సులువైన ఫైల్ ట్రాన్స్‌ఫర్లకు...
భలే ఆప్స్
ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్‌కు ఫైళ్లు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు బ్లూటూత్ మొదలుకొని అనేక రకాల అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రతిదాంట్లోనూ సైజుపై ఎంతో కొంత పరిమితి ఉంటుంది. ఇన్‌ఫినెట్‌తో ఈ సమస్య లేదు. ఫోన్లతోపాటు అవసరమైతే మీ కంప్యూటర్‌కు కూడా ఫైళ్లు ట్రాన్స్‌ఫర్ చేసుకునే సౌకర్యం ఉంది దీంట్లో.
మీరు డౌన్‌లోడ్ చేసుకున్న మూవీని మిత్రులందరికీ పంచాలంటే... లేదా ఫొటోలు, డాక్యుమెంట్లనైనా ఈ అప్లికేషన్ సాయంతో అతివేగంగా (డ్రాప్‌బాక్స్, వాట్సప్‌ల కంటే 30 రెట్లు ఎక్కువ) ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. రెండు జీబీల సైజున్న మూవీలను కూడా 10 నిమిషాల్లోపు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చునని, బీబీసీ మొదలుకొని, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి కూడా తమ అప్లికేషన్‌నే వాడుతున్నాయని కంపెనీ చెబుతోంది.