Diploma courses
-
సాయంకాలం.. చదువుల తీరం!
మురళీనగర్(విశాఖ ఉత్తర): పరిశ్రమలు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారు పదోన్నతులు పొందేందుకు గాను తమ విద్యార్హతలను పెంచుకునే అవకాశం లభిస్తే.. భలే ఉంటుంది కదూ. డిప్లమో కోర్సులను సాయం కాలం చదివే అరుదైన అవకాశం విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇస్టిట్యూట్(గైస్) అందిస్తోంది. రాష్ట్రంలో 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా సాయంకాలం కోర్సులు నిర్వహణకు విశాఖలోని గైస్‌ను ఏఐసీటీఈ ఎంపిక చేయడం విశేషం. అలాగే మరో రెండు ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలలు.. బెహరా(నరవ), ప్రశాంతి(అచ్యుతాపురం)లలోనూ సాయంత్రం కోర్సుల నిర్వహణకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతిచ్చిoది. వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు కెమికల్ ఇంజనీరింగ్, పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ విభాగాల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌గా 2024–25 విద్యా సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు కోర్సులను నవంబర్ 1న ప్రారంభిస్తారు. ప్రతి కోర్సులోనూ 33 సీట్లుండగా.. వీటిలో 3 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఉంటాయి. వీరు ఈ నెల 21 నుంచి 26వ వరకు సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బెహరా పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్, మెకానికల్, ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీ(అచ్యుతాపురం)లో సివిల్ , మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. టైమింగ్స్: రోజూ సాయంత్రం 6.30 నుంచి 9 గంటల వరకు, ఆదివారం, సెలవు దినాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 వరకూ తరగతులు నిర్వహిస్తారు. అర్హత: గుర్తింపు పొందిన పరిశ్రమల్లో, లేదా కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో, ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇంటర్ ఎంపీసీ/ బైపీసీ/ఐవీసీ/లేదా ఐటీఐ సర్టిఫికెట్తో కెమికల్ ప్లాంట్ మెయింటెనెన్స్ మెకానిక్/అటెండెంట్ ఆపరేటర్, లేబొరేటరీ అసిస్టెంట్/ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ తదితర విభాగాల్లో ఏడాది రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తూ.. పై 3 కళాశాలకు 50 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నెల 26 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. -
ఏరోస్పేస్ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చేసిన ప్రతి విద్యార్థికి అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో పారిశ్రామిక శిక్షణకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ఆయన ఆధ్వర్యంలో విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు. ఏరోస్పేస్ రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంపిక చేశామన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సహకారంతో మెకానికల్ డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పారిశ్రామిక శిక్షణకు గాను రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో 134 మంది పాల్గొనగా రాత, మౌఖిక పరీక్ష ద్వారా 25 మందిని ఏరోస్పేస్లో శిక్షణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరిలో 12 మంది బాలురు, 13 మంది బాలికలున్నట్లు చెప్పారు. వీరికి అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో శిక్షణనిస్తారని, శిక్షణ కాలంలో బోయింగ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్‌కు నిధులు అందిస్తుందని తెలిపారు. లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంస్థ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35,000 కోర్సు ఫీజుతోపాటు నెలకు రూ.3,000 ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు. -
119 మార్కులకు టాప్ ర్యాంక్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, నాన్– ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో (పాలిటెక్నిక్) ప్రవేశానికి రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ పాలిసెట్–20 23)లో బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణుల య్యారు. బాలురు, బాలికలు కలిపి మొత్తం మీద 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్ ఆడిటోరియంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఫలితాలను విడుదల చేశారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో బాలికలు సత్తా చాటారు. బాలురు 78.62 శాతం ఉత్తీర్ణత సాధించారు. అర్హులైన వారికి జూన్ 14 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మిత్తల్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మరో నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయని చెప్పారు. 119తో టాప్ ర్యాంక్ ఈనెల 17న నిర్వహించిన పాలిసెట్‌కు 1,05,742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎంపీసీ విభాగంలో 80,358, ఎంబైపీసీ విభాగంలో 80,752 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సురభి శరణ్య 120 మార్కులకు 119 మార్కు లు సాధించి ఎంపీసీ విభాగంలో స్టేట్ మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అదే జిల్లాకు చెందిన షేక్ సిద్ధిక్ సైతం 119 మార్కులు సాధించి రెండో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, మెదక్ జిల్లాకు చెందిన జి.ప్రియాంశ్కుమార్, హైదరాబాద్‌కు చెందిన పి.ప్రణీత్, సూర్యాపేటకు చెందిన కె.శశివర్ధన్లు 118 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల ఆకాశ్ 116 మార్కులు సాధించి మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకోగా, సూర్యాపేట జిల్లా విద్యార్థి మిర్యాల అక్షయతార 116 మార్కులతో రెండు, సూర్యాపేట జిల్లాకే చెందిన కె.శశివర్ధన్ 116 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. శశివర్ధన్ ఎంపీసీ, ఎంబైపీసీ రెండింటిలోనూ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టీకల్చర్ వర్సిటీల్లోని కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. రైతుబిడ్డ.. ఎంబైపీసీలో ఫస్ట్‌ర్యాంకర్ కాటారం: రైతుబిడ్డ పాలిసెట్‌లో మెరిశాడు. ఎంబైపీసీలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గంగారానికి చెందిన చీర్ల ఆకాశ్ 120కి 116 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌ర్యాంక్ సాధించాడు. ఆకాశ్ తండ్రి చీర్ల రమేశ్ రైతు కాగా, తల్లి రజిత గృహిణి. ఆకాశ్ 4వ తరగతి వరకు కాటారంలోని ప్రైవేటు పాఠశాలలో చదివాడు. 10వ తరగతి వరకు హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించాడు. ‘మా నాన్న కష్టం చూసేవాడిని. ప్రణాళికాబద్ధంగా చదివాను. అనుకున్న ర్యాంకు సాధించాను. ఏ కోర్సు తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు’ అని ఆకాశ్ తెలిపాడు. తొలి విడత కౌన్సెలింగ్.. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం, స్లాట్ బుకింగ్: జూన్ 14 నుంచి 18 వరకు ♦ సరి్టఫికెట్ల వెరిఫికేషన్: జూన్ 16 నుంచి 19 వరకు ♦ వెబ్ ఆప్షన్లు: జూన్ 16 నుంచి 21 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూన్ 21 ♦ సీట్ల కేటాయింపు జూన్ 25 ♦ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 25 నుంచి 29 వరకు తుది విడత కౌన్సెలింగ్.. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం స్లాట్‌బుకింగ్: జూలై 1 ♦ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 2 ♦ వెబ్ ఆప్షన్లు జూలై 1 నుంచి 3 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 3 ♦ సీట్ల కేటాయింపు జూలై 7 ♦ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 7 నుంచి 10 వరకు. స్పాట్ అడ్మిషన్లు.. ♦ స్పాట్ అడ్మిషన్ల ప్రకటన: జూలై 7 ♦ ఫీజు చెల్లింపు జూలై 8, 9 ♦ ర్యాంక్ జనరేషన్ జూలై 10 ♦ వెబ్ ఆప్షన్లు జూలై 8 నుంచి 11 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 11 ♦ సీట్ల కేటాయింపు జూలై 14 ♦ ఫీజు చెల్లించడం, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 14 నుంచి 15 వరకు ♦ కాలేజీల్లో రిపోర్ట్ చేయడం జూలై 15, స్పాట్ అడ్మిషన్లు పూర్తి జూలై 17 -
విలువలతో కూడిన జర్నలిజం అవసరం
-
సర్కారీ పాలిటెక్నిక్కే సై
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలనే ఎంచుకున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలు 55 ఉండగా, వీటిల్లో 91.69 శాతం సీట్లు కేటాయించారు. 63 ప్రైవేటు కాలేజీల్లో కేవలం ఐదింటికి మాత్రమే విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. దీంతో 60.34 శాతం మాత్రమే సీట్లు కేటాయించారు. టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన పాలిసెట్‌కు 79,051 మంది అర్హత సాధించారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో 25,146 మంది 5,96,613 ఆప్షన్లు ఇచ్చారు. వీటిని పరిశీలించిన పాలిసెట్ విభాగం గురువారం మొదటి విడత సీట్లను కేటాయించింది. డిప్లొమా దశలోనూ కంప్యూటర్ కోర్సుల వైపే.. పాలిటెక్నిక్‌లో దాదాపు 25 బ్రాంచీలున్నాయి. వీటిల్లో 28,083 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలివిడత ఆప్షన్లకు అనుగుణంగా 20,695 (73.69 శాతం) సీట్లు కేటాయించారు. ఇందులో విద్యార్థులు అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులకే ప్రాధాన్యం ఇచ్చారు. కంప్యూటర్స్‌లో 4,110 సీట్లు ఉండగా వందశాతం కేటాయించారు. దీనికి అనుబంధ కోర్సుగా చెప్పుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌లో మొత్తం 178 సీట్ల(వంద శాతం)కూ విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీలో ఉన్న 59 సీట్లూ తొలి కౌన్సెలింగ్‌లోనే భర్తీ అయ్యాయి. క్లౌడ్ కంప్యూటింగ్ (100 శాతం) వైపు విద్యార్థులు ఆసక్తి చూపారు. సంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజనీరింగ్ (67.7 శాతం), మెకానికల్ (48.63 శాతం) మాత్రమే విద్యార్థులు ఎంచుకున్నారు. నెలాఖరులోగా రిపోర్టింగ్ తొలి విడత కేటాయింపులో సీటు దక్కించుకున్న అభ్యర్థులు ఈ నెలాఖ రులోగా సెల్ఫ్ రిపోర్టి్టంగ్ చేయాల్సి ఉంటుంది. tspolycet.nic.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అయి, అలాట్మెంట్ ఆర్డర్‌తోపాటు అవసరమైన ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి, నిర్ధారించిన ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. తుదిదశ వరకూ అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనే చాన్స్ ఉంటుంది. -
పాలిసెట్‌లో 37,978 సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్–2021 తొలివిడత అడ్మిషన్లలో 37,978 మందికి సీట్లు కేటాయించినట్లు సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాలిసెట్ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 18లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 312 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి.. మెరిట్ జాబితాను శాప్‌కు పంపాల్సి ఉందన్నారు. అందువల్ల వారికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. 259 కాలేజీలు.. 69,810 సీట్లు పాలిసెట్‌లో 64,188 మంది అర్హత సాధించగా 42,910 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో 41,978 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. 41,036 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. రాష్ట్రంలో 259 కాలేజీలు ఉండగా వాటిలో 69,810 సీట్లు ఉన్నాయి. తొలి విడతలో 37,978 సీట్లు భర్తీ కాగా 31,832 సీట్లు మిగిలాయి. అత్యధికంగా ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్ల భర్తీ ఇలా.. -
నేడు 44 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 22 వేల ర్యాంకులోపు విద్యార్థులు 6,633 మంది హాజరైనట్లు పాలీసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. నేడు 22,001 ర్యాంకు నుంచి 44 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. -
25 నుంచి పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్-2015లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. ర్యాంకుల వారీగా నిర్ణీత తేదీల్లో విద్యార్థులను వెరిఫికేషన్‌కు హాజరు కావాలని పేర్కొంది. నిర్ణీత తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండు దఫాలుగా ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారు. ఇక విద్యార్థులు ఈనెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 2వ తేదీన ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని వెల్లడించింది. 5వ తేదీన సీట్లను కేటాయించి, తమ వెబ్సైట్లో అందుబాటులో (జ్ట్టిఞట://్టటఞౌడఛ్ఛ్టి.జీఛి. జీ) ఉంచనున్నట్లు తెలిపింది. హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను వెబ్సైట్లో పొందవచ్చని తెలిపింది. వికలాంగులు, క్రీడాకారులకు ప్రత్యేకంగా.. వికలాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కేటగిరీలకు చెందిన వారికి ఈనెల 25, 26 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొంది. -
ఫ్యాషన్ డిజైనింగ్
ఫ్యాషన్‌కు సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ కోర్సులు-బీడీఈఎస్ ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, బీడీఈఎస్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ నిట్వేర్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ లెదర్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ టెక్స్టైల్ డిజైన్, బీఎఫ్‌టెక్ (అపెరల్ ప్రొడక్షన్). బ్యాచిలర్ కోర్సుల్లో చేరడానికి అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. మాస్టర్ కోర్సులు: మాస్టర్ ఆఫ్ డిజైన్,మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. మాస్టర్ కోర్సుల్లో ప్రవేశించాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు 10వ తరగతి/ఇంటర్మీడియెట్ కావాలి. కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరాలంటే మాత్రం బ్యాచిలర్ లేదా పీజీ కోర్సులు చేయడం తప్పనిసరి. స్కిల్స్: సృజనాత్మకత, భిన్నంగా ఆలోచించడం, విశ్లేషణ సామర్థ్యం, తార్కిక ఆలోచన, కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన), మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం. అవకాశాలు: ఫ్యాషన్ అంటే చాలా మంది కేవలం దుస్తుల డిజైనింగ్ అనే భావనలో ఉంటారు. మనం ఉపయోగించే లెదర్ వస్తువులు, యాక్ససరీస్, టెక్స్టైల్, కమ్యూనికేషన్, అపెరల్ ప్రొడక్షన్, నిట్వేర్ వంటి విభాగాల్లో కూడా డిజైనర్ల సేవలు అవసరం. ఫ్యాషన్, న్యూ ట్రెండ్స్ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆసక్తి కారణంగా అంతే స్థాయిలో కొత్త పరిశ్రమలు, బొటిక్‌ల ఏర్పాటు సాగుతోంది. దీంతో ఈ కోర్సు పూర్తిచేసిన వారు డిజైనర్‌గా, ఫ్రీలాన్స్ డిజైన్ కన్సల్టెంట్, స్టయిలిస్ట్, కాస్ట్యుమ్ డిజైనర్, ఇల్స్ట్రేటర్స్, ప్యాట్రన్ ఇంజనీర్లు, ఫ్యాషన్ జర్నలిస్ట్, బ్రాండ్ మేనేజర్, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడొచ్చు. టాప్ రిక్రూటర్స్: అల్పైన్ ఇంటర్నేషనల్, ఐటీసీ లిమిటెడ్, స్వరోస్కీ ఇండియా, ఇండస్ లీగ్ క్లాతింగ్, మాధుర గార్మెంట్స్, ప్రొలైన్, స్పైకర్, పాంటాలూన్, లీవిస్, రాబియా లెదర్స్, పాంటాలూన్స్, షాపర్స్ స్టాప్. వేతనాలు: బ్యాచిలర్ డిగ్రీతో కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 25-30 వేల వేతనం లభిస్తుంది. తర్వాత ఉన్నత చదువులు, హోదా ఆధారంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మాస్ట ర్స్ డిగ్రీతో నెలకు రూ. 30-40 వేలు జీతం పొందొచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వివరాలకు: www.nift.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వివరాలకు: www.nid.edu సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-పుణే వెబ్సైట్: జ్ట్టిఞ://sid.edu.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ- బెంగళూరు, వెబ్సైట్: http://iiftbangalore.com సృజనాత్మకత అవసరం ఫ్యాషన్ ఇప్పుడు దైనందిన జీవితంలో భాగమైంది. ఒకప్పుడు కేవలం డ్రెస్ డిజైన్‌కే పరిమితమైన ఫ్యాషన్ టెక్నాలజీ ఇప్పుడు హెయిర్ స్టైల్ నుంచి షూ వేర్ వరకు విస్తరించింది. ఏటా 15-20 శాతం వార్షిక వృద్ధి సాధిస్తోంది. ఫలితంగా అవకాశాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు సృజనాత్మకత, కొత్త ట్రెండ్స్‌పై నిరంతర అవగాహన అవసరం. - ఆర్.గోపాలకృష్ణ, జాయింట్ డెరైక్టర్, నిఫ్ట్, హైదరాబాద్ క్యాంపస్. ఫైన్ ఆర్ట్స్ ఇతర రంగాలకు భిన్నంగా.. కళాత్మాక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి చక్కని వేదికగా నిలుస్తు న్నాయి..ఫైన్ ఆర్ట్స్ కోర్సులు. తమ సృజనాత్మకత శక్తి, ఉహకల్పనతో గుర్తింపు పొందడానికి సరైన అవకాశాలు కల్పిస్తున్నాయి . పెయింటింగ్, ఫోటోగ్రఫీ, అప్లయిడ్ ఆర్ట్స్,స్కల్‌ప్చ్‌ర్, మ్యూజిక్, నాట్యం తదితర కోర్సులు ఫైన్ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి. ఇన్స్టిట్యూట్లు: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌యూ), ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం.. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో డిప్లొమా నుంచి మాస్టర్ స్థాయి వరకు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో..వివిధ విభాగాల్లో డి ప్లొమా నుంచి మాస్టర్ స్థాయి కోర్సుల వరకు అందుబాటులో ఉన్నాయి. కోర్సులు: బీఎఫ్ఏ(అప్లయిడ్ ఆర్ట్), బీఎఫ్ఏ (ఫోటోగ్రఫీ), బీఎఫ్ఏ(స్కల్‌ప్చ్‌ర్), బీఎఫ్ఏ (పెయింటింగ్), బీఎఫ్ఏ (శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్). మాస్టర్ కోర్సులు: ఎంఎఫ్ఏ(అప్లయిడ్ ఆర్ట్), ఎంఎఫ్ఏ(పెయింటింగ్) , ఎంఎఫ్ఏ(స్కల్‌ప్చ్‌ర్), ఎంఎఫ్ఏ(ఫోటోగ్రఫీ), ఎంఏ(మ్యూజిక్), ఎంఏ (పెర్ఫామింగ్ ఆర్ట్స్), ఎంపీఏ-కూచిపూడి నృత్యం, ఎంపీఏ-ఆంధ్రనాట్యం, ఎంపీఏ-జానపద కళలు, ఎంఫిల్ సంగీతం, ఎంపీఏ డ్యాన్స్(కూచిపూడి, భరతనాట్యం), ఎంపీఏ డ్యాన్స్(ఫ్లోక్). ఇవి కాకుండా ఆయా విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, బ్రిడ్జ్, ఈవినింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీలను బట్టి అర్హత, ఎంపిక విధానం, కోర్సు వ్యవధి సంబంధిత అంశాలు మారుతు ఉంటాయి. కాబట్టి సంబంధిత. వివరాలను ఆయా వర్సీటీల వెబ్సైట్ల నుంచి పొందొచ్చు. అవకాశాలు: ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు చదువుకుంటూనే సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ విద్యార్థి నైపుణ్యం ఆధారంగా సంపాదన ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మ్యూజియం, పబ్లికేషన్స్, యూనివర్సిటీలు, అడ్వర్టైజింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లలో పలు హోదాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, ఫోటోగ్రఫీ, సంగీతం, నృత్య విభాగాల అభ్యర్థులు టెలివిజన్, సినిమా రంగాల్లో కూడా స్థిర పడొచ్చు. ప్రభుత్వ విభాగాల విషయానికొస్తే..ట్రైబల్ వేల్పేర్ డిపార్ట్మెంట్, దూరదర్శన్, ఆకాశవాణి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లలలో అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, స్కల్పచర్, మ్యూజిక్‌లలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో కాంట్రాక్ట్‌బేస్డ్ పద్ధతిలో పని చేయవచ్చు. సొంతంగా ఆర్ట్ గ్యాలరీలను నెలకొల్పడం, ఆర్ట్ ఎగ్జిబిషన్లను నిర్వహించడం వంటి వాటి ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు. వివిధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్‌గా సేవలు అందించవచ్చు. సొంతంగా మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ స్కూళ్లను స్థాపించవచ్చు. వేతనాలు: అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలలో సాధారణంగా అసిస్టెంట్/అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్/గ్రాఫిక్ డిజైనర్/విజువలర్స్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ దశలో వీరికి నెలకు రూ. 8 వేల-రూ. 20 వేల వరకు ఉంటుంది. తర్వాత హోదాను బట్టి నెలకు రూ. 25 వేల నుంచి రూ. 40 వేలకు సంపాదించవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ-లెర్నింగ్ బిజినెస్ సంస్థల్లో గ్రాఫిక్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రారంభంలో రూ. 12 వేల నుంచి రూ. 25వేల వరకు ఆర్జించవచ్చు. థియేటర్, డ్రామా, ప్రొడక్షన్ హౌసెస్లలో ప్రారంభంలో రూ. 8 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదించవచ్చు. ఆ రెండిటితో అందలాలు.. అభిరుచి, సృజనాత్మకత ఈ రెండు నైపుణ్యాలున్న విద్యార్థులకు ఉన్నత కెరీర్‌ను సొంతం చేసే రంగం.. ఫైన్ ఆర్ట్స్. ప్రకృతిలోని అద్భుతాలకు.. అందరినీ ఆకట్టుకునే విధంగా చిత్ర రూపం ఇచ్చే ఫోటోగ్రఫీ, శిల్పకళ వంటివన్నీ ఫైన్ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు మ్యూజియంలు, మీడియా హౌస్‌లు, యానిమేషన్ సంస్థలు,విజువల్ గ్రాఫిక్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. - బి. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, జేఎన్ఏఎఫ్ఏయూ. డిజైనింగ్ కోర్సులు నేటి ఫ్యాషన్ యుగంలో ఆటోమొబైల్ నుంచి లైఫ్ స్టైల్ వరకు.. సిరామిక్స్ నుంచి ఇంటీరియర్ వరకు ఇలా అన్ని రంగాల్లో ప్రొఫెషనర్ల డిజైనర్ల అవసరం ఎంతో. అంతేకాకుండా మారుతున్న అభిరుచులకనుగుణంగా మార్కెట్లోకి ప్రవేశించే ప్రతి వస్తువును ప్రత్యేకంగా రూపొందించాలంటే ప్రొఫెషనల్ డిజైనర్లు కావాల్సిందే. ఇలా అన్ని రంగాలకు చెందిన వస్తువులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినూత్న రీతిలో డిజైన్ చేయడాన్ని తెలిపేవే డిజైనింగ్ కోర్సులు. స్పెషలైజేషన్స్: మోటార్ బైక్ నుంచి టీవీ రిమోట్ వరకు అన్ని వస్తువుల్లో డిజైనర్ల పాత్ర కీలకం. ఈ క్రమంలో ఉండే స్పెషలైజేషన్స్..ప్రొడక్ట్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫర్నీచర్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, సిరామిక్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ డిజైన్, ఆటోమొబైల్ డిజైన్ తదితరాలు. కావల్సిన స్కిల్స్: ఈ రంగంలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి..సృజనాత్మకత, వినూత్ననంగా ఆలోచించడం, ఆర్టిస్టిక్ వ్యూ, డ్రాయింగ్ వేసే నేర్పు, విశ్లేషణ సామర్థ్యం, కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన), మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం. అవకాశాలు: ప్రతి కంపెనీ, సంస్థ, కమ్యూనిటీలు అన్నీ మార్కెట్ ట్రెండ్‌ను అందుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అందరికీ డిజైనర్స్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్న సంస్థలు: ఆటోమొబైల్ కంపెనీలు, ఫ్యాషన్ స్టూడియోస్, మాన్యుఫాక్చరింగ్ సంస్థలు, మీడియా హౌసెస్, రిటైల్ సంస్థలు, సిరామిక్ ఇండస్ట్రీస్, గ్లాస్ వేర్ హౌసెస్, యానిమేషన్ స్టూడియోలు, గేమింగ్ కంపెనీలు, బోటిక్స్, టాయ్ ఇండస్ట్రీస్. కెరీర్-వేతనాలు: కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత అసోసియేట్, చీఫ్ డెరైక్టర్/డిజైనర్, క్రియేటివ్ డెరైక్టర్ వంటి హోదాలకు చేరుకోవచ్చు. ప్రారంభంలో సంవత్సరానికి రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు వేతనాన్ని అందుకోవచ్చు. తర్వాత హోదా ఆధారంగా రూ.8-10 లక్షల వరకు కూడా అందుకోవచ్చు. టాప్ రిక్రూటర్స్: మారుతీ సుజుకీ, రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా మోటార్స్, ట్రాక్ట ర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, ఎల్జీ, వర్లపుల్, గోద్రేజ్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, జీఈ హెల్త్‌కేర్. ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) వివరాలకు: www.nid.edu ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గౌహతి వివరాలకు: www.iitg.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-కాన్పూర్ వివరాలకు: www.iitk.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే వివరాలకు: www.iitb.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు వివరాలకు: www.iisc.ernet.in ఫారెన్ లాంగ్వేజెస్ గ్లోబలైజేషన్ కారణంగా .. మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌కు రావడం.. స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం.. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ నిత్యకృత్యమయ్యాయి. దాంతో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నవారికి డిమాండ్ ఏర్పడింది. ప్రవేశం.. కోర్సులు: బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి కావల్సిన అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. కొన్ని యూనివర్సిటీలు.. డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంటే మరికొన్ని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, కన్సల్టెన్సీలు కూడా సంబంధిత భాషల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి. డిమాండ్ ఉన్న భాషలు: ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్,జపనీస్, స్పానిష్,కొరియన్ భాషతో కెరీర్ అవకాశాలు: ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ట్రాన్స్‌లేటర్స్, ఇంటిప్రిటేటర్స్, డీకోడర్స్, టెక్నికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్, టూర్ ఆపరేటర్స్, ఫ్యాకల్టీ వంటి వివిధ స్థాయిల్లో స్థిరపడొచ్చు. మీడియా, పార్లమెంట్, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్ హౌసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాల యాలు, హెచ్‌పీ,ఒరాకిల్,స్యామ్సంగ్, హ్యుందాయ్, ఎల్జీ, థామ్సన్, జీఈ, టూరిజం సంస్థలు, హోటల్ పరిశ్రమ, ఎయిర్‌లైన్ ఆఫీస్‌లు, వరల్డ్ బ్యాంక్, యూఎన్ఓ, యునెస్కో, డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. వేతనాలు.. టాప్ రిక్రూటర్స్: అనువాదకులు, ఇంటర్ప్రిటేటర్లుగా పనిచేసేవారికి ఆదాయం కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. భాష ఆధారంగా ట్రాన్స్లేటర్లకు ఒక్కో పేజీకి దాదాపు రూ. 200 నుంచి రూ. 500 వరకు లభిస్తంది. నెల వారీగా రూ. 20 నుంచి రూ. 40 వేల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. అధ్యాపకులకు ప్రారంభంలో 25వేలకుపైగా వేతనం లభిస్తుంది. ఇంటర్‌ప్రిటేటర్లకు గంటకు రూ. 400-500 వరకు చెల్లిస్తున్నారు. రాయబార కార్యాలయాలు, కార్పొరేట్ హౌసెస్, ఫార్మాస్యూటికల్, మెడికల్, తదితర రంగాల్లో స్థిర పడిన వారికి రూ. 15 వేల నుంచి ప్రారంభంలో వేతనం ఉంటుంది. ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇఫ్లూ-హైదరాబాద్ వెబ్సైట్: www.efluniversity.ac.in ఢిల్లీ యూనివర్సిటీ-న్యూఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ-ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ముంబై,వెబ్సైట్:www.mu.ac.in డీఈఈ సెట్ ఇంటర్మీడియెట్ తర్వాత చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అవకాశం కల్పిస్తోంది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇంటర్ తర్వాత రెండేళ్ల కాలవ్యవధి గల ఈ కోర్సులో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ ఏటా డీఈఈసెట్ నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా డీఎడ్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. దీని తర్వాత డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టవచ్చు. -
ఉపాధ్యాయ విద్యలో కొత్త డిప్లొమాలొద్దు
- ఎన్‌సీటీఈకి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ లేఖ - కోర్సులకు మార్గదర్శకాల రూపకల్పన పూర్తికాలేదని వెల్లడి - రెండేళ్లపాటు నోటిఫికేషన్ ఇవ్వొద్దని విజ్ఞప్తి - సానుకూలంగా స్పందించిన ఎన్సీటీఈ - 2016-17 వరకూ ఆ కోర్సులపై నిషేధం విధిస్తూ నోటీసులు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో సంస్కరణల్లో భాగంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2015-16 విద్యా సంవ త్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రవేశపెట్టిన కొత్త డిప్లొమా కోర్సులు రెండేళ్ల వరకు రాష్ట్రంలో అమల్లోకి రావు. ఆయా కోర్సుల ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన ఇంకా పూర్తి కానందున వాటి అమలుకు నోటిఫికేషన్ ఇవ్వొద్దంటూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఎన్సీటీఈలకు లేఖలు రాసింది. మార్గదర్శకాల రూపకల్పన పూర్తయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని పేర్కొంది. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (ఓపెన్ డిస్టెన్స్ లర్నింగ్), డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ విజువల్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) వంటి రెండేళ్ల కాలవ్యవధిగల కోర్సుల ప్రారంభానికి నోటిఫికేషన్ ఇవ్వొద్దని పేర్కొంది. అప్పటివరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సునే కొనసాగిస్తామని వివరించింది. మిగితా కోర్సులపై నిషేధం విధించాలని కోరింది. ఇందుకు అంగీకరించిన ఎన్సీటీఈ 2016-17 వరకూ ఆ కోర్సులపై నిషేధం విధిస్తూ నోటీసులు జారీ చేసింది. కోర్సులు వద్దనడానికి కారణాలు... కొత్త డిప్లొమా కోర్సులను విద్యాశాఖ వ్యతిరేకించడానికి కారణాలు ఏమిటంటే... ముందుగా ఏ కోర్సులో చేరితే ఏ ఉద్యోగానికి అర్హులన్నది రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉండటం. ఉదాహరణకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఇంతవరకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ విధానమే లేదు. ఆ కోర్సును ప్రారంభిస్తే వారికి భవిష్యత్తులో అవకాశాలు ఏంటనేది సర్కారు నిర్ణయించాలి. కేజీ టు పీజీలో ఆ కోర్సుల అవసరంపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలి. డిప్లొమా ఇన్ ఆర్ట్, డిప్లొమా ఇన్ విజువల్ ఆర్ట్ వంటి కోర్సులు చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనేది తేల్చాలి. ఇప్పటికే క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ల భర్తీని నిలిపేసిన ప్రభుత్వం భవిష్యత్తులో వాటిని భర్తీ చేస్తుందో లేదో స్పష్టం చేయాలి. అలాగే డిస్టెన్స్ విధానంలో డిప్లొమా కోర్సును అనుమతిస్తుందో లేదో పేర్కొనాలి. బ్యాచిలర్ కోర్సులపై దృష్టి లేదు.. బ్యాచిలర్ డిగ్రీలో కొత్తగా ప్రవేశపెట్టిన వివిధ కోర్సులకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇంతవరకు దృష్టి సారించలేదు. వాటికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన, ఆయా కోర్సులను 2015-16 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తారా? లేదా అన్న అంశాలపై యూనివర్సిటీలు, ఉన్నత విద్యా మండలి పట్టించుకోకపోవడంతో గందరగోళం నెలకొంది. ఎన్సీటీఈ ఆదేశాల మేరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్) కోర్సులను రెండేళ్లు చేయాలన్న నిబంధ నను, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఎడ్) కోర్సును కొనసాగించే నిబంధనల అమలుకు విద్యా మండలి చర్యలు చేపట్టింది. వాటికి సంబంధించిన ప్రవేశాలు చేపట్టేందుకు వీలుగా నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. ప్రారంభిస్తారా.. లేదా.. తేల్చని కోర్సులు బీఈఎల్ఈడీ: బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ. బీఎస్సీ-బీఎడ్/బీఏ-బీఎడ్: నాలుగేళ్ల కోర్సు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ఎంఎడ్: మూడేళ్ల కోర్సు. బీఎడ్ పార్ట్ టైం: మూడేళ్ల కోర్సు. డిస్టెన్స్ బీఎడ్: రెండేళ్ల కోర్సు. యూజీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్: ఏడాది కోర్సు కాలపరిమితి పెంపు కోర్సులు డీఈఎల్ఈడీ: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. రెండేళ్ల కోర్సు. బీఎడ్: ఏడాది కోర్సుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇకపై రెండేళ్ల కోర్సు. ఎంఎడ్: ఏడాది మాత్రమే ఉన్న మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ఇకపై రెండేళ్ల కోర్సు. బీపీఈడీ: ఏడాది మాత్రమే ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇకపై రెండేళ్ల కోర్సు. ఎంపీఈడీ: ఏడాది కోర్సుగానే ఉన్న మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇకపై రెండేళ్ల కోర్సు. -
కెరీర్ కౌన్సెలింగ్
నేను పదో తరగతి పూర్తిచేశాను. పాలిటెక్నిక్‌లో చేరాలనుకుంటున్నాను. దీనిలో ప్రవేశం ఎలా ఉంటుంది. ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలను వివరించండి? పదో తరగతి పూర్తిచేసినవారి ముందున్న చక్కని అవకాశం పాలిటెక్నిక్ కోర్సులు. ఇందులో మూడేళ్ల/మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ ఏడాది మే 21న పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్కండీషనింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: 35 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత. ఎంపిక: పాలిసెట్‌లో ర్యాంకు ఆధారంగా.. పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్ (60 ప్రశ్నలు), ఫిజిక్స్ (30 ప్రశ్నలు), కెమిస్ట్రీ (30 ప్రశ్నలు)ల నుంచి ప్రశ్నలడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. ఇందులో కనీసం 30 శాతం (36 మార్కులు) సాధించాలి. ఉన్నతవిద్య: పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఉన్నత విద్య పరంగా మంచి అవకాశాలున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణులకు నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్) రాసి నేరుగా బీటెక్/బీఈ రెండో ఏడాదిలో ప్రవేశించవచ్చు. తద్వారా సంబంధిత/అనుబంధ బ్రాంచ్‌తో బీటెక్ పూర్తిచేయొచ్చు. తర్వాత గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) రాసి ఎంటెక్/ఎంఈ అభ్యసించవచ్చు. అనంతరం సీఎస్ఐఆర్-నెట్, గేట్ రాసి పీహెచ్డీ కూడా చేయొచ్చు. ఉద్యోగావకాశాలు: పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసినవారికి అవకాశాలపరంగా ఎలాంటి ఢోకాలేదు. సివిల్ ఉత్తీర్ణులకు వివిధ నిర్మాణ రంగ కంపెనీలు, ఇరిగేషన్, రోడ్లు, రైల్వేలు, సర్వే, నీటి సరఫరా విభాగాలు పెద్దపీట వేస్తున్నాయి. మెకానికల్ పూర్తిచేసినవారికి వివిధ వాహన, వస్తు తయారీ కర్మాగారాలు, వర్క్‌షాప్స్, గ్యారేజెస్, ప్రొడక్షన్ యూనిట్స్‌లో ఉద్యోగాలు ఉంటాయి. ఆటోమొబైల్ ఉత్తీర్ణులు ఏపీఎస్ఆర్టీసీ, వివిధ రవాణా విభాగాలు, ఆటోమొబైల్స్ షోరూమ్స్‌ల్లో అవకాశాలు పొందొచ్చు. ప్యాకేజింగ్ టెక్నాలజీ పూర్తిచేసినవారికి ప్యాకేజింగ్ పరిశ్రమలు, పేపర్ తయారీ కర్మాగారాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఫుడ్ అండ్ బేవరేజెస్లో ఉద్యోగాలు ఉంటాయి. ఈఈఈ ఉత్తీర్ణులు ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్‌కోల్లో జాబ్స్ పొందొచ్చు. ఈసీఈ ఉత్తీర్ణులకు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, కమ్యూనికేషన్స్, దూరదర్శన్ మొదలైన విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు. మిగిలిన బ్రాంచ్‌ల ఉత్తీర్ణులకు కూడా ఆయా విభాగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే జూనియర్ ఇంజనీర్స్ పరీక్ష రాసి ఆయా విభాగాల్లో ఇంజనీర్ కావచ్చు. వెబ్సైట్: https://apceep.nic.in/ -
‘పది’లమైన పట్టుతో... పాలిసెట్‌లో మెరుపులు
పది పూర్తయింది మొదలు.. ఎన్నో అవకాశాలు.. మరెన్నో ప్రత్యామ్నాయాలు కళ్లముందు మెదులుతాయి. నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విద్యకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో ఆ దిశగా వేసే అడుగులు ఉజ్వల భవితకు దారిచూపుతాయి. ఇలాంటి కోర్సుల్లో పాలిటెక్నిక్ ఒకటి. ఇందులో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-2014 పై ఫోకస్.. ఇంజనీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ తదితర)లో డిప్లొమా కోర్సులు చేయాలనుకొనే విద్యార్థులు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) రాయాల్సి ఉంటుంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్.బి.టి.ఇ.టి) -ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను చేపట్టింది. అన్ని జిల్లాల ముఖ్య కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష విధానం: ప్రశ్నపత్రం బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్ ) పద్ధతిలో ఉంటుంది. వీటి సమాధానాలను ఓఎమ్ఆర్ పత్రంలో గుర్తించాలి. 120 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగె టివ్ మార్కులు ఉండవు. పరీక్ష సమయం - 2 గంటలు. పరీక్ష-స్వరూపం: సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు మ్యాథ్స్ 60 60 ఫిజిక్స్ 30 30 కెమిస్ట్రీ 30 30 మొత్తం 120 120 అంశాలవారీ ప్రిపరేషన్ ప్లాన్ గణితం:మొత్తం 120 ప్రశ్నలలో 60 ప్రశ్నలు గణితం నుంచే వస్తా యి. కాబట్టి విద్యార్థులు ఈ సబ్జెక్ట్‌పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రిపరేషన్లో మిగతా అంశాలతో పోలిస్తే రెండింతల సమయం గణితానికి కేటాయిచడం మంచిది. అంతేకాకుండా 60 ప్రశ్నలకు 60 నిమిషాలలో మాత్రమే సమాధా నం రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే 120 ప్రశ్నలకు 120 నిమిషాలు మాత్రమే. అంటే తక్కువ సమయంలో వేగంతోపాటు కచ్చితత్వంతో కూడిన జవాబులను గుర్తించేలా సాధన చేయాలి. ఇందుకోసం విద్యార్థులు కొన్ని మెళకువల ను పాటిస్తే గణితంలో అత్యధిక మార్కులు సాధించవచ్చు. ఏ చాప్టర్‌కెన్ని మార్కులు? ప్రవేశ పరీక్షలో వచ్చే గణిత ప్రశ్నలు పదోతరగతి సిలబస్ నుంచే వస్తాయి. వీటిలో అధికభాగం త్రికోణ మితి, వైశ్లేషిక రేఖాగణితం పాఠ్యాంశాల నుంచి ఉంటాయి. ఒక్కో పాఠ్యాంశం నుంచి సుమారు 12 నుంచి 16 ప్రశ్నలు అడిగే వీలుంది. సాంఖ్యక శాస్త్రం, రేఖాగణితం నుంచి 6-8 ప్రశ్నలు, శ్రేఢులు, మాత్రికల నుంచి 3-4 ప్రశ్నలు, మిగిలిన అధ్యాయాలైన ప్రవచనాలు- సమితులు, ప్రమేయాలు, బహుపదులు, ఏకఘాత ప్రణాళిక, వాస్తవ సంఖ్యలు, గణన చాప్టర్లలో ఒక్కో అంశం నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి. త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, సాంఖ్యకశాస్త్రం, రేఖాగణితం, మాత్రికలు, శ్రేఢులు, అధ్యాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే బాగుంటుంది. అవగాహన ముఖ్యం: ప్రశ్నపత్రాన్ని పరిశీలించినట్లయితే ప్రశ్నలు పదోతరగతి సిలబస్ నుంచే ఇస్తున్నప్పటికీ కొంచెం కఠిన స్థాయిలోనే ఉంటుంది. చాలావరకు అప్లికేషన్ (అన్వయించే పద్ధతి) ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలంటే ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం పడుతుంది. (ఉదా: సాంఖ్యకశాస్త్రం). త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, సాంఖ్యకశాస్త్రం, రేఖాగణితం, మాత్రికలు, శ్రేఢుల పాఠ్యాంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. గణితంలో గట్టెక్కండిలా: - గణితానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎక్కువ సమ యం కేటాయించాలి. పాఠ్యాంశాలను సాధన చేయాలి. - పదోతరగతి పాఠ్యాంశాలన్నింటినీ భావనలు, సూత్రాల ఆధారంగా నేర్చుకోవాలి. - పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలు పరిశీలించి, వాటిలో ఇచ్చే ప్రశ్నల స్థాయిని, పాఠ్యాంశాల వెయిటేజీని గుర్తించాలి. తర్వాత ఇదే తరహా ప్రశ్నలు గల సమగ్రమైన మెటీరియల్‌ను, ప్రామాణిక పుస్తకాలను సేకరించుకొని సాధన చేయాలి. - సమస్యలను సాధించేటపుడు ప్రతి ప్రశ్నను 1 నిమిషంలో సాధిస్తున్నారో లేదో అంచనా వేసుకోవాలి. - ఎక్కువగా అన్వయ(అప్లికేషన్) ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రతి పాఠ్యాంశంలో ఈ తరహా ప్రశ్నలపై పట్టు సాధించండి - వివిధ నమూనా పరీక్షలను (మోడల్ టెస్ట్) 2 గంటల సమయం నిర్దేశించుకొని, ఆ సమయంలోనే పరీక్ష పూర్తి చేస్తున్నారో లేదో సరిచూసుకోండి. - నమూనా పరీక్షలను సాధన చేసేటప్పుడు సమాధానాల ను ఓఎంఆర్ పత్రంపైనే గుర్తించేటట్లు సాధన చేయాలి. - అవసరమైన చోట సమస్యలను సాధించేటపుడు సులభమార్గం (షార్ట్ కట్ మెథడ్స్) ఉపయోగించాలి. - పరీక్షరోజున ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరిలో సాధించాలి. - మోడల్ పేపర్స రాసిన తర్వాత మూల్యాంకనం చేసుకొని, తప్పుగా రాసిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని మళ్లీ ప్రాక్టీస్ చేయాలి. - త్రికోణమితి, వైశ్లేషిక రేఖా గణితం, సాంఖ్యక శాస్త్రం, రేఖాగణితం, మాత్రికలు, శ్రేఢులు పాఠ్యాంశాల్లో గల అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. భౌతిక, రసాయన శాస్త్రాలు: భౌతికశాస్త్రంలో 30, రసాయన శాస్త్రం నుంచి 30 మార్కులు చొప్పున మొత్తం 60 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. భౌతిక శాస్త్రంలో పరీక్ష పదోతరగతి స్థాయిలోనే ఉంటుంది. కానీ 8, 9 తరగతుల పాఠ్య పుస్తకాలను కూడా చదవాలి. పదోతరగతిలోని అన్ని పాఠ్యాంశాలతోపాటు, 8వ తరగతిలోని మన విశ్వం, గతిశాస్త్రం, అయస్కాంతత్వం, విద్యుత్ పాఠాలు, 9వ తరగతి నుంచి శుద్ధగతి శాస్త్రం, గతిశాస్త్రం, కాంతి, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం పాఠాలను క్షుణ్నంగా చదవాలి. - పాఠాలలోని భావనలను విపులంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. - సమస్యలను సాధించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి - ప్రతి భౌతిక రాశి ప్రమాణాలను, స్థిరాంకాలను గుర్తుంచుకోవాలి. అన్ని భావనలను విశ్లేషణాత్మకంగా చదివి, బిట్ల రూపంలో తయారు చేసుకోవాలి. - బిట్లో రెండు లేదా మూడు భావనలు ఇమిడి ఉండేలా రాసుకోవాలి. - పదో తరగతిలో ముఖ్యంగా గతిశాస్త్రం, ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఆధునిక భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ అంశాలను క్షుణ్నంగా చదవాలి. - పదో తరగతికి చెందిన పాఠ్య పుస్తకాలు, బిట్‌బ్యాంకులపైనే ఆధార పడకుండా ఇంటర్లో పదో తరగతికి అనుబంధంగా ఉండే పాఠ్యాంశాలను కూడా సాధన చేస్తే బాగుంటుంది. - పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే అతి తక్కువ సమయంలోనే పాలిసెట్ ఉంటుంది. కాబట్టి లక్ష్యాత్మకంగా సాధన చేయాలి. రసాయనంలో రాణించాలంటే: - ఈ అంశం నుంచి కూడా 30 బిట్లు ఉంటాయి. పదో తరగతిలోని 10 అధ్యాయాలూ ముఖ్యమైనవే. వీటితోపాటు 8, 9 తరగతుల పాఠ్య పుస్తకాలను కూడా చదవాలి. - 8వ తరగతిలోని రసాయన చర్యలలో రకాలు, సంకేతాలు - సాంకేతికాలు, ఫార్ములాలు, రసాయన చర్యా వేగాలు ముఖ్యమైనవి. - 9వ తరగతిలోని పరమాణు నిర్మాణం, రసాయన బంధం, లోహ సంగ్రహణ శాస్త్రం ముఖ్యమైనవి. వీటితోపాటు నైట్రోజన్, ఫాస్ఫరస్ అధ్యాయాల నుంచీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పదో తరగతికి అనుబంధంగా ఇంటర్లో ఉండే పాఠ్యాంశాలను కూడా చదివితే మెరుగైన స్కోర్‌కు వీలుంది. పరీక్ష రాసే సమయంలో: మొదటగా రసాయన శాస్త్రంలో అంటే 91-120 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అనంతరం భౌతికశాస్త్రంలోని వాటికి జవాబులు రాయాలి. చివరిగా గణితం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నను క్షుణ్నంగా చదివి సమాధానం కచ్చితంగా రూఢి చేసుకున్న తరువాతనే ఓఎంఆర్‌లో దిద్దాలి. లేకుంటే సమయం వృథా అవుతుంది. ఒక్కోసారి ఆప్షన్స్‌ను యత్న-దోష (ట్రైల్ అండ్ ఎర్రర్ ) పద్ధతి ద్వారా కూడా ఎంపిక చేసుకోవచ్చు. కేవలం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అయినట్లు కాకుండా కొంచెం విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ అయితే పాలిసెట్‌లో మంచి ర్యాంకు సొంతంచేసుకోవచ్చు. మీ కలను సాకారం చేసుకోవచ్చు. పాలిసెట్-2014 ముఖ్య సమాచారం: అర్హత: పదో తరగతి పూర్తి చేసిన వారు. లేదా ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాసు రుసుం: రూ.350 (ఫీజును ఏపీ ఆన్ లైన్, మీసేవ, ఈసేవ కేంద్రాలలోనే చెల్లించాలి) దరఖాస్తు స్వీకరణ తేదీ: 06-04-2014 దరఖాస్తుకు చివరి తేదీ: 28-04-2014 హాల్‌టికెట్ డౌన్లోడ్ తేదీ: 10-05-2014 పరీక్ష తేదీ: 21-05-2014 ఫలితాల వెల్లడి: 06-06-2014 వెబ్సైట్: www.sbtetap.gov.in prepared by: Vanam Raju, (Mathematics); Nagaraja Shekar, (Physical Science) -
ఎన్జీ రంగా వర్సిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, అనుబంధ కోర్సులకు సంబంధించి ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. డిప్లొమా కోర్సులకు ఆగస్టు 19న కౌన్సెలింగ్ మొదలై 21న ముగుస్తుంది. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, వెంకటరామన్న గూడెం(తాడేపల్లి గూడెం) మినహా మిగతా పది కేంద్రాల్లో ఈ తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. డిగ్రీ కోర్సులకు 22వ తేదీ నుంచి 24 వరకు కౌన్సెలింగ్ 11 కేంద్రాల్లో జరుగుతుందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్ ముగిశాక డిఫెన్స్, స్పోర్ట్స్, ఎన్సీసీ, వికలాంగుల కోటాను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరుతో కౌన్సెలింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించి అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వడం లేదని, ఆగస్టు 8న ఇచ్చిన నోటిఫికేషన్లో సూచించిన ప్రకారం ‘గ్రేడ్ పాయింట్ సగటు’ ప్రకారం విద్యార్థులు నిర్ణీత కౌన్సెలింగ్ సెంటర్లలో హాజరు కావాలని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.