సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్-2015లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. ర్యాంకుల వారీగా నిర్ణీత తేదీల్లో విద్యార్థులను వెరిఫికేషన్‌కు హాజరు కావాలని పేర్కొంది.
నిర్ణీత తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండు దఫాలుగా ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారు. ఇక విద్యార్థులు ఈనెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 2వ తేదీన ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని వెల్లడించింది. 5వ తేదీన సీట్లను కేటాయించి, తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో (జ్ట్టిఞట://్టటఞౌడఛ్ఛ్టి.జీఛి. జీ) ఉంచనున్నట్లు తెలిపింది. హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపింది.
వికలాంగులు, క్రీడాకారులకు ప్రత్యేకంగా..
వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కేటగిరీలకు చెందిన వారికి ఈనెల 25, 26 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొంది.
25 నుంచి పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Published Wed, Jun 17 2015 1:54 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement