పదో తరగతి మూల్యాంకనంలో ఇన్విజిలేటర్ తప్పిదం
రీ వెరిఫికేషన్‌లో బయటపడిన వైనం
బత్తలపల్లి: పదో తరగతిలో ఫెయిల్‌గా చూపిన ఓ విద్యార్థి.. జవాబు పత్రం రీ వెరిఫికేషన్‌లో ఏకంగా 82 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. వివరాలు... బత్తలపల్లి మండలం రాఘవంపల్లికి చెందిన గోగుల సూర్యనారాయణ కుమారుడు అంజి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదివాడు. ఈ ఏడాది మార్చిలో బత్తలపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్ కేంద్రంగా పబ్లిక్ పరీక్షలు రాశాడు. తెలుగులో 98, హిందీ 89, గణితం 92, భౌతిక శాస్త్రం 87, సాంఘిక శాస్త్రంలో 86 మార్కులు సాధించాడు. అయితే ఇంగ్లిష్‌లో కేవలం 18 మార్కులు వేయడంతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు.
మెరిట్ విద్యారి్థగా మన్ననలు పొందిన అంజి ఫెయిల్ అయ్యాడనగానే ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. మానసికంగా కుదేలైన బాధిత విద్యారి్థకి సదరు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ ధైర్యం చెప్పి వెంటనే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయించారు. ఈ ఫలితాలు సోమవారం అందాయి. 100కు 82 మార్కులు వచ్చాయి. ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కుమారుడు ఇన్ని రోజులు మానసిక వేదన అనుభవించాడని తల్లిదండ్రులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment