ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా గోల్డ్ పేరిట వినూత్న, దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ఆవిష్కరించింది. ఇటు వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు అదనపు రాబడి అందుకోవాలనుకునే వారికి అనువైనదిగా ఇది ఉంటుందని సంస్థ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా తెలిపారు. ఇది జీవిత బీమా కవరేజీతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రతను కూడా అందిస్తుందని పేర్కొన్నారు.
(కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు)
ఐసీఐసీఐ ప్రు గోల్డ్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇమీడియట్ ఇన్‌కమ్, ఇమీడియట్ ఇన్‌కమ్ విత్ బూస్టర్, అలాగే డిఫర్డ్ ఇన్‌కమ్ వీటిలో ఉన్నాయి. మొదటి దానిలో పాలసీ జారీ చేసిన 30 రోజుల తర్వాత నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇక రెండో వేరియంట్‌లో ప్రతి ఐదో ఏటా అదనంగా గ్యారంటీడ్ ఆదాయాన్ని కూడా అందుకోవచ్చు.
మూడోదైన డిఫర్డ్ ఇన్‌కమ్ వేరియంట్‌లో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వినియోగదారులు ఆదాయాన్ని ఎప్పటి నుంచి పొందాలనుకుంటున్నది తామే నిర్ణయించుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్న రెండో ఏడాది నుంచే లేదా 13 ఏళ్ల తర్వాత నుంచైనా ఆదాయాన్ని అందుకోవడం ప్రారంభించవచ్చు. చెల్లింపులను సాధారణంగా తీసుకోవడానికి బదులుగా సేవింగ్స్ వాలెట్‌లో జమ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని కావాలంటే పూర్తిగా లేదా పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం ఆఫ్‌సెట్ సదుపాయంతో తమ భావి ప్రీమియంలను కూడా ఈ మొత్తం నుంచి చెల్లించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment