
హెల్మెట్‌లా కనిపిస్తున్న ఈ హెడ్‌సెట్‌ను తలమీద ధరిస్తే, కొద్దిరోజుల్లోనే బట్టతల మీద జుట్టు మొలుస్తుంది. ఇది ‘కరెంట్ బాడీ స్కిన్ ఎల్‌ఈడీ హెయిర్ రీగ్రోత్ డివైస్’. దీనిని అమెరికన్ సౌందర్య సాధనాల తయారీ సంస్థ ‘కరెంట్ బాడీ’ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందులో బ్లూటూత్‌కి అనుసంధానమై పనిచేసే హెడ్‌ఫోన్స్ కూడా ఉండటం విశేషం.
దీనిని తల మీద తొడుక్కుని, ఇంచక్కా నచ్చిన సంగీతాన్ని వినవచ్చు. దీని లోపల తలను కప్పి ఉంచే భాగంలో 120 ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. వీటి నుంచి వెలువడే ‘లో లెవల్ లైట్ థెరపీ’ కిరణాలు వెంట్రుకలు కోల్పోయిన భాగంలోని కణాలను ఉత్తేజపరుస్తాయి.
దీనిని రోజుకు పది నిమిషాల చొప్పున కనీసం పదహారు వారాలు వినియోగించినట్లయితే, జుట్టు కోల్పోయిన చోట తిరిగి జుట్టు మొలుచుకొస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 773 డాలర్లు (రూ.63,951) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment