హైదరాబాద్‌కు విరాట్ కోహ్లీ ఫ్యాషన్ బ్రాండ్ ‘రాన్’
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్‌కు చెందిన యూత్ ఫ్యాషన్ బ్రాండ్ ‘రాన్'.. ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్లను విస్తరించే సన్నాహాల్లో ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కూడా స్టోర్‌ను ప్రారంభించనుంది. హైదరాబాద్ తోపాటు ముంబై, బెంగళూరులో ఐదు ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు.. షాపర్స్ స్టాప్ స్టోర్లలో షాప్ ఇన్ షాప్స్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విస్తరణపై దృష్టిపెట్టామని, వచ్చే రెండుమూడేళ్ల కాలంలో విదేశీ మార్కెట్లలోకి ప్రవేశిస్తామన్నారు.