బాక్సాఫీస్ బరిలో ఆ ముగ్గురు
చెన్నై: ఆ ముగ్గురు మూడు భాషా సినీ రంగాలకు దిగ్గజాల్లాంటివారు. విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టించే సూపర్ స్లార్లు. వారే బాలీవుడ్ హీరో్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ హీరో మహేష్ బాబు, తమిళ హీరో ధనుష్. ఇపుడు ఈ దిగ్గజ త్రయం హీరోలుగా వస్తున్న సినిమాలు భజరంగీ భాయిజాన్, శ్రీమంతుడు, మారి సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అయితే ఇక సినీ అభిమానులకు పండగే పండగే. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్, మహేష్ హీరోగా శ్రీమంతుడు, ధనుష్ మారి సినిమాలు జూలై 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీనికి సంబంధించి భజరంగీ భాయిజాన్ దర్శకుడు కబీర్ ఖాన్ , శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, మారి దర్శకుడు బాలాజీ మోహన్ తమ సినిమాల విడుదల తేదీలను దాదాపు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ దిగ్గజ త్రయం మధ్య భారీ పోటీ నెలకోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు థియేటర్ల కోసం ఈ మూడు సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటున్నాయి. థియేటర్ల యజమానులకు ఈ పోటీ కత్తి మీద సాములాంటిదే అని ప్రముఖ సినీ ఎనలిస్టు త్రినాథ్ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మోస్ట్ ఎవైటెడ్ మూవీ బాహుబలి కూడా ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ ముగ్గురు సూపర్ స్టార్లు కలిసి బాహుబలి రాబళ్లను కొల్లగొడతారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 10 న విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న రాజమౌళి చారిత్రాత్మక మూవీ బాహుబలి తొలి వారం రోజుల్లోనే వసూళ్లను రాబట్టాల్సి ఉందనీ, లేదంటే అనుకున్నట్టుగా ఈమూడు సినిమాలు ఒకే వారంలో రిలీజయితే రాజమౌళికి కష్టాలు తప్పవేమో అని వారు అంచనా వేస్తున్నారు.