ఫిట్‌ సెట్‌ గ్లో | Kurta Pajamas Make Great Looks At Parties | Sakshi
Sakshi News home page

ఫిట్‌ సెట్‌ గ్లో

Published Fri, Jan 17 2020 1:52 AM | Last Updated on Fri, Jan 17 2020 1:52 AM

Kurta Pajamas Make Great Looks At Parties - Sakshi

ఏ వయసు వారికైనా కుర్తా–పైజామా వన్నె తెస్తుంది. సరైనా టాప్‌ సరిపోయే బాటమ్‌ ఎంచుకుంటే ఆకృతి అదిరిపోతుంది. రెగ్యులర్‌గా వేసుకోవడానికి పార్టీల్లో ధరించడానికి వీలుగా దుపట్టాలను, టాప్స్‌ను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం. కుర్తా–పైజామా సెట్‌ను ఫిట్‌గా స్టిచ్‌ చేయించుకోండి. సౌందర్యంతో వెలిగిపోండి.

►ఈ కుర్తా సెమీ సిల్క్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసినది. దీనికి చికంకారి, సీక్వెన్స్‌ ఎంబ్రాయిడరీ ఉన్న ఫ్యాబ్రిక్‌ని యోక్‌కి, స్లీవ్స్‌కి వాడారు. అదనంగా స్లీవ్స్‌కి ఫ్రిల్స్‌ వాడటంతో ఆకర్షణీయంగా మారింది. ఫ్రిల్స్, గ్యాదర్స్, టాజిల్స్‌ ఫ్యాషన్‌లో ఉన్నాయి కాబట్టి వీటిని ఉపయోగిస్తూ చేసిన డిజైన్‌ ఇది. లైట్‌ గోల్డ్‌ కలర్‌ బార్డర్‌ని నెట్‌ దుపట్టాకు జత చేశారు. సేమ్‌ కలర్‌ ప్రింటెడ్‌ ట్రౌజర్‌ని బాట మ్‌గా వేశారు.

►ఇది జార్జెట్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన కుర్తా. స్కర్ట్‌ పార్ట్‌ని సర్క్యులర్‌ ఫ్లెయిర్‌ తీసుకున్నారు. జార్జెట్‌ దుపట్టా. యోక్‌లో సెల్ఫ్‌కలర్‌ కట్‌దానా ఎంబ్రాయిడరీ చేశారు. ఫ్లెయిర్‌ ఉన్న స్కర్ట్‌ పార్ట్‌కి సెల్ఫ్‌ కలర్‌లో మిషన్‌ థ్రెడ్‌ ఎంబ్రాయిడరీ చేశారు. దుపట్టా జార్జెట్‌. అంచులు థ్రెడ్‌ ఎంబ్రాయిడరీ. రెండింటిలో ఆఫ్‌వైట్‌ కాంబినేషన్‌ ఉంది కాబట్టి బాటమ్‌గా హాఫ్‌వైట్‌ తీసుకున్నారు.

►ఇది రా సిల్క్‌ కుర్తా. ఈ ఫ్యాబ్రిక్‌లో ప్లెయిన్‌నే ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఇది రెండు భిన్నమైన షేడ్స్‌ ఉన్న ఫ్యాబ్రిక్‌. సింగిల్‌ ఫ్యాబ్రిక్‌లోనే హై నెక్‌ తీసుకున్నారు. ఈ షేడ్‌ను అడ్డంగానూ, నిలువుగానూ తీసుకోవచ్చు. ఇప్పుడు మోచేతుల వరకు స్లీవ్స్‌ ఉండటం అనేది ఫ్యాషన్‌లో ఉంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. దుపట్టా నెట్‌ది తీసుకొని రెండు షేడ్స్‌ వచ్చేలా డై చేయించి, లైట్‌ గోల్డ్‌ కలర్‌ కాంబినేషన్‌తో చేసిన ఎంబ్రాయిడరీ అంచును దుపట్టాకు జత చేశారు. స్లిమ్‌ ఫిట్‌ ట్రౌజర్, యాంకిల్‌ లెంగ్త్‌ లెగ్గింగ్‌ బాటమ్‌గా వాడుకోవచ్చు.

►శాటిన్‌ ఆనియన్‌ పింక్‌ అనార్కలీ ఇది. కలీ భాగాన్ని ఐదు మీటర్లతో డిజైన్‌ చేశారు. దీనికి ముదురు మెరూన్‌ కలర్‌ నెట్‌ దుపట్టా ఇచ్చారు. దుపట్టా అంచులకు టాజిల్స్‌ను జత చేశారు. నెక్‌కి, స్ట్రెయిట్‌ లైన్‌కి స్వీక్వెన్స్, బీడ్స్‌తో ఎంబ్రాయిడరీ చేశారు. దుపట్టా రంగులో ఉన్న కాటన్‌ సిల్క్‌ ట్రౌజర్‌ని బాటమ్‌గా ఉపయోగించారు.

►చందేరీ బ్రొకేడ్‌తో డిజైన్‌ చేసిన చైనీస్‌ నెక్‌ అనార్కలీ ఇది. 90ల కాలంలో పఫ్‌ స్లీవ్స్‌ ఫ్యాషన్‌లో ఉండేవి. ఇప్పుడు ఇవి ట్రెండ్‌లో ఉన్నాయి కాబట్టి ఈ స్లీవ్స్‌ జత చేశారు. ఆర్గంజా దుపట్టాకి ఫ్రిల్స్‌ జత చేశారు. అయితే, ఈ ఫ్రిల్స్‌కి వైర్‌ పీకో చేయడంతో వంపులు తిరిగినట్టు వస్తుంది. రెగ్యులర్‌ చుడీకన్నా స్టైలిష్‌ లుక్‌ కోసం యాంకిల్‌ లెంగ్త్‌ లెగ్గింగ్‌ వేసుకుంటే బాగుంటుంది.

►శాటిన్‌ ప్రింటెడ్‌ ఫ్యాబిక్‌తో డిజైన్‌ చేసిన కుర్తా ఇది. కుర్తాకి నడుము దగ్గర నుంచి సైడ్‌ స్లిట్‌ తీసుకున్నారు. బీడ్స్‌తో ఎంబ్రాయిడరీ చేసిన నెక్‌లైన్‌ని జత చేశారు. బ్లాక్‌ గ్రే కాంబినేషన్‌లో ఉన్న ప్రింట్‌ కాబట్టి గ్రే కలర్‌ నెట్‌ దుపట్టాకు తీసుకున్నారు. దీనికి సన్నని స్టోన్స్‌ స్టిక్‌ చేశారు. ఈ దుపట్టాకి శాటిన్‌ ఫ్రిల్‌ లైన్‌ని తయారుచేసి జతచేశారు. కుర్తా కి వైట్, గ్రే ప్రింట్‌ ఉంది కాబట్టి దుపట్టాను కూడా అదే కలర్‌ కాంబినేషన్‌తో డిజైన్‌ చేశారు.
మంగారెడ్డి ఫ్యాషన్‌ డిజైనర్‌
mrstitchingsolutions@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement