సూరి(పశ్చిమబెంగాల్): బీఏ చదువుతున్న ఓ విద్యార్థి పరీక్షల్లో కాపీ కొట్టేందుకు వెరైటీగా ఆలోచనను అమలు చేశాడు. పరీక్ష రోజు తలపై విగ్, చెవులకు బ్లూటూత్ పరికరం పెట్టుకుని అది కనిపించకుండా విగ్‌తో కవర్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా పరీక్షా హాల్లోకి వచ్చి కూర్చున్నాడు.
బ్లూటూత్ హెడ్‌సెట్ సాయంతో మొబైల్ ఫోన్ ద్వారా వేరొకరితో మాట్లాడుతూ చకచక రాసేస్తున్నాడు. ఆ సమయంలో విద్యార్థి కొన్నిసార్లు పైకి పెద్దగా మాట్లాడడంతో ప్రిన్సిపాల్ మోండాల్‌కు అనుమానం వచ్చింది. వచ్చి ఆరా తీస్తే విగ్, బ్లూటూత్ హెడ్‌సెట్, కాపీ అన్నీ బయటపడ్డాయి. పశ్చిమబెంగాల్లోని బీర్భమ్ జిల్లా సూరిలోని విద్యాసాగర్ కాలేజీలో ఇది జరిగింది. విద్యార్థి రఫీఖుల్ ఇస్లామ్‌ను పరీక్షల నుంచి బహిష్కరించారు.
విగ్ పెట్టి... కాపీ కొట్టి!
Published Sat, Jun 28 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM
Advertisement