శివాజీనగర్, న్యూస్‌లైన్ : ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి పొందవచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) జాయింట్ డెరైక్టర్ ఇప్ప వెంకటరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్‌మాల్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... నిఫ్ట్ స్వయం ప్రతిపత్తి గల విద్యా సంస్థ అని, 1986లో కేంద్ర వస్త్ర మంత్రిత్వశాఖ ద్వారా సంస్థ ఏర్పాటైందన్నారు. ఫ్యాషన్ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన విద్యా శిక్షణ ఇచ్చి పరిశ్రమ అభివృద్ధికి నిఫ్ట్ కృషిచేస్తుందన్నారు.
నిఫ్ట్ విద్యా సంస్థ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడి ందని, సంస్థ ఇచ్చే డిగ్రీకి ప్రభుత్వ గుర్తింపు ఉందన్నారు. సంస్థ కార్యాలయం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉందన్నారు. జిల్లాలోని విద్యావంతులైన వారు 2014 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులో శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్ పూర్తిచేసిన వారు ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, టెక్స్‌టైల్ డిజైనింగ్, ఎక్సేసరీ డిజైనింగ్, నిట్‌వేర్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు, డిగ్రీ చదివిన వారు ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండేళ్ల కోర్సుకు అర్హులన్నారు. దరఖాస్తులను జనవరి 10లోగా పంపాలన్నారు. రాత పరీక్ష 2014, ఫిబ్రవరి 9, 23 తేదీల్లో ఉంటాయని వారు తెలిపారు.
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో ఉపాధి, ఉద్యోగావకాశాలు
Published Sat, Nov 30 2013 6:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement