
లక్నో: ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజే వేరు. దీనిలో ఉద్యోగ భద్రతతో పాటు, అనేక వెసులు బాటులు ఉంటాయి. అందుకే చాలా మంది యువత పోటీపరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. కొందరు కష్టపడి ఉద్యోగాన్ని సాధిస్తే.. మరికొందరు దళారులను లేదా హైటెక్ మాస్ కాపీయింగ్‌లకు పాల్పడుతుంటారు. దీనికోసం టెక్నాలజీని బీభత్సంగా ఉపయోగించుకుంటారు.
ఇప్పటికే హైటెక్ కాపీయింగ్ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక మాస్ కాపీయంగ్ ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీన్ని ఐపీఎస్ అధికారి రూపిన్‌శర్మ తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వివరాలు.. గత వారం యూపీలో సబ్‌ఇన్స్‌పెక్టర్ మెయిన్స్ రాతపరీక్షలు జరుగాయి. దీనిలో ఒక అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వచ్చాడు.
అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో.. ప్రత్యేక అధికారులు అతడిని బయటకు తీసుకెళ్లి తనిఖీ చేశారు. ఆ యువకుడిని పూర్తిగా పరిశీలించారు. ఎక్కడ కూడా.. ఎలాంటి కాపీయంగ్ ఆనవాళ్లు దొరకలేదు. చివరకు వారు.. అతగాడి తలపైన తనిఖీ చేశారు. అతడి జుట్టును పక్కకు జరిపి చూశారు. అప్పుడు షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. యువకుడి తలపైన ఒక విగ్ మాదిరిగా వెంట్రుకలు ఉన్నాయి.
దానికింద ప్రత్యేక చిప్, బ్లూటూత్‌లు ఉన్నాయి. దీన్ని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఆ తర్వాత.. యువకుడిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హైటెక్ మాస్‌కాపీయంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం తెలివిరా బాబు..’, ‘ఈ తెలివి చదువులో చూపిస్తే బాగుండు..’,‘ నీ తెలివి తెల్లారినట్లే ఉందంటూ’ కామెంట్‌లు చేస్తున్నారు.
చదవండి: ‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్
#UttarPradesh mein Sub-Inspector
— Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021
की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️😊😊😊@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry