UK River Turns Orange And Blue After Clothing Dyes Released - Sakshi
Sakshi News home page

ఓ నది హఠాత్తుగా నీలం, నారింజ రంగులో మారిపోయింది! ఎక్కడంటే

Published Wed, Jul 19 2023 5:11 PM | Last Updated on Wed, Jul 19 2023 5:47 PM

UK River Turns Orange And Blue After Clothing Dyes Released - Sakshi

ఓ నది అకస్మాత్తుగా నీలం, నారింజ రంగులోకి మారిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది యూకేలో చోటు చేసుకుంది. బిట్రన్‌లోని స్టఫోర్డ్‌షైర్‌లోని ట్రెంట్‌ నదిలో కొంతభాగం నీలం, మరికొంత భాగం నారింజ రంగులోకి మారింది. దీంతో బ్రిటన్‌ అంతటా ఇదే చర్చనీయాంశంగా మారింది. అందులో ఉండే చేపలు వంటి ఇతర జలచర జీవులు ఏమయ్యాయో అని పర్వావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపించిన బ్రిటన్‌ ప్రభుత్వం నది అలా మారడానకి గల కారణం వివరించింది.

బట్టల రంగులు అనుకోకుండా నదిలో పడిపోవడంతో నీరు ఇలా ఆ విధమైన రంగులోకి మారిపోయిందని స్పష్టం చేసింది. దీనివల్ల నదిలో ఉండే చేపలు, ఇతర జలచర జీవులు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా పేర్కొంది. నది ఇలా మారిపోయినందుకు అధికారుల కూడా విచారం వ్యక్తం చేశారు. నిజానికి ఆ నది చుట్టు పక్కల ప్రాంతం పర్యాటక ప్రాంతంలా జనాల తాకికి ఎక్కువగా ఉండేది. ఈ అనూహ్య ఘటనతో అక్కడ ఉన్నవాళ్లంతా మాత్రం ఇక్కడ ఏదో జరిగింది.. నది అంతా కాలుష్యం అవుతుందంటూ మండిపడుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు విషయం బయట పడుతుందని, ఎన్విరాన్‌మెంటల్‌ ఏజెన్సీ దగ్గరుండి దీనిపై ఎక్వైయిరీ చేయాలని పట్టుబడుతున్నారు ప్రజలు. 

(చదవండి:  ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement