ఎన్జీ రంగా వర్సిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ | NG Ranga Varsity Counselling Schedule announced | Sakshi
Sakshi News home page

ఎన్జీ రంగా వర్సిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ

Published Thu, Aug 15 2013 4:29 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

NG Ranga Varsity Counselling Schedule announced

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, అనుబంధ కోర్సులకు సంబంధించి ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. డిప్లొమా కోర్సులకు ఆగస్టు 19న కౌన్సెలింగ్ మొదలై 21న ముగుస్తుంది. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, వెంకటరామన్న గూడెం(తాడేపల్లి గూడెం) మినహా మిగతా పది కేంద్రాల్లో ఈ తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. డిగ్రీ కోర్సులకు 22వ తేదీ నుంచి 24 వరకు కౌన్సెలింగ్ 11 కేంద్రాల్లో జరుగుతుందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్ ముగిశాక డిఫెన్స్, స్పోర్ట్స్, ఎన్‌సీసీ, వికలాంగుల కోటాను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరుతో కౌన్సెలింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించి అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వడం లేదని, ఆగస్టు 8న ఇచ్చిన నోటిఫికేషన్‌లో సూచించిన ప్రకారం ‘గ్రేడ్ పాయింట్ సగటు’ ప్రకారం విద్యార్థులు నిర్ణీత కౌన్సెలింగ్ సెంటర్లలో హాజరు కావాలని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement