What To Wear And What Not To Wear In Monsoon - Sakshi
Sakshi News home page

Monsoon Fashion: ‍ష్యాషన్‌ సెన్స్‌ ఉట్టిపడేలా..వ‌ర్షాకాలంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి?

Published Fri, Jun 30 2023 11:03 AM | Last Updated on Fri, Jul 14 2023 3:59 PM

What To Wear And What Not To Wear In Monsoon - Sakshi

ఈ సీజన్‌లో బయటకు వస్తే ఎప్పుడు చినుకు పడుతుందో తెలియదు. ఆ చినుకుల్లో ఏ డ్రెస్‌ ఉంటే బాగుంటుందో...ఎలా ఉండాలో తెలియక ఇబ్బందులు అందుకే ఈ సీజన్‌లో మీ వార్డ్‌రోబ్, బ్యూటీ రొటీన్‌లలో కూడా మార్పులు చేసుకోక తప్పదు. డల్‌గా ఉండే వానాకాలం వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చే ట్రెండ్స్‌ గురించి తెలుసుకుని ఆచరణలో పెడితే ఈ సీజన్‌ని కూడా చక్కగా ఎంజాయ్‌ చేయచ్చు. 

ఎండకాలం మాదిరిగా ఇప్పుడు డ్రెస్సింగ్‌ కుదరదు. అలాగని, వెచ్చగా ఉంచే  దుస్తులు కూడా. ఎందుకంటే, వాతావరణంలో మార్పుల వల్ల వేడి– తేమ అధికమై చెమటకు దారి తీయవచ్చు.  డల్‌గా ఉండే వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేయడంలోనే కాదు, వానల్లో తడవకుండానూ స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకునేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది. 

వాటర్‌ ప్రూఫ్‌ షూస్‌
వర్షపు రోజులలో బురద గుంటలు సాధారణం. రోడ్లపై పారే నీటి నుంచి, వర్షపు ధారల నుంచి దాలను కాపాడుకోవాలంటే వాతావరణానికి అనువైనవి ఉండాలి. అందుకు వాటర్‌ ప్రూఫ్‌ బూట్లను ఎంచుకోవాలి. బ్లాక్‌ బూట్లు అయితే ఏ డ్రెస్సులకైనా బాగా నప్పుతాయి.


రెయినీ హ్యాట్‌
వర్షపు రోజుల్లో టోపీ ని ధరించడం ద్వారా మీ స్టైల్‌ని అప్‌గ్రేడ్‌ చేయవచ్చు. కోటుకు హుడీ లేకపోతే ఒక ట్రెండీ హ్యాట్‌ను వాడచ్చు. అయితే, టోపీ ఉన్నప్పటికీ వెంట గొడుగు మాత్రం వాడాల్సిందే.

రెయిన్‌ పోంచో
ఇవి సాధారణంగా మొత్తం ఒంటిని కప్పేసే విధంగా ఉంటాయి అని అనుకుంటారు కానీ, ఇప్పుడు మార్కెట్‌లో విభిన్న మోడల్స్‌లో రెయిన్‌ పోంచోస్‌ వచ్చాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఉంటాయి. అలాగే వేసుకున్న దుస్తులను వానకు తడవకుండా కాపాడుకోవచ్చు. గొడుగు కూడా వాడలేనంత వర్షం కురుస్తున్నప్పుడు ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాదు, వర్షాకాలానికి తల తడిస్తే, జుట్టు చిట్లిపోతుంది. జుట్టుకు రక్షణగా కూడా రెయిన్‌ పోంచో హుడ్‌ ను కప్పుకోవచ్చు. స్టైలిష్‌గానూ కనిపిస్తారు. మీ రెయిన్‌  పోంచో వాటర్‌ప్రూఫ్‌ ఫాబ్రిక్‌ కింద పొడిగా ఉండగలుగుతారు. 

ట్రెంచ్‌ కోట్‌ 
వర్షం రోజుల్లో డ్రెస్సింగ్‌ గురించి ఆలోచించినప్పుడు ఖాకీ రంగు డబుల్‌ బ్రెస్ట్‌ ట్రెంచ్‌ కోట్‌ గుర్తుకు వస్తుంది. అయితే, వీటిలో ఇప్పుడు విభిన్నరకాల కలర్స్‌... ఫ్యాబ్రిక్‌లో మార్పులు చేసినవి మార్కెట్లోకి వచ్చాయి. నేటి కాలానికి తగినట్టుగా ఆకట్టుకుంటున్నాయి.


గొడుగు ఎంపిక
వర్షంలో గొడుగు తప్పని అవసరం. అయితే, అది ఎప్పుడూ బ్లాక్‌ కలర్‌లో రొటీన్‌గా ఉంటే బోర్‌గా అనిపిస్తుంది. మంచి బ్రైట్‌ కలర్స్‌ ఉన్నవి, స్టైలిష్‌గా ఉన్న గొడుగులను ఎంచుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మిగతా అన్నింటికన్నా పోల్కా డాట్స్, లైన్స్‌ ఎప్పుడూ స్పెషల్‌ లుక్‌తో ఆకట్టుకుంటాయి.


మిలిటరీ స్టైల్‌ కోట్లు
జీన్స్, టీ షర్ట్‌ పైకి ఓ మిలిటరీ స్టైల్‌ కోటు ధరిస్తే చాలు మీ రూపం మరింత ఆధునికంగా మారిపోతుంది. మగవారికి అనువుగా రూపొందిన ఈ డ్రెస్‌ మగువలకు మరింత ప్రత్యేకమైన డ్రెస్సింగ్‌గా ఈ సీజన్‌ మార్చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement