wig
-
అందంగా.. ఆకర్షణీయంగా..
వయసుతో సంబంధం లేదు.. స్త్రీ, పురుషులు అనే తేడా కనిపించడం లేదు. ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం అనేది అందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్యగా మారిపోయింది. 17 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు గల వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. జుట్టు ట్రాన్స్‌ప్లాంటేషన్, పీఆరీ్ప, స్కాల్ఫ్ త్రెడ్, విగ్గు వంటివి మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా విగ్గు అందరికీ అందుబాటులో కనిపిస్తోంది. గత రెండేళ్ల నుంచి విగ్గుల వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయా రంగాలకు చెందినవారు చెబుతున్నారు. దీని కోసం డబ్బులు ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్ధపడుతున్నారట. ఫలితంగా నగరంలో ఈ కేటగిరీకి చెందిన క్లినిక్‌లు పెద్దసంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. టీనేజ్‌లో ఉన్న వారికి జుట్టు రాలిపోవడంతో వివాహ సమయంలో తిరస్కరణకు గురవుతున్నామన్న భావన కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు నలుగురిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని మరికొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే విగ్గు పెట్టుకోవడం వల్ల మానసిక, ఆత్మ స్థైర్యం పెరుగుతుందని పలువురు మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏడాది నుంచి మూడేళ్ల వరకూ.. సమాజంలో ఎత్తిపొడుపులు భరించలేక, ఎదుటి వ్యక్తుల సూటిపోటి మాటలను తట్టుకోలేక కూడా విగ్గు ధరించడానికి ఆసక్తిచూపిస్తున్నారట. హెయిర్ ప్లాంటేషన్‌కు ఇతర మార్గాలు ఉన్నప్పటికీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ పట్ల మొగ్గుచూపిస్తున్నారు. కొంత మంది శుభకార్యాలకు, టూర్, కార్యాలయానికి ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన విగ్ వినియోగిస్తున్నారట. విగ్గు అందరికీ అందుబాటైన ధరలో అందుబాటులో ఉంటుంది. వివిధ రకాల కారణాలతో అందరి దృష్టినీ విగ్గులు ఆకర్షిస్తున్నాయి. ఒక్కో ప్రాసెస్ (విగ్గు) సుమారు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తయారీలో వినియోగించే ముడిసరుకు (మెటీరియల్) నుంచి సంబంధిత సంస్థ విగ్గు అతికించే ప్రక్రియపై ధర అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా తయారైన విగ్గు ఏడాది నుంచి మూడేళ్ల వరకూ వినియోగించుకోవచ్చు.ఆ సమస్య తగ్గింది.. పదేళ్ల క్రితం నుంచి జుట్టు రాలిపోవడం మొదలైంది. తక్కువ సమయంలోనే తల మొత్తం ఖాళీ అయ్యి బట్టతల వచి్చంది. ఆఫీస్‌లో సహచర సిబ్బంది, స్నేహితులు హేళన చేసేవారు. కొన్ని సందర్భాల్లో నా మనసుకు అది నచ్చేది కాదు. పనిమీద ఏకాగ్రత కుదిరేది కాదు. స్నేహితుడి సూచన మేరకు ఆరు నెలల క్రితం విగ్గు తీసుకున్నా. పస్తుతం ఆ పరిస్థితి లేదు.. ప్రశాంతంగా పనిచేసుకుంటున్నా.. – జి.రామ్మోహన్రావు, సాఫ్ట్వేర్ ఉద్యోగి, మాదాపూర్ జుట్టు రాలడానికి గల కారణాలు..విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా వివిధ రంగాల్లో అన్ని వయసుల వారిపైనా ప్రధానంగా ఒత్తిడి కనిపిస్తోంది. దీనికి తోడుగా మారుతున్న ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన అంశాలు, పౌష్టికాహార లోపం, అతిగా మందులు వినియోగించడం, బాలింతలు, చుండ్రు, పీసీఓఎస్ తదితర సమస్యల కారణంగా జుట్టు అధికంగా రాలిపోతోంది. ప్రధానంగా మహిళలు ఈ సమస్యపై చర్చించడానికి సిద్ధంగా లేరని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. పురుషుల్లో 17 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య, మహిళల విషయంలో చూస్తే 36 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య జుట్టు రాలుతోంది. దీంతో ఇన్స్టంట్ మేకప్ కోసం విగ్గులను వినియోగిస్తున్నారు.స్టయిల్‌కి తగ్గ మోడల్స్..వినియోగదారుడి అభిరుచి మేరకు తయారీ సంస్థలు విగ్గులు సిద్ధం చేస్తున్నాయి. ప్రధానంగా ఇండియన్ ప్యాచ్, హాలీవుడ్ ప్యాచ్, కొరియన్ ప్యాచ్ అనే మూడు రకాలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో కొరియన్ ప్యాచ్‌కు ఆదరణ తక్కువ. పురుషులు, మహిళలు కోరుకున్న, అవసరమైన రంగు, అడిగినంత పొడవుతో విగ్గులు తయారుచేస్తున్నారు.యువతే ఎక్కువ.. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం సర్వసాధారణం అయిపోయింది. నాలుగేళ్ల క్రితం చాలా అరుదుగా విగ్గు కావాలని అడిగేవారు. ప్రస్తుతం నెలకు 60 నుంచి 100 మంది వరకూ కొత్త వ్యక్తులు వస్తున్నారు. వివాహం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు విగ్గుల ధరించేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. విగ్గు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తక్కువ ఖర్చులో మంచి లుక్ వస్తుంది. – రవికాంత్, ఆర్కే హెయిర్ సొల్యూషన్స్ -
గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!
ప్రియురాలి కోసం గొప్ప సాహసం చేశాడో ప్రియుడు. ఇందుకోసంగా దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి మరీ జాగ్రత్తగా ఆమెకు విగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. విగ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడానికి అంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా? రండి.. ఈ స్టోరీని చూద్దాం. మెయిల్ ఆన్లైన్ కథనం ప్రకారం మిచిగాన్‌లోని వాటర్ఫోర్డ్కు చెందిన కోడి ఎన్నిస్, హన్నా హోస్కింగ్ ఇద్దరూ ప్రేమికులు. ఆరునెలల డేటింగ్ తరువాత తనకోసం 30 అంగుళాల జట్టు కావాలని అడిగింది సరదాగా. అంతేకాదు దీనికి మూడు నాలుగేళ్లుపడుతుందని కూడా జోక్ చేసింది. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు ఎన్నిస్. 2020, మే నుంచి జుట్టు పెంచడాన్ని ప్రారంభించాడు. దీనికోసం వేలాది ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూశాడు. దీన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాడు. క్రమం తప్పకుండా జుట్టును వాష్ చేసుకోవడం, కండీషనింగ్ లాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కాస్మోటాలజిస్ట్ సలహా మేరకు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడాడు. జుట్టు ఏ మాత్రం తెగకుండా సిల్క్ బోనెట్ వాడుతూ జాగ్రత్తపడ్డాడు. చివరికి గత అక్టోబరులో, తన జుట్టును 29-అంగుళాలకు పెంచాడు. దీన్ని కట్ చేసి అంతే జాగ్రత్తగా అందమైన విగ్‌ను ఆమెకు ప్రెజెంట్ చేశాడు. అచ్చం ఆమె పాత జుట్టులా ఉండేలా శ్రద్ధ తీసుకోవడం మరీ విశేషం. అసలు విషయం ఏమిటంటే.. హన్నా హోస్కింగ్ ఒక కంటెంట్క్రియేటర్. ఆమెకు ఏడేళ్లున్నపుడే అలోపేసియా (హెయిర్ ఫోలికల్ మూలాలను నాశనం చేసే ఆటో-ఇమ్యూన్) అనే వ్యాధి సోకింది. దీంతో క్రమంగా దాదాపు ఐదేళ్ల క్రితంఆమె శరీరం మీద ఉన్న ఒక్కో వెంట్రుక(కనుబొమ్మలతో) సహా రాలిపోవడం మొదలైంది.దీంతో జుట్టుంతా షేవ్ చేసుకుంది. ఈ క్రమంలో 2019లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో నవంబరులో హన్నా ఎన్నిస్ తొలిసారి కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమంగా మారింది. ‘ఇది తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, సినిమాలా అనిప్తిస్తోంది అని హన్నా భావోద్వేగానికి లోనైంది హనా. ‘‘ఇది మామూలు విగ్ కాదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవింతలో ఇంత ఇష్టపడే వ్యక్తి ఉన్నాడని తెలియడం,చాలా ఓదార్పుగా, భద్రంగా అనిపిస్తోంది’’ అంటూ కంటతడి పెట్టుకుంది. తన బాయ్‌ఫ్రెండ్స్ జుట్టుతో తయారు చేసిన విగ్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది హన్నా. నా విగ్గు తనకి చక్కగా అమరిపోయింది అంటే..ఇక నాతో తను విడిపోలేదు అని చెప్పాడు ప్రేమతో -
సముద్రంలో రెస్టారెంట్.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు
సముద్రంలో రెస్టారెంట్ సముద్రంలో బయటకు పొడుచుకొచ్చిన ఒక కొండ మీద పూరిగుడిసెలా కనిపిస్తున్నది ఒక రెస్టారెంట్. కొండ కొమ్ముమీద నిర్మించడం వల్ల దీనికి ‘ది రాక్’ అని పేరుపెట్టారు. టాంజానియాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉందిది. ఈ రెస్టారెంట్లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే! పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ వంటి సీఫుడ్‌కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్‌కు వచ్చి, ఇక్కడి రుచులను ఆరగించి వెళుతుంటారు. View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) విగ్గుతో గిన్నిస్ రికార్డ్ విగ్గుల వాడకం అందరికీ తెలిసిందే! సినీ నాటక రంగాల్లో విగ్గుల వాడకం ఎక్కువ. ఇటీవలి కాలంలో బట్టతలలు గల సాధారణ వ్యక్తులు కూడా విగ్గులు వాడుతున్నారు. సాధారణంగా వాడుకలో ఉన్న ఈ విగ్గులు నెత్తిని జుట్టుతో నిండుగా కప్పేంత పరిమాణంలో ఉంటాయి. కొన్ని విచిత్రవేషాల కోసం వాడే విగ్గులైతే తల మీద దాదాపు ఒక అడుగు మందం వరకు కూడా ఉంటాయి. అయితే, అలాంటి విగ్గులు చాలా అరుదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ డిజైనర్ డానీ రేనాల్డ్స్ రూపొందించిన అతిభారీ విగ్ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. బైక్ హెల్మెట్‌ను చట్రంగా చేసుకుని రూపొందించిన ఈ విగ్గు వెడల్పు ఎనిమిది అడుగుల ఆరంగుళాలట. దీని తయారీకి పీవీసీ పైపులు, అల్యూమినియం రాడ్లు, కేబుల్ వైర్లు వంటి వస్తువులను ఉపయోగించడం విశేషం. ఈ విగ్గు ప్రపంచంలోనే అత్యంత వెడల్పాటి విగ్గుగా గిన్నిస్ రికార్డు సాధించింది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
వారెవ్వా... ఏమి విగ్గు! వామ్మో ఏం తెలివిరా బాబోయ్.. వైరల్ వీడియో
ఏం బుర్రరా నీది..! అని అసాధారణ ప్రతిభాపాటవాలు, అమోఘ నైపుణ్యం కనబరుస్తున్న వారిని ప్రశంసిస్తుంటాం. ఇదిగో ఈ ఫొటోలో కనపడుతున్న వ్యక్తి తెలివితేటలను చూసి.. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. నెటిజన్లు కూడా.. విస్తుపోయారు. కాకపోతే చదువుల్లో ఇతనికున్న ప్రతిభను చూసి కాదు... వక్రమార్గంలో సబ్ఇన్స్పెక్టర్ పరీక్షను గట్టెక్కడానికి సదరు మహాశయుడు ఎంచుకున్న హైటెక్ కాపీయింగ్ పద్ధతిని చూసి. ఇంతకీ ఏం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల సబ్–ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి పోటీ పరీక్షలు జరిగాయి. ప్రభుత్వోద్యోగం... అందులోనా క్రేజీ జాబ్. మనోడు బాగా ఆలోచించి... కాపీయింగ్ ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ బ్లూ టూత్ రిసీవర్‌ను విగ్గులో అమర్చి ఏమాత్రం అనుమానం రాకుండా క్రాపు బాగా తగ్గించుకొని తన తలపై ఈ విగ్గును జాగ్రత్తగా అతికించుకున్నాడు. అత్యంత సూక్ష్మమైన... బయటికి కనిపించని రెండు ఇయర్ఫోన్లను చెవుల్లోకి జొప్పించాడు. కంటికి కనిపించంనంత సూక్ష్మమైన తీగలతో ఈ బ్లూ టూత్ నుంచి ఇయర్ఫోన్లను కనెక్ట్ చేశాడు. దిలాసాగా నడుచుకుంటూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లబోతుండగా... అందరినీ చెక్ చేసినట్లే పోలీసులు మనోడిని కూడా మెటల్ డిటెక్టర్‌తో పరీక్షించారు. తల దగ్గరికి రాగానే బీప్.. బీప్.. అని శబ్దం వస్తోంది. నిశితంగా పరిశీలించిన పోలీసులు విగ్గు గుట్టును రట్టుచేశారు. విగ్గును తొలగించడం, లోపలున్న బ్లూటూత్ పరికరం, చెవుల్లోని సూక్ష్మమైన ఇయర్ఫోన్లను అతికష్టం మీద పోలీసులు వెలికితీయడం చూసి... వామ్మో ఏం తెలివిరా బాబోయ్... అంటూ నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పంచుకోగా... వైరల్‌గా మారింది. గూఢచారి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కొందరు సరదాగా అతనికి సూచించారు. #UttarPradesh mein Sub-Inspector की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️😊😊😊@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry — Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021 -
విగ్గుతో పరీక్షల్లో కాపీయింగ్! ఎలా దొరికాడంటే..
లక్నో: ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజే వేరు. దీనిలో ఉద్యోగ భద్రతతో పాటు, అనేక వెసులు బాటులు ఉంటాయి. అందుకే చాలా మంది యువత పోటీపరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. కొందరు కష్టపడి ఉద్యోగాన్ని సాధిస్తే.. మరికొందరు దళారులను లేదా హైటెక్ మాస్ కాపీయింగ్‌లకు పాల్పడుతుంటారు. దీనికోసం టెక్నాలజీని బీభత్సంగా ఉపయోగించుకుంటారు. ఇప్పటికే హైటెక్ కాపీయింగ్ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక మాస్ కాపీయంగ్ ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీన్ని ఐపీఎస్ అధికారి రూపిన్‌శర్మ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వివరాలు.. గత వారం యూపీలో సబ్ఇన్స్పెక్టర్ మెయిన్స్ రాతపరీక్షలు జరుగాయి. దీనిలో ఒక అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వచ్చాడు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో.. ప్రత్యేక అధికారులు అతడిని బయటకు తీసుకెళ్లి తనిఖీ చేశారు. ఆ యువకుడిని పూర్తిగా పరిశీలించారు. ఎక్కడ కూడా.. ఎలాంటి కాపీయంగ్ ఆనవాళ్లు దొరకలేదు. చివరకు వారు.. అతగాడి తలపైన తనిఖీ చేశారు. అతడి జుట్టును పక్కకు జరిపి చూశారు. అప్పుడు షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. యువకుడి తలపైన ఒక విగ్ మాదిరిగా వెంట్రుకలు ఉన్నాయి. దానికింద ప్రత్యేక చిప్, బ్లూటూత్‌లు ఉన్నాయి. దీన్ని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఆ తర్వాత.. యువకుడిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హైటెక్ మాస్‌కాపీయంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం తెలివిరా బాబు..’, ‘ఈ తెలివి చదువులో చూపిస్తే బాగుండు..’,‘ నీ తెలివి తెల్లారినట్లే ఉందంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్ #UttarPradesh mein Sub-Inspector की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️😊😊😊@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry — Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021 -
‘కిలేడీ’ కేసులో మరో కొత్తకోణం
ఒంగోలు: జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన సుమలత కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళే మగ వేషం ధరించి బాలికలపై కృత్రిమ సాధనాలతో లైంగిక దాడికి పాల్పడిందనేందుకు మరో బలమైన ఆధారం పోలీసులకు లభ్యమైంది. సుమలతే మగవాడిలా విగ్ పెట్టుకొని సాయి అనే పేరుతో చలామణి అయినట్టు తెలుస్తోంది. కంఠంతోపాటు మగవాడిలా వేషం మార్చి కథ నడిపిందన్న బాగోతం వెలుగులోకి రావడంతో అందుకు సంబంధించిన ఆధారాలుసేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నిందితురాలు సుమలత భర్త ఏడుకొండలు ఆత్మహత్య చేసుకోవడం, ఫోక్సో కేసులో ఆమె రిమాండ్‌లో ఉండడంతో దర్యాప్తు కోసం సాంకేతిక సహకారంతోపాటు భౌతిక సాక్ష్యాల కోసం వేట మొదలు పెట్టారు. కేసును విచారణలో భాగంగా సింగరాయకొండ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్ శుక్రవారం సుమలత నివాసం ఉండే ఒంగోలు మారుతీనగర్‌లోని పెంట్ హౌస్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఏడు ప్రేమ లేఖలను సీజ్ చేశారు. అవన్నీ నోటు పుస్తకాలను చించి రాసినట్లుగా ఉన్నాయి. వాటిలో మూడు లేఖలు ‘హాయ్’ పేరుతో ఉంటే మరో నాలుగు లేఖలు మాత్రం ‘సాయి చరణ్’ పేరుతో ఉన్నాయి. దీంతో సాయిచరణ్ అన్న పేరు కేవలం కల్పితం అన్న విషయం రూఢీ అయింది. పొడవాటి జుట్టును ఎలా కప్పి పెట్టి ఉంటుందనే సంశయం కూడా తాజా తనిఖీలలో గుర్తించిన విగ్‌తో వీగిపోయింది. పొడవాటి జడ సైతం అందులో ఇమిడి పోయే మగవారు ధరించే విగ్ శుక్రవారం తనిఖీల్లో పోలీసులకు లభ్యమైంది. దీంతో బాలికలను ఆకట్టుకునే క్రమంలో సుమలతే సాయిచరణ్‌గా వేషం ధరించేదనే నిర్ధారణకు వచ్చారు. ప్రేమ లేఖలపై సస్పెన్స్.. పోలీసులు సీజ్ చేసిన ఏడు ప్రేమ లేఖల్లో ఒకే చేతిరాత ఉన్నప్పటికీ ఎక్కడా దిగువన సంతకాలు మాత్రం లేవు. దీంతో వాటిని రాసింది ఎవరనేది నిర్థారణ చేయాల్సి ఉంది. సుమలత జీవితానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం ద్వారా ఆమె ఎందుకు ‘షీ మ్యాన్’లా వ్యవహరిస్తుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. (చదవండి: ఆమె ఇంట్లో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు) -
భార్యలు పసిగడతారు.. భర్తలు దోపిడీలకు పాల్పడతారు
సాక్షి, సిటీబ్యూరో: ‘మహిళలు అందంగా కనిపించేందుకు అవసరమైన సవరాలు అమ్ముతాం...చిన్న పిల్లల ఆట బొమ్మలు విక్రయిస్తాం...జీవితంలో సమస్యలు లేకుండా చేసే రుద్రాక్ష మాలలు ఇస్తాం’ అంటూ పగటివేళలో కాలనీల్లో తిరుగుతూ మహిళలు అనువైన ఇళ్లను గుర్తించగా, రాత్రి వేళల్లో వారి భర్తలు దోపిడీలకు పాల్పడతారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ పార్థీ గ్యాంగ్ సభ్యులు నలుగురిని సైబరాబాద్ స్పెషల్ అపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు మంగళవారం రాత్రి మేడ్చల్‌లో అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.35 లక్షల విలువైన కిలో బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే హత్యలకు వెనకాడని సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎస్వోటీ ఇన్చార్జ్ దయానంద్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. శివారు ప్రాంతాల్లో అడ్డాలు... మధ్యప్రదేశ్‌లోని హోసాంగాబాద్ జిల్లా, సియోని మాలా ప్రాంతానికి చెందిన షేర్ సింగ్ రాథోడ్ చిన్నతనం నుంచే చోరీల బాట పట్టాడు.మధ్యప్రదేశ్‌లోనే పలు ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడిన అతను సియోని, ఖంద్వా పోలీసులకు చిక్కాడు. అనంతరం అతనిపై నిఘా పెరగడంతో బయటి రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, బీహర్, వెస్ట్‌బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలపై దృష్టి సారించాడు. అదే రాష్ట్రంలోని కత్ని జిల్లా, బెరూలికి చెందిన షాహీద్ కపూర్, రిజ్వాడి లాల్, అతని కుమారులు దిలావర్‌సింగ్, ఇన్సానియత్, ఇక్బల్‌లతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఈ ముఠా సభ్యులు తమ కుటుంబాలతో కలిసి వివిధ నగరాల్లోని రైల్వే స్టేషన్ల సమీపంలోని శివారు ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. రోడ్డుకు 200 మీటర్ల దూరంలో చిన్న గుడిసెల్లో జీవనం సాగించేవీరు పోలీసుల కంటపడినా తప్పించుకునే ందుకు సిద్ధంగా ఉంటారు. ముఠాలోని స్త్రీలు సవరాలు, రుద్రాక్ష మాలలు, ఆట బొమ్మలను విక్రయిస్తున్నట్లు కాలనీల్లో తిరుగుతూ దోపిడీకి అనువైన ఇళ్లను గుర్తిస్తారు. అలా గుర్తించిన ఇంట్లో రాత్రి సమయాల్లో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళతారు. ఈ క్రమంలో ఎవరైనా ఎదురు తిరిగినా హత్యలకు కూడా వెనకాడరు. ఈ దోపిడీ క్రమంలోనే మహారాష్ట్రలో ఒక హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. వీరు ఒక చోట మూడు రోజులు ఉండి ఆ వెంటనే మరో ఐదు కిలోమీటర్ల దూరంలో తాత్కాలిక నివాసం ఏర్పరచుకొని దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఎస్ఓటీ కృషితో 21 కేసుల ఛేదన గతేడాది జూలై నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 12, రాచకొండ కమిషనరేట్‌లో 3, వరంగల్ కమిషనరేట్‌లో రెండు, ఖమ్మం కమిషనరేట్‌లో మూడు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక దోపిడీ...మొత్తంగా రాష్ట్రంలో 21 కేసులు నమోదయ్యాయి.గత ఫిబ్రవరిలో చివరిసారిగా మేడ్చల్‌లో ఒక ఇంట్లో దోపిడీ చేసే క్రమంలో యజమానిని గాయపరిచినట్లు నమోదైంది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎస్ఓటీ బాలానగర్ ఇన్స్పెక్టర్ సంగని రమేశ్, శంషాబాద్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డిలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మేడ్చల్, దుండిగల్, పేట్ బషీరాబాద్, అల్వాల్ గచ్చిబౌలి, శంషాబాద్ దోపిడీల్లో లభించిన వేలిముద్రల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రత్యేక బృందం అక్కడ వేలిముద్రలు సరిపోలడంతో వారి వివరాలను సేకరించారు. వారు మళ్లీ దోపిడీలకు హైదరాబాద్‌కే వచ్చినట్లుగా గుర్తించారు. మంగళవారం మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రధాన సూత్రధారి షేర్ సింగ్ రాథోడ్‌తో పాటు దిలావర్‌సింగ్, రిజ్వాడి లాల్, షాహీద్ కపూర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు సీపీ సజ్జనార్‌తెలిపారు. -
యవ్వనంగా... విగ్గు
వయసు తక్కువగా కనిపించాలంటే నల్లగా నిగనిగలాడే తలకట్టు ఉండాలి. కానీ, సాధారణంగా వయసు పై బడినవారికి వెంట్రుకలు రాలిపోవడం, బట్టతల రావడం ఎక్కువ. ఈ వయసులో ఆరోగ్యసమస్యల కారణంగా అందరికీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వీలు పడదు. కానీ, వయసు తక్కువగా కనిపించాలని ఉంటుంది. వీరికి సరైన ఎంపిక ‘విగ్!’ ఒకప్పుడు విగ్ పెట్టుకోవాలంటే అసహజంగా అనిపించి వద్దనుకునే వారు. అలా విగ్గులు సినిమా తారలకు మాత్రమే పరిమితమయ్యేవి. నేడు.. జుట్టుకు, విగ్గుకు అస్సలు తేడా తెలియడం లేదు. ‘విగ్’ల తయారీలో సహజమైన మెటీరియల్స్‌ను వాడుతున్నాం. అసలైన కేశాలే అనిపించేలా కొన్ని రకాల మెటీరియల్‌ను విదేశాల నుంచి తెప్పిస్తుంటాం. వయసు పైబడిన వారి కోసం ప్రత్యేకంగా కొంచెం తెల్లజుట్టు ఉండేలా కూడా విగ్స్ తయారుచేస్తున్నాం. వీటిలోనూ రకరకాల స్టైల్స్ ఉన్నాయి. తల మొత్తంతో పాటు, ప్రత్యేకంగా బట్టతలను మాత్రమే కవర్ చేసేలా విగ్స్ తయారుచేస్తున్నాం. ఇవి 2/3 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. మెటీరియల్, పొడవును బట్టి 10 వేలనుంచి లక్ష రూపాయల వరకు వీటి ధరలు ఉన్నాయి. - దీప్తి మువ్వ, లా మార్స్ హెయిర్ సెలూన్ -
విగ్ పెట్టి... కాపీ కొట్టి!
సూరి(పశ్చిమబెంగాల్): బీఏ చదువుతున్న ఓ విద్యార్థి పరీక్షల్లో కాపీ కొట్టేందుకు వెరైటీగా ఆలోచనను అమలు చేశాడు. పరీక్ష రోజు తలపై విగ్, చెవులకు బ్లూటూత్ పరికరం పెట్టుకుని అది కనిపించకుండా విగ్‌తో కవర్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా పరీక్షా హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. బ్లూటూత్ హెడ్సెట్ సాయంతో మొబైల్ ఫోన్ ద్వారా వేరొకరితో మాట్లాడుతూ చకచక రాసేస్తున్నాడు. ఆ సమయంలో విద్యార్థి కొన్నిసార్లు పైకి పెద్దగా మాట్లాడడంతో ప్రిన్సిపాల్ మోండాల్‌కు అనుమానం వచ్చింది. వచ్చి ఆరా తీస్తే విగ్, బ్లూటూత్ హెడ్సెట్, కాపీ అన్నీ బయటపడ్డాయి. పశ్చిమబెంగాల్లోని బీర్భమ్ జిల్లా సూరిలోని విద్యాసాగర్ కాలేజీలో ఇది జరిగింది. విద్యార్థి రఫీఖుల్ ఇస్లామ్‌ను పరీక్షల నుంచి బహిష్కరించారు. -
విగ్‌ల తయారీలో మహిళా దీప్తి
పరిచయం ఎన్టీయార్, ఏయన్నార్, ఎంజీయార్ల కాలంలో విగ్ అంటే వెండితెరకు మాత్రమే పరిమితమైంది. ఉంగరాల, నొక్కుల జుత్తు హీరోలు, నడుం కింద కి పారాడే పొడవాటి జడలున్న కథానాయికలను తెరకెక్కించడానికి, ప్రేక్షకుల కలలరూపాలను హీరో హీరోయిన్ల రూపంలో దర్శింపజేయడానికి సినిమా రూపకర్తలు విగ్లను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. సాధారణ జనం సైతం విగ్‌ల వినియోగంపై మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో తొలిసారిగా ఒక యువతి విగ్ తయారీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం విశేషం. 