ఇంటికి కావాల్సిన వస్తువుల విషయంలో ఇల్లాలి మాటే దాదాపు ఫైనల్! ఆమెకు సంబంధించిన దుస్తుల విషయంలో..? అమ్మాయిల మాటలకే అమ్మలు ఓటేస్తారట. చీరలు మొదలుకొని అన్ని రకాలు దస్తులు, ఫ్యాషన్ విషయంలో అమ్మాయిలు ఓకే చెప్పాల్సిందే. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది.
వయసు అంతరమున్నాఅమ్మల మనసు తెలుసుకుని ఎలాంటివైతే నచ్చుతాయో వాటినే అమ్మాయిలు ఎంపిక చేస్తారట. దుస్తుల ఎంపికలో అమ్మాయిల మాటే ఫైనల్ అని 48 శాతం మంది మహిళలు చెప్పారు. ఇక 19 శాతం మంది.. గతంలో పిల్లలతో వాదించేవారమని, ప్రస్తుతం అమ్మాయిలకే దుస్తుల నాణ్యత గురించి ఎక్కువ తెలుసని చెప్పారు. మరో 35 శాతం మంది.. తమ అమ్మాయిలకున్న డ్రెస్ల వంటివే పొరపాటున కొనుగోలు చేయకుండా ఉండేందుకు వారితో సంప్రదిస్తామని తెలిపారు.
మొత్తమ్మీద దుస్తుల కొనుగోలు విషయంలో ఈ తరం అమ్మలకు అమ్మాయిల మాటే వేదవాక్కు. 'అమ్మకు నచ్చితే.. అమ్మాయికి నచ్చినట్టే' అన్నది పాత మాట. 'అమ్మాయికి నచ్చితే.. అమ్మకు నచ్చినట్టే' అన్నది కొత్త సంగతి. ఇక ఫ్యాషన్ విషయంలోనూ.. అంటే తమ వయసుకు తగ్గట్టు హుందాగా ఉండేలా కూతుళ్ల సలహాలను పాటిస్తారట.
అమ్మాయిలకు నచ్చితే.. అమ్మలకు నచ్చినట్టే!
Published Sun, Oct 20 2013 2:52 PM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM
Advertisement