌సైట్: www.nift.ac.in
 హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో టెక్స్‌టైల్ డిజైనింగ్ ఒక సబ్జెక్టుగా ఆరు నెలల డిప్లొమా కోర్సును అందిస్తోంది. అర్హత: పదో తరగతి
 వెబ్‌సైట్: www.iiftindia.net
 హైదరాబాద్‌లోని అపారెల్ ట్రెయినింగ్ అండ్ డిజైన్ సెంటర్.. ఒకేడాది అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీల్లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ఈ రెండు సబ్జెక్టుల్లో రెండేళ్ల అసోసియేట్ డిగ్రీలను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ సంస్థ అడ్వాన్స్‌డ్ ప్యాటర్న్ మేకింగ్‌లో డిప్లొమా కోర్సును అందిస్తోంది. ఇది వొకేషనల్ కోర్సులకు శిక్షణనిచ్చే సంస్థ.
 అర్హత: పదో తరగతి/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
 వెబ్‌సైట్: www.atdcindia.co.in
 
 ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తయింది. ఏ విధమైన షార్ట్ టర్మ్ కోర్సులు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయో వివరించండి?
 -వినయ్, విశాఖపట్నం
 ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్(పీఎల్‌సీ).. ఎలక్ట్రో మెకానికల్ ప్రాసెస్‌లను నియంత్రిస్తుంది. సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్విజిషన్(ఎస్‌సీఏడీఏ).. పరిశ్రమల్లో పర్యవేక్షణకు, మౌలిక వసతులను, మెషినరీని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. వీటిపై శిక్షణ తీసుకోవడం ద్వారా అవకాశాలు మెరుగవుతాయి.
 హైదరాబాద్‌లోని ప్రొలిఫిక్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్.. ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ విభాగంలో శిక్షణ ఇస్తుంది. దీనికి సర్టిఫికెట్ కూడా అందిస్తుంది.ఈ ప్రోగ్రామ్‌లో పీఎల్‌సీ, ఎస్‌సీఏడీఏ లాంటి అంశాలు ఉంటాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్లేస్‌మెంట్స్ కూడా అందిస్తోంది.
 అర్హత: ఈ విభాగంలో డిగ్రీ ఉన్నవారు, పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 వెబ్‌సైట్: www.plcscadatraining.com
 హైదరాబాద్‌లో రామాంతపూర్‌లోని జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రెయినింగ్‌లోని అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రాసెస్ ఇన్‌స్ట్రుమెంటేషన్.. పీఎల్‌సీ, ఎస్‌సీఏడీఏల్లో శిక్షణ అందిస్తుంది.అర్హత: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొ మా. వెబ్‌సైట్: ఠీఠీఠీ.్చ్టజ్ఛీఞజీజిడఛ్ఛీట్చఛ్చఛీ.జౌఠి.జీ
 
 హోటల్ మేనేజ్‌మెంట్/కలినరీ టెక్నాలజీ కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
 -వినోద్, మెదక్
 హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రీషన్.. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది.
 అర్హత: ఇంటర్మీడియెట్/10+2 లేదా తత్సమానం
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.ihmhyd.org.
 ా్నలజీల్లో బ్యాచిలర్ డిగ్రీ అందిస్తోంది.
 అర్హత: ఇంటర్మీడియెట్/10+2
 ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: ఠీఠీఠీ.టఛిజిఝఛ్టి.ౌటజ.
 హైదరాబాద్‌లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా వివిధ కోర్సులను అందిస్తోంది. వాటి వివరాలు...
 క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ కలినరీ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
 అర్హత: ఇంటర్మీడియెట్/10+2
 ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
 అర్హత: హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, హోటల్/హాస్పిటాలిటీ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్/ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌తో రెండేళ్ల పని అనుభవం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్‌లో బీఎస్సీ, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో బీఏ, కలినరీ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్.
 ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
 ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పాటిస్సెరి(పేస్ట్రీస్)లో సర్టిఫికెట్ కోర్సు
 అర్హత: పదో తరగతి. ఇంగ్లిష్ ప్రావీణ్యం తప్పనిసరి.
 ప్రవేశం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.iactchefacademy.com
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement