గుజరాత్‌లోని ఓ జిల్లా కచ్. ఇక్కడి హస్తకళలకు అంతర్జాతీయ పేరుంది. కచ్‌వర్క్ ఎంబ్రాయిడరీ గురించి మనకూ తెలిసిందే! దసరా ఉత్సవాల్లో కచ్‌లో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులను మన రాష్ట్రంలోనూ మగువలు ముచ్చటపడి ధరిస్తుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రులకు వీటి ప్రాధాన్యం ఎక్కువ. అద్దాలు, రంగు రంగుల దారాల, తెల్లటి పూసలతో చేసే ఈ గిరిజన కళ మగువ ఒంటిమీద మనసారా వెలిగిపోతుంటుంది. పండగ వేళ మరీ అతిగా కాకుండా తక్కువ వర్క్‌తో ఎక్కువ కళ వచ్చేలా ఎలా ప్యాచ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
దసరా నవరాత్రులన్ని రోజుల్లోనూ కళగా కనిపించాలనే మీ కలను కచ్ వర్క్ ప్యాటర్న్స్ తీరుస్తాయి. ఇవి అంచులుగా విడిగా లభిస్తున్నాయి. బ్లౌజ్ పార్ట్‌గానూ, విడిగా హ్యాండ్స్‌గానూ ప్యాచులుగా ఇవి కలర్‌ఫుల్‌గా సందడిచేస్తున్నాయి. పూర్తి గుజరాతీ స్టైల్ వర్క్ ఉన్న డ్రెస్ ధరించాలంటే ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, పైగా అనుకున్న డిజైన్ రాదు అనుకునేవారికి ఈ ప్యాచ్‌లు వరంలా ఉపయోగపడుతున్నాయి. ‘కచ్ వర్క్, మిర్రర్స్‌తో తీర్చిదిద్దిన డ్రెస్ లేదు.
∙ప్యాచ్‌వర్క్ చేయలేరు..’ కలర్‌ఫుల్ డ్రెస్ లేదు అని వర్రీ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ప్లెయిన్ డ్రెస్ మీదకు ఇలా ఓ కలర్ ఫుల్ కచ్ వర్క్ చేసిన దుపట్టా ధరిస్తే చాలు.
∙ప్లెయిన్ చీరకు కొంగుగా కచ్‌వర్క్ చేసిన ఎంబ్రాయిడరీ ప్యాచ్. కొద్ది మొత్తంతో బ్లౌజ్ నెక్‌కి, చేతుల అంచుకి జత చేస్తే చాలు.
∙ఖర్చు పెద్దగా అవసరం లేని, పండగ కళ వచ్చే కాన్సెప్ట్ మరొకటి ఉంది. కాటన్ పటోలా చీరను లెహంగామీదకు దుపట్టాగా మార్చి, బ్లౌజ్ హ్యాండ్స్‌కి అదే థీమ్ స్లీవ్స్ జత చేస్తే చాలు.
∙ప్లెయిన్ కుర్తాకి ఛాతీ భాగంలో గుజరాతీ స్టైల్ ఆర్ట్ వర్క్ ప్యాచ్‌ని జత చేస్తే కలర్‌ఫుల్‌గా మారిపోతుంది.
∙ఫుట్‌పాత్ మీద నుంచి షాపింగ్‌మాల్ వరకు అన్నింటా సందడి చేస్తున్న ఫ్యాషన్ జ్యువెల్రీ ఇది. నడుము పట్టీలు, తలకు చుట్టుకునేవి, మెడలో ధరించేవి... వివిధ మోడల్స్‌లో లభిస్తున్నాయి. లెహంగా, పొడవాటి కుచ్చులున్న గౌన్ల మీదకి ఈ ఆభరణాలను ధరించుకుంటే నవరాత్రులలో కళగా కనిపిస్తారు.
∙నవరాత్రులలో నవ్యంగా కనిపించాలంటే ఎంబ్రాయిడరీ చేసిన ఓ పెప్లమ్ బ్లౌజ్, ధోతీ ప్యాంట్ ధరించి చూడండి. డ్యాన్స్‌కి ఓ కొత్త కళ వచ్చేస్తుంది.
∙మరే అలంకరణ అక్కర్లేకుండా ప్లెయిన్ శారీ మీదకు గుజరాతీ స్టైల్‌ఎంబ్రాయిడరీ చేసిన మెటీరియల్‌తో ఓ బ్లౌజ్‌ని రెడీ చేసుకోండి. పండగలో కళగా వెలిగిపోతారు. ఈ ప్యాచ్‌లు.. రూ.200/– రూపాయల నుంచి లభ్యమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment