
అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం జరిగింది.
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం జరిగింది. హోంమంత్రి అనితను కలిసేందుకు వెళ్లిన దళిత సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హోంమంత్రి అనిత తమను పట్టించుకోవడం లేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని నేతలు మండిపడ్డారు. హోం మంత్రి అనితను కలిసి వినతి పత్రం అందజేసేందుకు వెళ్లిన ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి వెళ్లగా.. అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
కారు కూడా దిగకుండా.. మంత్రిగారూ.. ఇదేం తీరు!
కర్నూలు: మంత్రి హోదాలో ఉన్న టీజీ భరత్ కనీసం ప్రజల సమస్యలను వినడానికి కూడా ఇష్టపడటం లేదు.పింఛన్ రావడం లేదని సమస్యను చెప్పుకోవడానికి వెళ్లిన వృద్ధురాలి మంత్రి పట్టించుకోలేదు. నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలు మంత్రి దగ్గరకు వెళ్లగా.. టీజీ భరత్ కారు కూడా దిగలేదు. తనకు పింఛన్ రావడం లేదని.. ఇప్పించాలంటూ మంత్రిని వృద్ధురాలు కోరింది. కొత్త పింఛన్లు వస్తే ఇస్తామంటూ మాట దాటేశారు. సమస్యలను వినాల్సిన మంత్రి.. కారు కూడా దిగకుండానే ప్రజలు సమస్యలను ఏసీ కారులో కూర్చోని విన్నారు. మంత్రి తీరుపై స్థానికులు మండిపడ్డారు.