
హైదరాబాద్: యాక్సెసరీస్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కనెక్ట్ గ్యాడ్జెట్స్ ఎస్‌డబ్ల్యు1 ప్రో స్మార్ట్‌వాచ్‌ను ప్రవేశపెట్టింది. 10.5 మిల్లీమీటర్ల మందం, 1.72 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ కర్వ్‌డ్ ట్రూ వ్యూ లార్జ్ డిస్‌ప్లే, 180 ఎంఏహెచ్ బ్యాటరీతో రూపొందించింది. ధర రూ.3,999. అంతరాయం లేని, మెరుగైన కాల్స్ కోసం డ్యూయల్ బ్లూటూత్ మల్టీ పాయింట్ టెక్నాలజీతో జోడించినట్టు కనెక్ట్ సీవోవో ప్రదీప్ తెలిపారు. (చదవండి: అదిరిపోయే ఫీచర్స్ గల 5జీ స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా!)
బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సీజన్, ఈసీజీ తెలుసుకోవచ్చు. ఫిమేల్ అసిస్టెన్స్, బ్రెత్ మోడ్, వెదర్ రిపోర్ట్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మానిటరింగ్, గెశ్చర్ కంట్రోల్, ఏడు రకాల స్పోర్ట్స్ మోడ్స్, వాటర్ ప్రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాయిదాల్లోనూ కొనుగోలు చేయవచ్చు. (చదవండి: ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment