సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల సందర్భంగా చేతి గడియారానికి అమర్చిన బ్లూటూత్ ద్వారా ఫోన్‌లో సమాధానాలు కాపీ కొడుతూ విశాఖలో ఓ విద్యార్థి చిక్కాడు. గురువారం ద్వితీయ ఏడాది ద్వితీయ భాష పేపరు పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి రిస్ట్ వాచ్‌లోని బ్లూటూత్ సహాయంతో ఫోన్‌లో సమాధానాలు వింటూ దొరికిపోయినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు.
విశాఖపట్నం బుచ్చిరాజుపాలెంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఈ విద్యార్థి పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చిక్కిన విద్యార్థి పేరు తపస్య అని తెలిసింది. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని అధికారులను రామశంకర్ నాయక్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాలున్న చోట జిరాక్స్ యంత్రాలను ఇన్‌స్పెక్షన్ అధికారులు కచ్చితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. గురువారం పరీక్షకు 46,943 మంది (5. 24 శాతం)గైర్హాజరు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేశామన్నారు.
రిస్ట్ వాచ్...బ్లూటూత్ ఇంటర్ పరీక్షల్లో కాపీయింగ్
Published Fri, Mar 14 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
Advertisement
Advertisement