సినిమాల్లోకి కోహ్లి..? | Is Virat Kohli And Anushka Sharma Clash At Box Office | Sakshi
Sakshi News home page

సినిమాల్లోకి కోహ్లి..?

Published Fri, Sep 21 2018 12:30 PM | Last Updated on Fri, Sep 21 2018 1:01 PM

Is Virat Kohli And Anushka Sharma Clash At Box Office - Sakshi

విరాట్‌ కోహ్లి - అనుశ్క శర్మ (ఫైల్‌ ఫోటో)

ఈ రోజు విరాట్‌ కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ ఫోటోను చూసిని దగ్గర నుంచి అభిమానుల మెదళ్లలో ‘కోహ్లి సినిమాల్లో నటిస్తున్నారా.. ఇంతకు ఏ సినిమా.. షూటింగ్‌ ఎక్కడ జరుగుతుంది’ వంటి అనుమానాలు వస్తున్నాయి. అంతేకాక కోహ్లి తన షేర్‌ చేసిన ఫోటోతో పాటు ‘పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నాను ’అంటూ కామెంట్‌ చేశారు. పైగా రిలీజింగ్‌ డేట్‌ అంటూ ఈ నెల 28ని ప్రకటించారు.ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఇదే రోజు ఆయన సతీమణి అనుష్క శర్మ నటించిన ‘సూయి ధాగా’ చిత్రం విడుదలవుతోంది. దాంతో ఇప్పుడు అందరిలో ఒకే అనుమానం.. కోహ్లి సినిమాల్లోకి వస్తున్నారా.. హీరోగానా లేకా తన భార్య అనుష్క చిత్రంలో ఏదైనా గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్నారా.. అది కాక ఏదైనా షార్ట్‌ ఫిలింలో నటిస్తున్నారా అంటూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే.

 కోహ్లి షేర్‌ చేసిన ఫోటోలో విరాట్‌ కోహ్లి ‘ట్రైలర్‌ ద మూవీ’ అని ఉంది. దీన్ని వాగ్న్‌ ప్రొడక్షన్‌ వారు రూపొందిస్తున్నట్లు ఉంది. ఈ ఫోటోలో కోహ్లి సూపర్‌ హీరో అవతారంలో ఉన్నారు. అంతేకాక ‘పది సంవత్సరాల తర్వాత మరో డెబ్యూ ఇంకా వెయిట్‌ చేయలేను’ అంటూ కామెంట్‌ చేశారు. దాంతో పాటు సెప్టెంబర్‌ 28న విడుదల అవ్వనున్నట్లు తెలిపాడు. వాగ్న్‌ అనేది ఒక ప్రముఖ చెప్పుట బ్రాండ్‌. సో కోహ్లి యాడ్‌ గురించి చెప్పాడా.. లేక తన సిని ఆరంగ్రేటం గురించి చెప్పాడా అన్నది తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement