
హైదరాబాద్: జీఆర్‌టీ జ్యువెలర్స్ వరుసగా ఎనిమిదవసారి ప్రతిష్టాత్మక ‘లెజెండరీ బ్రాండ్’ అవార్డును దక్కించుకున్నట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. వినియోగదారులు సంస్థ పట్ల చూపెడుతున్న విశ్వాసమే తమకు ఈ అవార్డును తెచ్చిపెట్టిందని ప్రకటన వివరించింది.
జీఎస్‌టీ తమిళనాడులో వరుసగా ఎనిమిదవసారి, కర్ణాటకసహా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 4వ సారి టైమ్స్ ఆఫ్ ఇండియా-బిజినెస్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించినట్లు పేర్కొంది. ఐదు దశాబ్దాలపాటు వినియోగదారులకు విశ్వసనీయ, అత్యుత్తమ సేవలు అందించడం సంస్థ పురోగతికి దోహదపడుతున్న అంశమని జీఆర్‌టీ జ్యువెలర్స్ ఎండీ అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. తాము సరైన మార్గంలో పయనిస్తున్నామన్న అంశాన్ని ‘వరుస లెజెండరీ అవార్డు’ నిరూపిస్తోందని మరో ఎండీ జీఆర్ రాధాకృష్ణన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment