ఫొటోలో ఉన్న నటి తెలుసు కదా.. నాని ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇటీవల జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఇలా సంప్రదాయ కట్టు.. ఫ్యాషన్ లుక్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచింది. అలా ఆమెను నిలబెట్టిన అవుట్ ఫిట్, జ్యూయెలరీ బ్రాండ్స్ ఏంటో చూద్దాం..
జేడ్ బై మోనికా అండ్ కరిష్మా
పెళ్లి కూతురి కలెక్షన్స్‌కు పెట్టింది పేరు ఈ బ్రాండ్. తమలోని ఫ్యాషన్ స్పృహ, భారతీయ హస్తకళల పట్ల తమకున్న మక్కువ, గౌరవాలకు ప్రతీకగా దీన్ని స్థాపించారు మోనికా షా, కరిష్మా స్వాలి. భారతీయ సంప్రదాయ నేత కళకు ఆధునిక ఆకృతులు, రంగులు, హంగులు అద్దుతున్నారు.
జేడ్ బై మోనికా అండ్ కరిష్మా బ్రాండ్ పేరుకు దేశీయమైనా ఫ్యాషన్ రంగంలో అంతర్జాతీయ కీర్తిని సొంతం చేసుకుంటోంది. ధరలనూ అంతే స్థాయిలో అంచనా వేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లభ్యం.
ఏవీఆర్ స్వర్ణ మహల్
దక్షిణ భారతదేశానికి చెందిన జ్యూయెలరీ బ్రాండ్ ఇది. దీని ఎంబ్లమ్‌లో రెండు హంసలు ఉంటాయి. నగల స్వచ్ఛత, నాణ్యతకు గుర్తుగా. సరికొత్త డిజైన్సే కాదు కొనుగోలుదారుల నమ్మకం కూడా ఈ బ్రాండ్‌కు యాడెడ్ వాల్యూ. చెన్నై, సేలం, బెంగళూరు మొదలు దక్షిణ భారతదేశంలోని పదహారు ప్రాంతాల్లో పద్దెనిమిది షోరూమ్స్ ఉన్నాయి ఈ బ్రాండ్‌కు. నాణ్యత, డిజైన్లను బట్టి ధరలు.
బ్రాండ్ వాల్యూ
చీర బ్రాండ్:
జేడ్ బై మోనికా అండ్ కరిష్మా
ధర: రూ. 98,800
జ్యూయెలరీ
బ్రాండ్: ఏవీఆర్ స్వర్ణ మహల్
ధర: నగల డిజైన్, నాణ్యతను బట్టి
నేను వెరీ సింపుల్.. నార్మల్.. హ్యాపీ హ్యూమన్ బీయింగ్‌ని. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. ఇవే నన్ను గ్రేస్‌ఫుల్‌గా ఉంచుతున్నాయనుకుంటా!
– ప్రియాంక మోహన్
-దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment