నూతన ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు
నూతన ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు
Published Sat, Aug 27 2016 8:26 PM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
మేధో సంపత్తి హక్కుల సాధన సదస్సులో
కలెక్టర్ కాంతిలాల్ దండే
పాతగుంటూరు: నూతన ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ పరిశ్రమలు సాధించి అభివృద్ధి దిశగా వ్యాపార వర్గాలు కృషిచేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నగరంపాలెంలోని కేఅండ్‌ఎం హోటల్లో శనివారం మేధో సంపత్తి హక్కుల సాధనపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు సదస్సుకు అధ్యక్షత వహించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ నూతన ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు ప్రోత్సహించాలని సూచించారు. ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎ.సుధాకర్ మాట్లాడుతూ నూతన పరిశ్రమలను ఏర్పాటు చేసే వారు ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకొని చలానా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టుకోవచ్చని చెప్పారు. 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినపుడు కారణాలు తెలుపకుండా రిజెక్ట్ అని మెసేజ్ సెల్‌ఫోన్‌లో వస్తుంది. అందుకు గల కారణాలను ఫోన్‌లోనే పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ముందుగా çకృష్ణా పుష్కరాలను విజయవంతం చేశారని కలెక్టర్ కాంతిలాల్ దండేను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ ఎల్ ఎన్ కుమార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్ పి.ప్రసాదరావు. వెంకటేశన్ రాజమణి పాల్గొన్నారు.
Advertisement