
Blouse Back Neck Embroidery Designs: ఇంట్లో నిత్యం మన కళ్ల ముందు కనిపించే వస్తువులను పెయింటింగ్ రూపంలో చూసే ఉంటారు. అదే ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఎలా ఉంటాయో ఈ బ్లౌజ్ డిజైన్స్ చూస్తే తెలిసిపోతుంది. క్యాలెండర్, కుట్టు మిషన్, రేడియో, కుండల దొంతర.. ఇలా మన కళ్ల ముందు కనిపించే వస్తువులనే కుట్టుపనితో అందమైన డిజైన్లుగా రూపుకట్టవచ్చు చీర కట్టుకు ప్రత్యేక కళ తీసుకురావచ్చు..
చీరకట్టు పాతదే. కానీ, అన్ని డ్రెస్సుల్లోనూ ఎవర్‌గ్రీన్ మార్కులు కొట్టేస్తూ ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన కళను సొంతం చేసుకుంటూనే ఉంటుంది. ఏ చిన్న హంగు చేరినా మరింత ఆకర్షణీయంగా మారిపోతుంది.
శుభానికి సూచనగా, అపురూపమైన జ్ఞాపకాలను రూపుకట్టేలా చేస్తే ఎక్కడైనా ప్రత్యేకంగా వెలిగిపోతుంది. ఇక దానికి సరికొత్త ఎంబ్రాయిడరీ జత చేరితే అందం, ఆకర్షణ కలబోసుకున్నట్టే.
బ్లౌజ్ డిజైన్లలో బ్యాక్ స్పేస్ పెయింటింగ్‌కి కాన్వాస్‌గానే ఎంబ్రాయిడరీకి ముచ్చటైన వేదికయ్యింది. హైనెక్ బ్లౌజ్ డిజైన్స్‌ని ఇష్టపడేవాళ్లు ఇలా ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ లేదా పెయింటింగ్ లుక్‌తో అదనపు హంగులను చేర్చచ్చు అని నిరూపిస్తున్నారు డిజైనర్లు.
చదవండి: Actress Poorna: ‘పర్‌ఫెక్ట్ బ్రాండ్’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే!