వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ నటి అలియా భట్ బిజినెస్‌లోనూ స్పీడ్ పెంచింది. ఆమె 2020లో ప్రారంభించిన కాన్షియస్ కిడ్స్ దుస్తుల బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) విస్తరణ జోరుగా సాగుతోంది. గత ఆరు నెలల్లో ఈ బ్రాండ్ ప్రసూతి దుస్తులు, నర్సింగ్ వేర్, 11 నుంచి 17 ఏళ్ల వారి కోసం టీనేజ్ దుస్తులు, అప్పుడే పుట్టిన శిశువు నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారుల కోసం ప్రత్యేక దుస్తులతో సహా నాలుగు కొత్త కేటగిరీలను ప్రారంభించింది.
ఇదీ చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం!
తల్లులు, పిల్లల కోసం ప్రత్యేక షాపింగ్ ఆలోచనతో ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ ప్రారంభమైందని, ఇప్పుడు తాము ప్రసూతి నుంచి 17 ఏళ్ల టీనేజర్ల వరకూ వారికి కావాల్సిన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు ఎడ్-ఎ-మమ్మా సీవోవో ఇఫ్ఫాట్ జీవన్ పేర్కొన్నారు.
దుస్తులకే పరిమితం కాకుండా ఇతర ఉత్పత్తులకూ విస్తరించాలని ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ యోచిస్తోంది. అందులో భాగంగా పిల్లల సాహస కథల పుస్తకాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు జీవన్ వెల్లడించారు. పుస్తకాలతో పాటు యానిమేటెడ్ సిరీస్‌లు, తల్లులు, పిల్లలకు కావాల్సిన ఇతర ఉత్పత్తలు, ఆటబొమ్మలు కూడా బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె!
ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని చూస్తోంది. త్వరలో మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో ప్రారంభిస్తామని, యూఎస్‌లో అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటామని అని జీవన్ చెప్పారు. అంతేకాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో ఆఫ్‌లైన్ మోడల్‌కూ విస్తరించాలని చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి తమ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment