భలే యాప్స్ | Li apps | Sakshi
Sakshi News home page

భలే యాప్స్

Published Wed, Apr 2 2014 11:11 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

భలే యాప్స్ - Sakshi

భలే యాప్స్

స్మార్ట్‌ఫోన్ మరింత స్మార్ట్‌గా!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ పాలిట గూగుల్ ప్లే ఒక కల్పతరువు. అది నిత్యజీవితంలో ఉపయోగపడే ఎన్నో అప్లికేషన్‌లను అందిస్తూ ఉంటుంది.  ఇప్పటి వరకూ ఆ కల్పతరువు అందించిన మిలియన్ల సంఖ్యలోని గేమ్, సర్వీస్ అప్లికేషన్‌లను వాడుకొంటున్నారు యూజర్లు.  ఇలాంటి నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ల విషయంలో కొన్ని సమస్యలు  తలెత్తుతున్నాయి. అప్లికేషన్లు క్రాష్ కావడం, స్టార్టప్ విషయంలో నెమ్మదితనం, డాటా ట్రాన్స్‌ఫర్, అప్‌లోడింగ్, డౌన్‌లోడింగ్ విషయంలో ఫోన్ మందగమనంలో సాగడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అసౌకర్యాన్ని నిరోధించడానికి కూడా కొన్ని అప్లికేషన్లున్నాయి. సదుపాయవంతంగా ఉన్న సరికొత్త అప్లికేషన్‌లివి...
 
 బ్లూటూత్‌కు 40 రెట్ల వేగం ‘షేర్‌ఇట్’


 సాధారణంగా దగ్గరలోనే ఉన్న డివైజ్‌లలోకి డాటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి బ్లూటూత్‌ను ఉపయోగిస్తాం. అలాంటి బ్లూటూత్ వేగానికి 40 రెట్లు ఎక్కువ స్పీడ్‌తో డాటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి తెలుసా? వాటిలో ముఖ్యమైనది షేర్‌ఇట్. ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసిన రెండు డివైజ్‌ల మధ్య వంద ఎమ్‌బీ డాటాను కేవలం 24 సెకెన్ల లోనే ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఒకే సమయంలో ఐదు డివైజ్‌లకు డాటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిక్చర్లు, వీడియోలు, మ్యూజిక్‌ఫైల్స్, డాక్యుమెంట్స్, కాంటాక్ట్స్ అప్లికేషన్లను కూడా ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. నెట్‌వర్క్, డివైజ్‌ల వేగంతో పని లేకుండా డాటాను మార్చుకోవడానికి ఇంతకన్నా ఉత్తమమైన అప్లికేషన్ మరోటి లేదు. ఈ అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయిన రెండు డివైజ్‌లను ఆటోమెటిక్‌గా బ్లూటూత్‌లాగే గుర్తిస్తాయి.
 
 డాటా సింకింగ్‌కు ఒక వరం... సింక్‌ఇట్


 మొబైల్‌ను మార్చినప్పుడు లేదా ఉన్నట్టుండి మొబైల్ పోయినప్పుడు... లాస్ అయ్యే డాటాతో ఉన్న సమస్యలు అన్నీఇన్నీ కావు. ఇలాంటి సమస్యలను నిరోధించడానికి ఉత్తమమైన మార్గం సింక్‌ఇట్. ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకొంటే... ఫోన్‌లోని డాటా ఎప్పటికప్పుడు అందులో సింక్ అవుతూ క్లౌడ్‌లో సేవ్ అవుతూ ఉంటుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌లోని డాటాకు సెక్యూరిటీ ఉంటుంది. మరో మొబైల్ డివైజ్ నుంచి సింక్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా స్మార్ట్‌ఫోన్‌లో డాటా లాస్‌తో ఇబ్బంది పడిన వారికే ఈ అప్లికేషన్ గొప్పతనం తెలుస్తోంది. కాబట్టి ఈ అప్లికేషన్‌తో వరప్రదమైనదని చెప్పడానికి వెనుకాడనక్కర్లేదు!
 
 స్మార్ట్‌ఫోన్‌కు సురక్ష... సెక్యూర్‌ఇట్


 వైరస్‌ల విషయంలో మాల్వేర్ విషయంలో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎంత భద్రంగా ఉందని అనుకొంటున్నారు? మీ డివైజ్‌కు వైరస్‌ల బెడద లేదని మీకు ఎంత విశ్వాసం ఉంది? ఒకవేళ ఈ సెక్యూర్‌ఇట్ అప్లికేషన్‌ను గనుక ఇన్‌స్టాల్ చేసుకొంటే ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉండవచ్చు. కేవలం యాంటీ వైరస్‌లాగా మాత్రమే కాదు, ఈ అప్లికేషన్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వైరస్‌ను మాత్రమేగాక మొబైల్‌కు వచ్చే స్పామ్ మెయిల్స్‌ను, కాల్స్‌ను ప్రివెంట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌అయిన అప్లికేషన్‌ల పనితీరును కూడా సమీక్షిస్తూ ఉంటుంది. అన్‌యూజ్డ్ అప్లికేషన్ల గురించి మీకు వివరిస్తుంది. అప్లికేషన్‌లు క్రాష్ కాకుండా నిరోధిస్తుంటుంది. ఓవరాల్‌గా స్మార్ట్‌ఫోన్ పనితీరును మరింత స్మార్ట్‌గా, స్మూత్‌గా మారుస్తుంది ఈ అప్లికేషన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement