ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. బెయిల్ షరతులను సవరించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ముందు హాజరు కావాలన్న షరతును సవరించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఎన్‌సీబీ కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి మీడియా నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నాడు. డ్రగ్స్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేసినందున తన బెయిల్ షరతును సడలించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ను డిసెంబర్ 13న జస్టిస్ నితిన్ సాంబ్రే విచారించే అవకాశం ఉంది.
ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 3న ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 8(సీ), 20(సీ), 27, 28, 29, 35 నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్‌స్(ఎన్‌డీపీఎస్) కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 28న బాంబే హైకోర్టుతో ఆర్యన్‌తో పాటు మరొ ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. 14 కఠినమైన బెయిల్ షరతులు విధించింది. (చదవండి: మీర్జాపూర్ వెబ్ సిరీస్ వివాదం.. హైకోర్టు కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment