shivaji nagar
-
ఈ పాన్బీడాకు 115 ఏళ్లు
శివాజీనగర: మంచి భోజనం చేశాక పాన్ బీడా లేకుంటే ఏదో లోటే. తమలపాకు–వక్క–తీపి–కొన్ని సుగంధ ద్రవ్యాలతో కూడిన పాన్‌ను ఆరగిస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి పాన్‌కు ఈ దుకాణం ప్రసిద్ధి. బెంగళూరు శివాజీనగర్‌లో ఉన్న రస్సెల్ మార్కెట్ ప్రజలందరికీ చిరుపరచితమే. సుమారు 50 సంవత్సరాలకు పైగా పాత బడిన రస్సెల్ మార్కెట్ శివాజీ నగరంలో కేంద్ర బిందువు. అయితే రస్సెల్ మార్కెట్ కంటే పురాతనమైనది ఒకటి ఉంది, అదే హాజీ బాబా పాన్ బీడా దుకాణం. 1903లో దివంగత అబ్దుల్ ఖలీక్ ద్వారా ప్రారంభించిన ఈ పాన్ షాపు వయసు 115 సంవత్సరాలంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. రాత్రి పూట మాత్రమే అబ్దుల్ ఖలీక్ మనవడు అబ్దుల్ బషీర్ ఇప్పుడీ అంగడిని నడుపుతున్నాడు. విందు భోజనం తరువాత మనోల్లాసం కలిగించే పాన్ బీడా తయారీలో మూడుతరాలుగా వీరు ఆదరణ చూరగొంటున్నారు. ఇక్కడ వ్యాపారం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారజామున 3 గంటల వరకు మాత్రం జరుగుతోంది. ఆంగ్లేయుల పాలన నుంచి రద్దీ అలాగే ఉందని వారు చెబుతారు. ప్రముఖులతో ప్రశంసలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి వారిచేత కూడా పాన్‌బీడా తయారీదారులు ప్రశంసలు అందుకున్నారు. మాజీ మంత్రి శివాజీనగర ఎమ్మెల్యే ఆర్. రోషన్ బేగ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు హాజి పాన్ బీడా అంటే చాలా ఇష్టపడుతారు. పాన్ తినటానికే నగరంలోని ఎక్కడెక్కడి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. 4 రకాల పాన్లు ఇక్కడ బషీర్ తయారు చేసేది కేవలం నాలుగు రకాలైన పాన్లను మాత్రమే. స్వీట్ పాన్, మగై, సాదా, జర్దా ఈ నాలుగు విధాల పాన్లను మాత్రం ఆయన తయారు చేస్తారు. అయితే హాజి బాబా పాన్ దుకాణం రోజంతా ఓపెన్‌లో ఉండదు. పాన్ తయారీకి వీరు ఉపయోగించేది కలకత్తా, బనారస్ ఆకులు మాత్రమే. ప్రారంభంలో ఒక పాన్ ధర 10 పైసలు ఉండేది. ప్రస్తుతం రూ.15 అయింది. ఆ రుచే రప్పిస్తోంది: బషీర్ తమ దుకాణంలో కేవలం నాలుగు విధాల పాన్లు మాత్రం తయారు చేస్తున్నా కూడా ప్రజలు చాలా ఇష్టపడటానికి కారణం సాటి లేని రుచే కారణమని బషీర్ అంటున్నారు. తాము పాన్ బీడాకు ఉపయోగించే దినుసులు ప్రత్యేకమని చెబుతారు. వక్కను తాము కత్తిరించే విధానం కర్ణాటకలో ఏ షాప్‌లోనూ కనిపించదంటారు గర్వంగా. పాన్‌లో యాలకులు, లవంగం ఉపయోగించటంతో రుచి పెరుగుతుందని చెప్పారు. రంజాన్‌లో వ్యాపారం మరింత పెరుగుతుందన్నారు. వంశపారంపర్యంగా కొనసాగించిన ఈ పాన్ బీడా షాపును నడిపేందుకు తమ బిడ్డలు ఇష్టపడడం లేదని చెప్పారు. ఇద్దరు కుమారులు ఉన్నత చదవులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని బషీర్ తెలిపారు. ఈ విద్యను ఎంతో మందికి నేర్పామని, వారు చుట్టుపక్కల సుమారు 50 షాపులు పెట్టుకుని ఉపాధి పొందుతున్నారని తెలిపారు. -
ఫోన్ మెసేజ్‌తో భయానకం..
శివాజీనగర (హాసన్): ప్రేమ, పెళ్లి అని వేధిస్తున్న కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్ ఆగడాలు భరించలేక న్యాయశాస్త్రం విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించింది. ఈ సంఘటన హాసన్ జిల్లా సకలేశపురలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సకలేశపురలో ఒక కాలేజీలో లా ఫస్టియర్ విద్యార్థిని ఆదరగెర గ్రామానికి చెందిన సుదేశ్–సుమిత్రల కుమార్తె తనుశ్రీ (18) మృతి చెందిన యువతి. ఆమె ప్రతిరోజు కాలేజీకి బస్సులో రాకపోకలు సాగించేది. ఆమె తరచుగా ప్రయాణించే బస్సులోని డ్రైవర్ సంతోష్ రెండు సంవత్సరాల నుంచి తనుశ్రీని ప్రేమిస్తున్నానని వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు. తనుశ్రీ ఎక్కడ కనిపించినా ఈమె తన ప్రియురాలు, ఈమెనే వివాహం చేసుకొంటానని స్నేహితులతోను, తోటి ఉద్యోగులతో చెబుతుండేవాడు. ఫోన్ మెసేజ్‌తో భయానకం - ఈ నెల 3న తనుశ్రీకి మెసేజ్ చేసిన సంతోష్, ‘నేను మద్యంలో విషం కలుపుకొని తాగి మరణిస్తున్నాను. మన ప్రేమ విషయంలో మీ తండ్రే గెలిచాడు. అయితే అది జరగటం లేదు. నేనిప్పుడు చస్తున్నాను. మరు జన్మమంటే ఉంటే కలుసుకొందాం’’ అని టైపు చేసి పంపాడు. మెసేజ్ చూచి భయపడిన తనుశ్రీ అదే రోజు సాయంత్రం ఇంట్లో ఉన్న పురుగులమందును తాగింది. తక్షణమే ఆమెను మంగళూరులోని ఏజే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించకపోవటంతో ఈ నెల 17న మరణించింది. పురుగులమందు తాగిన సంతోష్ మంగళూరులోని ఫాదర్ ముల్లార్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
చిట్టీల పేరుతో ఘరానా మోసం
హైదరాబాద్: నగరంలోని బోరబండ శివాజీనగర్‌లో చిట్టీల పేరుతో ఓ మహిళ కుచ్చుటోపి పెట్టింది. బాధితుల నుంచి కోటిన్నర వసూలు చేసి ఆ డబ్బుతో ఊడాయించింది. పుష్ప అనే మహిళ కొంతకాలంగా చిట్టీల పేరుతో వ్యాపారం చేస్తోంది. డబ్బు అందగానే చిన్నగా జారుకుంది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో ఉపాధి, ఉద్యోగావకాశాలు
శివాజీనగర్, న్యూస్‌లైన్ : ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి పొందవచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) జాయింట్ డెరైక్టర్ ఇప్ప వెంకటరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్మాల్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... నిఫ్ట్ స్వయం ప్రతిపత్తి గల విద్యా సంస్థ అని, 1986లో కేంద్ర వస్త్ర మంత్రిత్వశాఖ ద్వారా సంస్థ ఏర్పాటైందన్నారు. ఫ్యాషన్ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన విద్యా శిక్షణ ఇచ్చి పరిశ్రమ అభివృద్ధికి నిఫ్ట్ కృషిచేస్తుందన్నారు. నిఫ్ట్ విద్యా సంస్థ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడి ందని, సంస్థ ఇచ్చే డిగ్రీకి ప్రభుత్వ గుర్తింపు ఉందన్నారు. సంస్థ కార్యాలయం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉందన్నారు. జిల్లాలోని విద్యావంతులైన వారు 2014 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులో శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్ పూర్తిచేసిన వారు ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, టెక్స్టైల్ డిజైనింగ్, ఎక్సేసరీ డిజైనింగ్, నిట్వేర్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు, డిగ్రీ చదివిన వారు ఫ్యాషన్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండేళ్ల కోర్సుకు అర్హులన్నారు. దరఖాస్తులను జనవరి 10లోగా పంపాలన్నారు. రాత పరీక్ష 2014, ఫిబ్రవరి 9, 23 తేదీల్లో ఉంటాయని వారు తెలిపారు.