Embroidery design
-
250 మంది మహిళలు, ఒకే ఆలోచన.. గిన్నిస్ బుక్‌లో చోటు
250 మంది మహిళలు ఆరు నెలల్లో 2,719 క్రొచెట్ పాంచోలు తయారుచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ΄పాంచోలను గిరిజన పిల్లలకు ఉచితంగా పంచిపెడుతున్నారు. విశాఖపట్నం వేదికగా వీరందరూ ఒక తాటి మీదకు వచ్చి చేసిన ఈ ప్రయత్నం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. మహిళా మనోవికాసం పేరుతో క్రొచెట్ గ్రూప్‌ను ప్రారంభించిన మాధవి సూరిభట్ల, డెభ్బై ఏళ్ల వయసులోనూ చురుగ్గా పాల్గొన్న రాఘవమ్మ, టీమ్‌లీడర్‌గా ఫణి శిరీష, తనూజలు ఈ సందర్భంగా ఈ రికార్డు సాధనపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొత్త ప్రపంచం కుటుంబ జీవనంలోనే ఏళ్లు గడిచిపోయాయి. 70 ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంబ్రాయిడరీ, క్రొచెట్ అల్లిక చిన్నప్పటి నుంచీ అలవాటు. మహిళా గ్రూప్‌లో చేరి నాలుగేళ్లు అవుతోంది. వచ్చిన పనిని నలుగురితో షేర్ చేసుకోవడం, తెలియంది తెలుసుకోవడం చేస్తుంటాను. ఇంటి దగ్గర రోజూ కొంత సమయం ఎంబ్రాయిడరీకి కేటాయిస్తుంటాను. ఈ గ్రూప్ ద్వారా ఈవెంట్లో పాల్గొని చాలామంది మహిళలతో పరిచయాలు పెంచుకోగలిగాను. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా, చాలా ఆనందంగా అనిపించింది. – డి.వి.రాఘవమ్మ, విజయవాడ గ్రూప్‌కి లీడర్ని మా పిల్లలతో కలిసి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. మూడేళ్ల క్రితం మహిళా మనోవికాస్లో జాయిన్ అయ్యాను. 25 మంది ఉన్న గ్రూప్‌కి లీడర్‌గా ఉన్నాను. ఇలా మొత్తం తొమ్మిది టీమ్స్ ఉన్నాయి. ఒక్కో టీమ్‌లో 25 నుంచి 35 వరకు ఉంటారు. నెల రోజులు ఆన్లైన్లో క్రొచెట్ కోర్సు నేర్చుకున్నాను. కిందటేడాది గ్రూప్ అంతా దాదాపు 4,686 క్రొచెట్ టోపీలు అల్లి, ఈవెంట్ చేశాం. ఆ టోపీలను చలి ఎక్కువ ఉండే గిరిజన ప్రాంతాల పిల్లలకు అందజేశాం. ఈసారి పాంచోస్ను కూడా అదేవిధంగా పంపిణీ చేస్తున్నాం. రెండుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉంది. – ఫణి శిరీష, హైదరాబాద్ ఆన్లైన్ క్లాసుల నుంచి మొదలు... ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం చేసే నేను పిల్లలు సెటిలయ్యాక మానేశాను. ఇంటి వద్ద ఉంటూ నా హాబీస్ పైన దృష్టి పెట్టాను. అన్నిరకాల హ్యాండ్‌క్రాఫ్ట్స్ చేయగలను. అందులో భాగంగానే నా క్రాఫ్ట్ వర్క్ నలుగురికీ తెలియజేద్దామని ఎఫ్‌బిలో మధురం క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరుతో పోస్ట్ చేసేదాన్ని. కొంతమంది తమకు క్లాసులు చెప్పమన్నారు. దీంతో కోవిడ్ టైమ్‌లో గ్రూప్ స్టార్ట్ చేసి, ఆన్లైన్ క్లాసులు చెబుతూ వచ్చాను. విదేశాలలోనూ నా స్టూడెంట్స్ ఉన్నారు. చెన్నై గ్రూప్‌తో 3 సార్లు క్రొచెట్ గిన్నిస్ రికార్డ్‌లో పాల్గొన్నాను. నా వ్యక్తిగతంగానే ఏడుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించాను. వైజాగ్‌లోనూ ఈవెంట్ చేయాలనే ఆలోచనతో మహిళా మనోవికాస్ పేరుతో గ్రూప్ ప్రారంభించాను. ఆన్లైన్లో మహిళలకు క్రోచెట్ క్లాసులు తీసుకునేదాన్ని. ఒకరి ఆలోచనను ఇంకొకరు పంచుకుంటూ క్రొచెట్ అల్లికలు చేసి, వాటిని పేదవారికి పంచాలనేది ఆలోచన. దేశ విదేశాల నుంచి ఒకరి ద్వారా మరికొందరు పరిచయం అవుతూ ఆన్లైన్లో ఒక తాటిమీదకు వచ్చారు. కిందటేడాది క్రొచెట్ టోపీలు తయారుచేశాం. ఇప్పుడు పాంచోస్ తయారుచేశాం. పెళ్లి అయిన తర్వాత గృహిణులుగా ఉన్నవారు తమ జీవితంలో ఎలాంటి అచీవ్మెంట్ లేదు అనుకునేవారికి ఇదో మంచి బూస్టింగ్ అయ్యింది. మా గ్రూప్‌లో క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. కీమో తీసుకుంటూ కూడా ఈ అల్లికలు చేశారు. ఈవెంట్‌కు అటెండ్ అవ్వాలనుకునేవారు 150 మెంబర్స్ వచ్చారు. ఆరేళ్ల పాప నుంచి 80 ఏళ్ల వయసు వారు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అందరికీ ఇది ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పవచ్చు. – మాధవి సూరిభట్ల, విశాఖపట్నం మా పిల్లలకూ నేర్పిస్తున్నాను.. డెలీవరీ టైమ్‌లో ఖాళీగా ఉండటంతో ఆన్లైన్లో క్రోచెట్ బేసిక్స్ నేర్చుకున్నాను. ఆర్డర్స్ మీద అమీ గ్రూమీ స్టఫ్డ్ టాయ్స్ కూడా చేయడం నేర్చుకున్నాను. మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరూ పది పాంచోస్ చేస్తే చాలు అనుకున్నాను. నేను 25 పాంచోస్ చేసిచ్చాను. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఎలా అచీవ్మెంట్ వస్తుంది అని. కొంతమంది ‘మాకు నేర్పిస్తారా, మేం ఎలా ఇందులో పాల్గొనాలి..’ అని అడుగుతున్నారు. ట్రైబల్ పిల్లలకు వాటిని అందజేశారు. – తనూజ, నంద్యాల -నిర్మలా రెడ్డి -
ఖర్చు ఎక్కువని భయపడుతున్నారా? ఈ డిజైనర్ పట్టీలతో..
Outfit Elevation Design Ideas: వేడుకల సందర్భాల్లో ధరించే సంప్రదాయ దుస్తులకు ఎంబ్రాయిడరీ చేయించడం చూస్తూనే ఉంటాం. వాటి తయారీ కోసం కొన్ని రోజుల వరకు ఎదురుచూడటం ఖర్చు ఎక్కువ అవుతుందనుకోవడం కూడా వింటుంటాం. వీటి స్థానంలో మార్కెట్లో లభించే వివిధ రకాల డిజైనరీ పట్టీలు విస్తృతంగా వచ్చి చేరాయి. ఈ ఎంబ్రాయిడరీ స్ట్రిప్స్‌తో డ్రెస్ స్టైల్లో వచ్చిన మార్పులు మరింత అందాన్ని తీసుకువస్తున్నాయి. ఇతర అలంకారాలకూ.... బ్యాగ్, బ్యాంగిల్స్, నడుముకు ధరించే బెల్ట్... ఇలాంటి వాటిని కూడా అందమైన ఎంబ్రాయిడరీ పట్టీలను ఉపయోగిస్తూ తమ స్టైల్‌ని మరింత ఆకర్షణీయంగా మార్చేస్తున్నారు. ఇందుకు చేయాల్సిందల్లా మ్యాచింగ్ స్ట్రిప్స్‌ని ఎంచుకోవడమే. అందుకు ఎలాగూ అవకాశం ఉంది కదా! కాటన్, సిల్క్, డెనిమ్... ఫ్యాబ్రిక్ ఏదైనా, ఇండో వెస్ట్రన్ స్టైల్‌కి తీసుకురావచ్చు. సంప్రదాయ ఎంబ్రాయిడరీ స్ట్రిప్స్ ఎంచుకుంటే వాటిని కుర్తీ, లెహంగా, శారీ డిజైన్స్‌కు వాడచ్చు. అదే, వెస్ట్రన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నవి లేదా మన ఇతర ప్రాచీన ఎంబ్రాయిడరీ కళతో ఉన్న స్ట్రిప్స్‌ని మోడర్న్ డ్రెస్ డిజైన్స్‌లో ఉపయోగించవచ్చు. చదవండి: Fashion Trends: వేడుకలో మరింత వెలిగిపోయేలా.. Malavika Sharma: అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర 68 వేలకు పైమాటే! -
Fashion: హైనెక్ బ్లౌజ్ డిజైన్స్‌ని ఇష్టపడేవాళ్లకు పర్ఫెక్ట్ ఛాయిస్!
Blouse Back Neck Embroidery Designs: ఇంట్లో నిత్యం మన కళ్ల ముందు కనిపించే వస్తువులను పెయింటింగ్ రూపంలో చూసే ఉంటారు. అదే ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఎలా ఉంటాయో ఈ బ్లౌజ్ డిజైన్స్ చూస్తే తెలిసిపోతుంది. క్యాలెండర్, కుట్టు మిషన్, రేడియో, కుండల దొంతర.. ఇలా మన కళ్ల ముందు కనిపించే వస్తువులనే కుట్టుపనితో అందమైన డిజైన్లుగా రూపుకట్టవచ్చు చీర కట్టుకు ప్రత్యేక కళ తీసుకురావచ్చు.. చీరకట్టు పాతదే. కానీ, అన్ని డ్రెస్సుల్లోనూ ఎవర్గ్రీన్ మార్కులు కొట్టేస్తూ ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన కళను సొంతం చేసుకుంటూనే ఉంటుంది. ఏ చిన్న హంగు చేరినా మరింత ఆకర్షణీయంగా మారిపోతుంది. శుభానికి సూచనగా, అపురూపమైన జ్ఞాపకాలను రూపుకట్టేలా చేస్తే ఎక్కడైనా ప్రత్యేకంగా వెలిగిపోతుంది. ఇక దానికి సరికొత్త ఎంబ్రాయిడరీ జత చేరితే అందం, ఆకర్షణ కలబోసుకున్నట్టే. బ్లౌజ్ డిజైన్లలో బ్యాక్ స్పేస్ పెయింటింగ్‌కి కాన్వాస్గానే ఎంబ్రాయిడరీకి ముచ్చటైన వేదికయ్యింది. హైనెక్ బ్లౌజ్ డిజైన్స్‌ని ఇష్టపడేవాళ్లు ఇలా ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ లేదా పెయింటింగ్ లుక్‌తో అదనపు హంగులను చేర్చచ్చు అని నిరూపిస్తున్నారు డిజైనర్లు. చదవండి: Actress Poorna: ‘పర్ఫెక్ట్ బ్రాండ్’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే! -
పర్ఫెక్ట్ కాంబినేషన్.. కట్టిపడేస్తోన్న ప్రింటెడ్ లెహంగా
వేడుక ఏదైనా లెహంగా నేటికీ కొత్తగా మెరుస్తూనే ఉంది. అమ్మాయిల మనసు లెహంగా చుట్టూ అల్లుకుంటూనే ఉంది. ఎంబ్రాయిడరీతో మెరిపించినా, ప్యాచ్‌లు జత చేర్చినా పువ్వులు సింగారించినా, ప్రింట్లు సందడి చేసినా వెస్ట్రన్ టాప్ చేరాల్సిందే లెహంగా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే! మెహందీ వేడుకల్లో ఇండో వెస్ట్రన్ స్టైల్ యువతను బాగా ఆకట్టుకుంటుంది. అందుకే, ప్లెయిన్ బెల్ స్లీవ్స్ టాప్, ప్రింటెడ్ లెహంగా పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా కట్టిపడేస్తోంది. ఫ్లోరల్: రంగురంగుల పువ్వులన్నీ లెహంగా డ్రెస్ మీద వచ్చి చేరినట్టు చేసిన డిజైన్ మెహిందీ వేడుకలకు మరిన్ని సొబగులను అద్దుతుతుంది. వేడుకను మరింత వైబ్రెంట్‌గా మార్చేస్తుంది. వెస్ట్రన్ కేప్‌కి ఇండియన్ స్టైల్ ఎబ్రాయిడరీతో ప్రింటెడ్ లెహంగాకు కొత్త రూపు తీసుకువచ్చి వేడుకలో హైలైట్‌గా వెలిగిపోవచ్చు అని చూపుతోంది ఈ డిజైన్. జాకెట్ స్టైల్ టాప్ కాంబినేషన్‌తో పూర్తిగా వెస్ట్రన్ లుక్ అనిపిస్తున్న లెహంగా డ్రెస్. సంప్రదాయ వేడుకలనూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునేలా చేస్తోంది. ఇండియన్ ఆర్కిటెక్చర్ థీమ్‌తో ఆకట్టుకునే డిజైన్స్ తీసుకువచ్చే పంజాబీ డిజైనర్ పరమ్సాహిబ్ రూపొందించిన లెహంగా. పూర్తి జరీ ఎంబ్రాయిడరీతో లెహంగా, వెస్ట్రన్ పెప్లమ్ టాప్‌తో జత చేసిన వేడుకలకు ఆకట్టుకునే లుక్ తీసుకువచ్చారు. -
ఫిట్ సెట్ గ్లో
ఏ వయసు వారికైనా కుర్తా–పైజామా వన్నె తెస్తుంది. సరైనా టాప్ సరిపోయే బాటమ్ ఎంచుకుంటే ఆకృతి అదిరిపోతుంది. రెగ్యులర్‌గా వేసుకోవడానికి పార్టీల్లో ధరించడానికి వీలుగా దుపట్టాలను, టాప్స్‌ను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం. కుర్తా–పైజామా సెట్‌ను ఫిట్‌గా స్టిచ్ చేయించుకోండి. సౌందర్యంతో వెలిగిపోండి. ►ఈ కుర్తా సెమీ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసినది. దీనికి చికంకారి, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ ఉన్న ఫ్యాబ్రిక్‌ని యోక్‌కి, స్లీవ్స్‌కి వాడారు. అదనంగా స్లీవ్స్‌కి ఫ్రిల్స్ వాడటంతో ఆకర్షణీయంగా మారింది. ఫ్రిల్స్, గ్యాదర్స్, టాజిల్స్ ఫ్యాషన్‌లో ఉన్నాయి కాబట్టి వీటిని ఉపయోగిస్తూ చేసిన డిజైన్ ఇది. లైట్ గోల్డ్ కలర్ బార్డర్ని నెట్ దుపట్టాకు జత చేశారు. సేమ్ కలర్ ప్రింటెడ్ ట్రౌజర్ని బాట మ్గా వేశారు. ►ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన కుర్తా. స్కర్ట్ పార్ట్‌ని సర్క్యులర్ ఫ్లెయిర్ తీసుకున్నారు. జార్జెట్ దుపట్టా. యోక్లో సెల్ఫ్కలర్ కట్‌దానా ఎంబ్రాయిడరీ చేశారు. ఫ్లెయిర్ ఉన్న స్కర్ట్ పార్ట్‌కి సెల్ఫ్ కలర్లో మిషన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారు. దుపట్టా జార్జెట్. అంచులు థ్రెడ్ ఎంబ్రాయిడరీ. రెండింటిలో ఆఫ్‌వైట్ కాంబినేషన్ ఉంది కాబట్టి బాటమ్‌గా హాఫ్‌వైట్ తీసుకున్నారు. ►ఇది రా సిల్క్ కుర్తా. ఈ ఫ్యాబ్రిక్‌లో ప్లెయిన్నే ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఇది రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న ఫ్యాబ్రిక్. సింగిల్ ఫ్యాబ్రిక్‌లోనే హై నెక్ తీసుకున్నారు. ఈ షేడ్‌ను అడ్డంగానూ, నిలువుగానూ తీసుకోవచ్చు. ఇప్పుడు మోచేతుల వరకు స్లీవ్స్ ఉండటం అనేది ఫ్యాషన్‌లో ఉంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. దుపట్టా నెట్ది తీసుకొని రెండు షేడ్స్ వచ్చేలా డై చేయించి, లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌తో చేసిన ఎంబ్రాయిడరీ అంచును దుపట్టాకు జత చేశారు. స్లిమ్ ఫిట్ ట్రౌజర్, యాంకిల్ లెంగ్త్ లెగ్గింగ్ బాటమ్‌గా వాడుకోవచ్చు. ►శాటిన్ ఆనియన్ పింక్ అనార్కలీ ఇది. కలీ భాగాన్ని ఐదు మీటర్లతో డిజైన్ చేశారు. దీనికి ముదురు మెరూన్ కలర్ నెట్ దుపట్టా ఇచ్చారు. దుపట్టా అంచులకు టాజిల్స్ను జత చేశారు. నెక్కి, స్ట్రెయిట్ లైన్‌కి స్వీక్వెన్స్, బీడ్స్‌తో ఎంబ్రాయిడరీ చేశారు. దుపట్టా రంగులో ఉన్న కాటన్ సిల్క్ ట్రౌజర్ని బాటమ్‌గా ఉపయోగించారు. ►చందేరీ బ్రొకేడ్‌తో డిజైన్ చేసిన చైనీస్ నెక్ అనార్కలీ ఇది. 90ల కాలంలో పఫ్ స్లీవ్స్ ఫ్యాషన్‌లో ఉండేవి. ఇప్పుడు ఇవి ట్రెండ్‌లో ఉన్నాయి కాబట్టి ఈ స్లీవ్స్ జత చేశారు. ఆర్గంజా దుపట్టాకి ఫ్రిల్స్ జత చేశారు. అయితే, ఈ ఫ్రిల్స్కి వైర్ పీకో చేయడంతో వంపులు తిరిగినట్టు వస్తుంది. రెగ్యులర్ చుడీకన్నా స్టైలిష్ లుక్ కోసం యాంకిల్ లెంగ్త్ లెగ్గింగ్ వేసుకుంటే బాగుంటుంది. ►శాటిన్ ప్రింటెడ్ ఫ్యాబిక్తో డిజైన్ చేసిన కుర్తా ఇది. కుర్తాకి నడుము దగ్గర నుంచి సైడ్ స్లిట్ తీసుకున్నారు. బీడ్స్‌తో ఎంబ్రాయిడరీ చేసిన నెక్‌లైన్‌ని జత చేశారు. బ్లాక్ గ్రే కాంబినేషన్లో ఉన్న ప్రింట్ కాబట్టి గ్రే కలర్ నెట్ దుపట్టాకు తీసుకున్నారు. దీనికి సన్నని స్టోన్స్ స్టిక్ చేశారు. ఈ దుపట్టాకి శాటిన్ ఫ్రిల్ లైన్‌ని తయారుచేసి జతచేశారు. కుర్తా కి వైట్, గ్రే ప్రింట్ ఉంది కాబట్టి దుపట్టాను కూడా అదే కలర్ కాంబినేషన్‌తో డిజైన్ చేశారు. మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ mrstitchingsolutions@gmail.com -
బెలూన్లు స్టిచింగ్
బామ్మ చీర అయినా నేటి భామకు అమితంగా నచ్చుతుంది ఎందుకంటే.. ఇలా బెలూన్స్ స్లీవ్స్‌తో చీరకట్టుకు సరికొత్త భాష్యం చెప్పవచ్చు. ఏ వేడుక అయినా వైవిధ్యంగా వెలిగిపోవచ్చు. చీర కట్టుకు కీలకమైన కీ రోల్ బ్లౌజ్దే. ఆరుగజాల చీర అందం సరైన ఫిటింగ్‌తో ఉండే బ్లౌజ్‌తోనే తెలుస్తుంది. ‘సింపుల్‌గా ఉన్నామా, స్టైలిష్‌గా ఉన్నామా, హుందాగా కనిపిస్తున్నామా..’ అని ఎదుటివారికి తెలిసేలా చేసేది బ్లౌజ్ డిజైనే. అందుకే అతివలు బ్లౌజ్ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.ఏ వేడుకకైనా పట్టుచీర కట్టడం ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. అలాగని నిన్నటి తరం వారిలా కాకుండా పట్టుకు డిఫరెంట్ కాంబినేషన్‌తో స్టైలిష్ బ్లౌజ్ ధరించి చూపులను కట్టడి చేస్తున్నారు. ఇతరత్రా ఎంబ్రాయిడరీ వర్క్ హంగులేవీ లేకుండా కేవలం బెల్ స్లీవ్స్‌తో బోల్డ్ లుక్స్‌ని లాగేస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. బాలీవుడ్ టు టాలీవుడ్ ఇటు యంగ్ గర్ల్స్ నుంచి అందమైన అతివల వరకు ఈ బ్లౌజ్‌లను ధరించి గ్రేస్‌గా వెలిగిపోతున్నారు. ►సంప్రదాయ పండగలు, వివాహ వేడుకలకూ ఈ స్టైల్ నప్పుతుంది ►ఇండోవెస్ట్రన్ స్టైల్ ప్రత్యేక పార్టీలలోనూ గ్రేట్ లుక్స్‌ని కొల్లగొడుతుంది ►కంజీవరం, బెనారస్.. పట్టు ఏదైనా ప్లెయిన్ బెలూన్ స్లీవ్స్ బ్లౌజ సరైన ఎంపిక అవుతుంది. ►బెనారస్, కంచి పట్టు చీరలు మోటిఫ్స్‌తో లుక్ గ్రాండ్‌గా ఉంటాయి. దీని మీదకు అదే రంగు బ్లౌజ్ ధరిస్తే లుక్‌లో పెద్ద మార్పు ఉండదు. అదే కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్‌కి స్లీవ్స్‌లో భిన్నమైన ప్యాటర్న్ తీసుకుంటే లుక్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. – శైలేష్ సింఘానియా, ఫ్యాషన్ డిజైనర్ -
పల్లె టూర్లో...
పల్లెకి వెళ్తే లంగా ఓణీ టూర్‌కి వెళ్తే లాంగ్ గౌన్ ఒక డ్రెస్ కొంటే రెండు వెరైటీ డ్రెస్సులు విప్పు.. కుట్టు.. కట్టు. వెస్ట్రన్వేర్గా ఈ లాంగ్ గౌన్ని ధరించి ఈవెనింగ్ పార్టీలో మెరిపించవచ్చు. ఇదే డ్రెస్ నడుము దగ్గర విప్పి, సెట్ చేసుకుంటే లెహెంగా చోలీలా డిజైన్ మార్చుకోవచ్చు. దీనికి రెడీగా ఉన్న ఓణీని జత చేస్తే సంప్రదాయ సొగసుతో ఆకట్టుకోవచ్చు. ఈ లెహంగా గౌన్ కాంబినేషన్ షిఫాన్, బెనారస్, రా సిల్క్.. ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసినవి. ఎంబ్రాయిడరీ, ప్రింట్లు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ రెడీమేడ్ డిజైనర్ వేర్ ఆన్లైన్, మార్కెట్లో రెడీగా ఉంది. ఒక సెట్ ధర ఐదు వేల రూపాయల నుంచి అందుబాటులో ఉంది. -
పండగ వేళ కచ్ ప్యాచ్ కళ
గుజరాత్‌లోని ఓ జిల్లా కచ్. ఇక్కడి హస్తకళలకు అంతర్జాతీయ పేరుంది. కచ్‌వర్క్ ఎంబ్రాయిడరీ గురించి మనకూ తెలిసిందే! దసరా ఉత్సవాల్లో కచ్‌లో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులను మన రాష్ట్రంలోనూ మగువలు ముచ్చటపడి ధరిస్తుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రులకు వీటి ప్రాధాన్యం ఎక్కువ. అద్దాలు, రంగు రంగుల దారాల, తెల్లటి పూసలతో చేసే ఈ గిరిజన కళ మగువ ఒంటిమీద మనసారా వెలిగిపోతుంటుంది. పండగ వేళ మరీ అతిగా కాకుండా తక్కువ వర్క్‌తో ఎక్కువ కళ వచ్చేలా ఎలా ప్యాచ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దసరా నవరాత్రులన్ని రోజుల్లోనూ కళగా కనిపించాలనే మీ కలను కచ్ వర్క్ ప్యాటర్న్స్ తీరుస్తాయి. ఇవి అంచులుగా విడిగా లభిస్తున్నాయి. బ్లౌజ్ పార్ట్గానూ, విడిగా హ్యాండ్స్గానూ ప్యాచులుగా ఇవి కలర్ఫుల్గా సందడిచేస్తున్నాయి. పూర్తి గుజరాతీ స్టైల్ వర్క్ ఉన్న డ్రెస్ ధరించాలంటే ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, పైగా అనుకున్న డిజైన్ రాదు అనుకునేవారికి ఈ ప్యాచ్‌లు వరంలా ఉపయోగపడుతున్నాయి. ‘కచ్ వర్క్, మిర్రర్స్‌తో తీర్చిదిద్దిన డ్రెస్ లేదు. ∙ప్యాచ్‌వర్క్ చేయలేరు..’ కలర్‌ఫుల్ డ్రెస్ లేదు అని వర్రీ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ప్లెయిన్ డ్రెస్ మీదకు ఇలా ఓ కలర్ ఫుల్ కచ్ వర్క్ చేసిన దుపట్టా ధరిస్తే చాలు. ∙ప్లెయిన్ చీరకు కొంగుగా కచ్‌వర్క్ చేసిన ఎంబ్రాయిడరీ ప్యాచ్. కొద్ది మొత్తంతో బ్లౌజ్ నెక్కి, చేతుల అంచుకి జత చేస్తే చాలు. ∙ఖర్చు పెద్దగా అవసరం లేని, పండగ కళ వచ్చే కాన్సెప్ట్ మరొకటి ఉంది. కాటన్ పటోలా చీరను లెహంగామీదకు దుపట్టాగా మార్చి, బ్లౌజ్ హ్యాండ్స్‌కి అదే థీమ్ స్లీవ్స్ జత చేస్తే చాలు. ∙ప్లెయిన్ కుర్తాకి ఛాతీ భాగంలో గుజరాతీ స్టైల్ ఆర్ట్ వర్క్ ప్యాచ్‌ని జత చేస్తే కలర్ఫుల్గా మారిపోతుంది. ∙ఫుట్‌పాత్ మీద నుంచి షాపింగ్‌మాల్ వరకు అన్నింటా సందడి చేస్తున్న ఫ్యాషన్ జ్యువెల్రీ ఇది. నడుము పట్టీలు, తలకు చుట్టుకునేవి, మెడలో ధరించేవి... వివిధ మోడల్స్‌లో లభిస్తున్నాయి. లెహంగా, పొడవాటి కుచ్చులున్న గౌన్ల మీదకి ఈ ఆభరణాలను ధరించుకుంటే నవరాత్రులలో కళగా కనిపిస్తారు. ∙నవరాత్రులలో నవ్యంగా కనిపించాలంటే ఎంబ్రాయిడరీ చేసిన ఓ పెప్లమ్ బ్లౌజ్, ధోతీ ప్యాంట్ ధరించి చూడండి. డ్యాన్స్‌కి ఓ కొత్త కళ వచ్చేస్తుంది. ∙మరే అలంకరణ అక్కర్లేకుండా ప్లెయిన్ శారీ మీదకు గుజరాతీ స్టైల్ఎంబ్రాయిడరీ చేసిన మెటీరియల్‌తో ఓ బ్లౌజ్‌ని రెడీ చేసుకోండి. పండగలో కళగా వెలిగిపోతారు. ఈ ప్యాచ్‌లు.. రూ.200/– రూపాయల నుంచి లభ్యమవుతున్నాయి. -
బెస్ట్ ఈస్ట్‌వెస్ట్
ఇండో వెస్టర్న్ చమక్కులివి. ఈస్ట్ వెస్ట్ల బెస్ట్ కలబోత ఇది! ఫారిన్ కట్ ఇండియన్ కట్టు ఇది! ది బెస్ట్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్!! ► అనార్కలీ, లెహంగా కలసి లాంగ్ స్లీవ్స్ గౌన్‌గా రూపుకట్టిందీ డ్రెస్. దీనికి ఎంబ్రాయిడరీ డిజైన్ జత చేరడంతో రూపు మన సంప్రదాయానికి చిరునామా అయ్యింది. ► లాంగ్ గౌన్ మీద సంప్రదాయపు ఎంబ్రాయిడరీ కుట్టు పార్టీలలో హైలైట్‌గా నిలుపుతుంది. ► ఫ్లోరల్ ప్రింట్స్ లెహంగా షోల్డర్ లెస్ క్రాప్ టాప్ ధరిస్తే ఈ తూరుపును ఆ పశ్చిమాన్ని కలిపినట్టుగా ఉందీ పోజ్. ► ఎరుపు రంగు మీద చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ లెహంగా పూర్తి సంప్రదాయాన్ని కళ్లకు కడుతూనే స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్‌తో వెస్ట్రన్ లుక్ స్టైలిష్‌గా అదరగొడుతోంది. ► లెహంగాకు టాప్ బ్లౌజ్ విత్ చున్నీగా గౌన్ స్టైల్ ఇవ్వడంతో ఇండోవెస్ట్రన్కి కొత్త భాష్యం చెబుతోంది. ► స్లీవ్‌లెస్ డిజైనర్ మ్యాక్సీ గౌన్ ఇది. లెగ్గింగ్ విత్ లాంగ్ టాప్ అనిపించేలా మతులు పోగొడుతుంది.