29 ఏళ్ళ దీప్తి పంచుకున్న సంగతులు ఆమె మాటల్లోనే... నాన్నే తొలి గురువు... మేం తెలుగువాళ్లమైనా, చెన్నైలో స్థిరపడ్డాం. నాన్న (అప్పారావు) సినిమా రంగంలో విగ్ మేకర్. రజనీకాంత్, బాలకృష్ణ వంటి ఎందరో పెద్ద తారలతో వర్క్ చేశారు. చిన్నప్పటి నుంచి నాన్న పని చూస్తూ పెరిగా. అప్పుడప్పుడు ఆయన పనిలో సాయపడేదాన్ని కూడా. అయితే నన్ను ఈ రంగంలోకి తీసుకురావాలని నాన్న అనుకోలేదు. బహుశా నా సోదరుణ్ణి తీసుకువద్దామని అనుకున్నారేమో... బిఎస్సీ, ఎంబిఎ పూర్తి చేశా. కార్పొరేట్ కంపెనీలో పెద్ద జీతంతో ఉద్యోగం కూడా వచ్చింది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు... జుట్టు లేకపోవడం అనేది యువతను కూడా తీవ్రంగా బాధిస్తున్న సమస్యగా అర్థమైంది. నిజానికి సినిమాల కంటే బయటే దీని అవసరం చాలా ఉందనిపించింది. దీంతో 8 నెలల్లోనే ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి రావాలని నిశ్చయించుకున్నా.. అధ్యయనం చేసి... అడుగేశా... విగ్ తయారీలోకి వస్తానన్నప్పుడు నాన్నతో సహా అందరూ కొంత సందేహించినా... తర్వాత నా ఆలోచన పూర్తిగా వివరించాక ఓకె అన్నారు. మన దగ్గర విగ్ తయారీకి సంబంధించి ప్రత్యేకంగా కోర్సు ఏమీ లేదు కాబట్టి...సింగపూర్, కొరియా లాంటి దేశాలకు వెళ్లి అక్కడ అత్యాధునిక మెలకువలు నేర్చుకున్నా. చైనాలో, కొరియాలో అయితే విగ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఏరియాలే ఉంటాయి. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విగ్ తయారీలో వస్తున్న మార్పులు అందుబాటులో ఉన్న కేశాలంకరణ శైలులు... వీటిన్నింటి మీదా అవగాహన ఏర్పరచుకున్నా. ఇప్పుడు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘లా మార్స్’ హెయిర్ సొల్యూషన్స్ పేరుతో సంస్థ ప్రారంభిస్తున్నా. కేశ ‘సంపదే’... మనవాళ్లు కేశసంపద అంటుంటారు నిజంగా కేశాలు సంపదే. జుట్టు విలువ, అది లేకపోతే ఎదురయ్యే సమస్యలు, వారి ఇబ్బందులు వర్ణనాతీతం. ముఖవర్ఛస్సుకు అత్యంత అవసరమైనది జుట్టే. అలాంటి పరిస్థితుల్లో... కారణాలేవైతేనేం... ప్రస్తుతం జుట్టు లేకపోవడం అనేది యువతను బాధిస్తున్న పెద్ద సమస్యగా మారింది. మిగతా అన్ని రకాలుగా బాగున్నా... కేవలం కేశాలు నిర్ణీత పరిమాణంలో లేకపోవడం చాలా మందిని వేధిస్తోంది. అయితే మన దగ్గర చాలా మందికి విగ్ వాడకంపై పూర్తి అవగాహన లేదు. విదేశాలలో విగ్‌లు సర్వసాధారణంగా వినియోగిస్తారు. మన దగ్గర మాత్రం రకరకాల నూనెలు, వైద్యప్రక్రియలతో జుట్టు మొలిపించేందుకు అష్టకష్టాలు పడతారే గాని విగ్‌ల జోలికి వెళ్లడం తక్కువే. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోంది. అందరికీ అందుబాటులో... వంశపారంపర్యంగా బట్టతల వచ్చేవాళ్లే కాకుండా విభిన్న కారణాల వల్ల కేశాలను కోల్పోతున్నవాళ్లు, కేన్సర్, అలోపేసియా వంటి రోగాల బాధితులు... ఇలా విగ్‌ల అవసరం ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ నిస్సంకోచంగా వినియోగించేందుకు వీలుగా విగ్లను అందరికీ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నా. కానీ ఒక విషయం...తక్కువ ఖరీదు కదా అని సింథటిక్ హెయిర్స్‌తో రూపొందిన విగ్లను వాడితే అవి ఇతరత్రా సమస్యలు సృష్టిస్తాయి. ఈ విషయంలో విగ్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. -ఎస్.సత్యబాబు