AI Artist Pics Viral Allu Arjun Prabhas Mahesh Babu as Elderly Men - Sakshi
Sakshi News home page

అయ్యయ్యో! ఐకానిక్‌ స్టార్‌, ప్రిన్స్‌ మహేష్‌, డార్లింగ్‌ ప్రభాస్‌? ఎందుకిలా?

Published Thu, May 11 2023 7:44 PM | Last Updated on Wed, May 17 2023 2:53 PM

AI artist pics viral allu arjun Prabhas Maheshbabu as elderly men - Sakshi

సాక్షి,ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆర్ట్  సోషల్‌ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. ఇటీవల జిమ్‌లో  కసరత్తు చేస్తున్న బిజినెస్‌ టైకూన్స్‌ ఐఏ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేశాయి.ఇపుడిక సూపర్‌స్టార్ల వంతు.  టాలీవుడ్‌,  బాలీవుడ్‌ పాపులర్‌ నటులను ఏఐ ఫోటోలు హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ప్రభాస్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ మొదలు  షారూక్‌ ఖాన్‌, రణబీర్‌కపూర్‌ వరకు ఏఐ ఫోటోలు సంచలనంగా మారాయి. ఈ సూపర్‌ ప్టార్లంతా వృద్ధులుగా ఏలా కనిపిస్తారో చూపిస్తోంది. ముడతలుపడిన తమ హీరోల ముఖాలు చూసి కొంతమంది ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతున్నప్పటికీ, మరికొంతమంది మాత్రం టెక్నాలజీ మహిమ మామా అంటూ వ్యాఖ్యానించారు. 


షారుఖ్ ఖాన్

ఏఐ ఆర్టిస్ట్ SK MD అబూ సాహిద్  స్టార్‌ నటులను వృద్ధులుగా మార్చడానికి మిడ్‌ జర్నీని ఉపయోగించారట. ఏఐ నటులను ముసలాళ్లుగా ఊహించుకుంటోందనే క్యాప్షన్‌తో వీటిని షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ తదితర ఫోటోలను ఆయన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. (ఎస్‌బీఐ అకౌంట్‌ బ్రాంచ్‌ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్‌గా)


సల్మాన్‌ ఖాన్‌

ముఖ్యంగా టాలీవుడ్‌  హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్‌, మహేష్‌ బాబు ఫోటోలు చూసి తీరాలి.  ఇటీవల  ధోని, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాలతో సహా భారత క్రికెట్ జట్టులోని స్టార్ ప్లేయర్లు  భారీ కాయులుగా, ముసలాళ్లుగా మారితే ఎలా ఉంటారనే ఏఐ ఫోటోలు వైరలైన సంగతి తెలిసిందే. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement