box office battle
-
ప్రభాస్‌తో పోటీకి బాలీవుడ్ భామ సై
బాలీవుడ్ భామ అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గంగూభాయ్ కతియావాడి. ఈ చిత్రంలో ఆలియాభట్ సెక్స్‌వర్కర్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్స్ అజయ్‌దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మీ, హ్యూమా ఖురేషి తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా నేడు(ఫిబ్రవరి24) సంజయ్ లీలా భన్సాలీ జన్మదినం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌తోపాటు విడుదల తేదిని బుధవారం అధికారికంగా ప్రకటించారు. జులై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినిమాలోని తన పోస్టర్‌ను అలియా షేర్ చేశారు. అయితే గంగూభాయ్ అదే నెలలో రిలీజ్ అవుతున్న మరో భారీ చిత్రంతో పోటీపడనుంది. అదే తేదీ జులై 30న ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం విడుదల కానుంది. రాధే శ్యామ్ తెలుగుతో పాటు పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అందులో హిందీ కూడా ఒకటి. దీంతో ఈ రెండు చిత్రాలు బీటౌన్ బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. మరి రెండు సినిమా పోటీ పడతాయా లేదంటే ఎవరైనా వెనక్కి తగ్గుతారా అనేది వేచి చూడాలి. వాస్తవానికి గుంగూభాయి గతేడాది సెప్టెంబర్ 11నే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడటంతో రిలీజ్ వాయిదా పడింది. మూవీ స్టోరి విషయానికొస్తే మాఫియా రారాణి గంగూభాయి కతియావాడికి చెందిన కథ. ఫేమస్ రైటర్ జైదీ రాసిన పుస్తకం ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అంతేగాక అలియాకు సంజయ్ లీలాతో ఇది తొలి ప్రాజెక్టు. దీనికంటే ముందు సల్మాన్‌ఖాన్ నటించిన ఇన్షల్లాలో ఈ చిత్ర నిర్మాతతో కలిసి నటించాల్సి ఉంది. కానీ అది ఆగిపోయింది. మరోవైపు అలియా తెలుగులో ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) చిత్రంలో నటిస్తోంది. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదలకానుంది. చదవండి: రామ్‌చరణ్–ఆలియా పోటాపోటీగా.. ఆదిపురుష్: ప్రభాస్ ఫొటో వైరల్ View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) -
సినిమాల్లోకి కోహ్లి..?
ఈ రోజు విరాట్ కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫోటోను చూసిని దగ్గర నుంచి అభిమానుల మెదళ్లలో ‘కోహ్లి సినిమాల్లో నటిస్తున్నారా.. ఇంతకు ఏ సినిమా.. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది’ వంటి అనుమానాలు వస్తున్నాయి. అంతేకాక కోహ్లి తన షేర్ చేసిన ఫోటోతో పాటు ‘పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నాను ’అంటూ కామెంట్ చేశారు. పైగా రిలీజింగ్ డేట్ అంటూ ఈ నెల 28ని ప్రకటించారు.ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఇదే రోజు ఆయన సతీమణి అనుష్క శర్మ నటించిన ‘సూయి ధాగా’ చిత్రం విడుదలవుతోంది. దాంతో ఇప్పుడు అందరిలో ఒకే అనుమానం.. కోహ్లి సినిమాల్లోకి వస్తున్నారా.. హీరోగానా లేకా తన భార్య అనుష్క చిత్రంలో ఏదైనా గెస్ట్ రోల్లో నటిస్తున్నారా.. అది కాక ఏదైనా షార్ట్ ఫిలింలో నటిస్తున్నారా అంటూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. View this post on Instagram Another debut after 10 years, can't wait! 😀 #TrailerTheMovie www.trailerthemovie.com A post shared by Virat Kohli (@virat.kohli) on Sep 20, 2018 at 8:30pm PDT కోహ్లి షేర్ చేసిన ఫోటోలో విరాట్ కోహ్లి ‘ట్రైలర్ ద మూవీ’ అని ఉంది. దీన్ని వాగ్న్ ప్రొడక్షన్ వారు రూపొందిస్తున్నట్లు ఉంది. ఈ ఫోటోలో కోహ్లి సూపర్ హీరో అవతారంలో ఉన్నారు. అంతేకాక ‘పది సంవత్సరాల తర్వాత మరో డెబ్యూ ఇంకా వెయిట్ చేయలేను’ అంటూ కామెంట్ చేశారు. దాంతో పాటు సెప్టెంబర్ 28న విడుదల అవ్వనున్నట్లు తెలిపాడు. వాగ్న్ అనేది ఒక ప్రముఖ చెప్పుట బ్రాండ్. సో కోహ్లి యాడ్ గురించి చెప్పాడా.. లేక తన సిని ఆరంగ్రేటం గురించి చెప్పాడా అన్నది తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాలి. -
బాక్సాఫీస్ బరిలో ఆ ముగ్గురు
చెన్నై: ఆ ముగ్గురు మూడు భాషా సినీ రంగాలకు దిగ్గజాల్లాంటివారు. విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టించే సూపర్ స్లార్లు. వారే బాలీవుడ్ హీరో్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ హీరో మహేష్ బాబు, తమిళ హీరో ధనుష్. ఇపుడు ఈ దిగ్గజ త్రయం హీరోలుగా వస్తున్న సినిమాలు భజరంగీ భాయిజాన్, శ్రీమంతుడు, మారి సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అయితే ఇక సినీ అభిమానులకు పండగే పండగే. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్, మహేష్ హీరోగా శ్రీమంతుడు, ధనుష్ మారి సినిమాలు జూలై 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీనికి సంబంధించి భజరంగీ భాయిజాన్ దర్శకుడు కబీర్ ఖాన్ , శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, మారి దర్శకుడు బాలాజీ మోహన్ తమ సినిమాల విడుదల తేదీలను దాదాపు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ దిగ్గజ త్రయం మధ్య భారీ పోటీ నెలకోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు థియేటర్ల కోసం ఈ మూడు సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటున్నాయి. థియేటర్ల యజమానులకు ఈ పోటీ కత్తి మీద సాములాంటిదే అని ప్రముఖ సినీ ఎనలిస్టు త్రినాథ్ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మోస్ట్ ఎవైటెడ్ మూవీ బాహుబలి కూడా ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ ముగ్గురు సూపర్ స్టార్లు కలిసి బాహుబలి రాబళ్లను కొల్లగొడతారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 10 న విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న రాజమౌళి చారిత్రాత్మక మూవీ బాహుబలి తొలి వారం రోజుల్లోనే వసూళ్లను రాబట్టాల్సి ఉందనీ, లేదంటే అనుకున్నట్టుగా ఈమూడు సినిమాలు ఒకే వారంలో రిలీజయితే రాజమౌళికి కష్టాలు తప్పవేమో అని వారు అంచనా వేస్తున్నారు.