
స్పీకర్ బటన్ నొక్కి దొరికి పోయాడు
ముంబై: బ్లూటూత్‌తో పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడో ప్రబుద్ధుడు. ఇంతకీ అతను అసలు అభ్యర్థి కాడని, డమ్మీ అని తేలింది. ఔరంగాబాద్ రీజియన్ యావత్మల్ జిల్లా పుసద్‌లోని శ్రీరామ్ అసెగావ్కర్ విద్యాలయంలో.. గ్రామ అకౌంటెంట్ ఉద్యోగం కోసం పరీక్ష నిర్వహించారు.
మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, ధరంసింగ్ మొబైల్ ఫోన్‌తో ప్రశ్నపత్రం ఫొటో తీసి బ్లూటూత్ ద్వారా హాలు బయట ఉన్న తన మిత్రుడికి పంపించాడు. ధరంసింగ్ కదలికలపై అనుమానం రావడంతో ఇన్విజిలేటర్ పి.ఎన్.రాథోడ్ కొద్దిసేపు గమనించాడు. దీంతో గాభరా పడ్డ సింగ్ కంగారులో బ్లూటూత్ బటన్‌కు బదులుగా స్పీకర్ బటన్ నొక్కడంతో పెద్ద శబ్దంతో మాటలు వినిపించసాగాయి. దీంతో సోదా చేయగా అతని జేబులో మొబైల్‌ఫోన్, ఇయర్ ఫోన్లు దొరికాయి.