బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన సొంత ప్రీమియం స్ట్రీట్‌వేర్ బ్రాండ్ డియావోల్ (D'Yavol)ను ప్రారంభించాడు. ఈ బ్రాండ్ టీజర్‌ను ఆర్యన్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ టీజర్ నెట్టింట వైరల్‌గా మారింది.
టీజర్‌లో షారుక్ ఎంట్రీ సూపర్!
ఇందులో ఆర్యన్ ఖాన్‌తో పాటు షారుక్ ఖాన్ కూడా కనిపించారు. బ్రాండ్ లోగో, థీమ్ రూపొందించే విషయంలో ఆర్యన్ తికమకపడుతుంటాడు. ఏదీ ఓ పట్టాన కుదరక పెయింట్ బ్రష్‌ను నేలకేసి కొట్టి వెళ్లిపోతాడు. తర్వాత తన తండ్రి షారుక్ ఖాన్ ఎంటర్ అవుతాడు. అదే బ్రష్‌తో సింపుల్‌గా ఓ గీత గీస్తాడు. అంతే అద్భుతమైన బ్రాండ్ లోగో, థీమ్ ఆవిష్కృతమౌతాయి. వైవిధ్యంతో రూపొందించిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు
ఆర్యన్ గత సంవత్సరం తన ప్రీమియం వోడ్కా బ్రాండ్‌ను ప్రారంభించిన అదే భాగస్వాములైన లెటీ బ్లాగోవా, బంటీ సింగ్‌ల భాగస్వామ్యంతో డియావోల్ పేరుతో ఈ దుస్తుల కంపెనీని ప్రారంభించాడు. వ్యాపార రంగంలోకి ప్రవేశించినప్పటికీ, ఆర్యన్ సినిమా పరిశ్రమతో సంబంధాలు వదులుకోలేదు. తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై నిర్మించనున్న చిత్రం ద్వారా త్వరలో సినిమా రంగ ప్రవేశం చేయనున్నాడు. ఐపీఎల్ వేలం, దానికి సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్‌ల పనుల్లో సోదరి సుహానా ఖాన్‌తో కలిసి ఆర్యన్ పాల్గొంటున్నాడు.
ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్‌లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే..
షారుఖ్ ఖాన్ రూ. 6,289 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న నటులలో ఒకరు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని. వీరికి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. అలాగే VFX స్టూడియోను నడుపుతున్నాడు. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తోంది.
ఆర్యన్ ఖాన్ వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించి ఖాన్ కుటుంబానికి ఇప్పటికే ఉన్న వ్యాపార పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేశాడు. అయితే అత్యంత పోటీ ఉన్న ఫ్యాషన్ పరిశ్రమలో ఆర్యన్ కొత్త వెంచర్, డియావోల్ ఎలా ఉంటుందో.. ఏ మాత్రం విజయవంతం అవుతుందో చూడాలి.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment