►అనుమతులను సత్వరమే అందించాలి
► వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకోవాలి
► జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్
చిత్తూరు (అగ్రిక ల్చర్): జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమల స్థాపన విరివిగా జరగాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి సత్వరమే అనుమతులను ఇచ్చేవిధంగా కృషి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత్తల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. పరిష్కారం చేయలేని సమస్యలను తనదృష్టికి తీసుకురావాలని సూచిం చా రు.
కొత్త పరిశ్రమ స్థాపన వల్ల జిల్లాకు టాక్స్‌ల ద్వారా వచ్చే రాబడి, కలిగే ఉపాధి, పెట్టుబడి, ఎగుమతి, దిగుమతి వంటి అంశాలను అధికారులు నిశితంగా పరిశీలించాలన్నారు. రిమార్కులు ఏమైనా వుంటే వెంటనే వాటి జాబితాలు సిద్ధం చేయాలన్నారు. పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చే వారు స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని, స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. మైనింగ్ లీజ్ దరఖాస్తులను స్వీకరించుటకు జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సెక్రటేరియట్‌గా ప్రభుత్వం నామినేట్ చేసిదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం రామలింగరాజు, జోనల్ మేనేజర్ ప్రతాప్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి
Published Sat, Apr 30 2016 6:01 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement
Advertisement