15 హీరో టూవీలర్ల ఆవిష్కరణ
15 హీరో టూవీలర్ల ఆవిష్కరణ
Published Fri, Oct 11 2013 2:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
గుర్గావ్: టూ-వీలర్ దిగ్గజం హీరోమోటోకార్ప్ 15 కొత్త వాహనాలను గురువారం ఆవిష్కరించింది. వీటన్నింటినీ వచ్చే ఏడాది మార్చి కల్లా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. కంపెనీ ఆవిష్కరించిన కొత్త వాహనాల్లో కరిజ్మా ఆర్, జెడ్‌ఎంఆర్, స్ప్లెండర్ ఐ-స్మార్ట్‌లతో పాటు ప్లెజర్ స్కూటర్ మోడల్‌లో కొత్త వేరియంట్ కూడా ఉంది. ఈ 15 కొత్త ఉత్పత్తుల్లో అధిక భాగం ప్రస్తుత పండుగల సీజన్‌లోనే మార్కెట్లోకి తేనుంది. మరో 35 వాహనాలు: హోండాతో భాగస్వామ్యం నుంచి వీడి సొంతంగా ప్రస్థానం ప్రారంభించి రెండేళ్లే అయిందని ముంజాల్ చెప్పారు. మూడేళ్లలో 50 కొత్త ఉత్పత్తులను అందిస్తామని 2011లోనే ప్రకటించామని, ఇప్పుడు 15 కొత్త వాహనాలనందిస్తున్నామని చెప్పారు., మరో 35ను రానున్న సంవత్సరాల్లో తీసుకొస్తామ న్నారు.
డాన్ కన్నా చౌక బైక్
ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో తక్కువ ఖరీదున్న బైక్ హెచ్‌ఎఫ్ డాన్(ధర రూ.37,000)అని, దీనికంటే తక్కువ ధరకు లభ్యమయ్యేలా కొత్త బైక్‌ను అందించనున్నామని పవన్ ముంజాల్ వివరించారు. ఇక హోండాతో విడివడిన తర్వాత తాము సొంతంగా రూపొందించిన తొలి బైక్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తామని తెలిపారు.
Advertisement
Advertisement