దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆమె ఈ మధ్య హిందీ ఇండస్ట్రీ వైపే ఫోకస్ చేసింది. రకుల్ ప్రీత్ చాలా కూల్‌గా హిందీ సినిమాల్లో తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తోంది. మరో వైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇక ఆమె ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో.. తన అందాన్ని హైలైట్ చేసే ఫ్యాషన్‌కీ అంతే ప్రాధాన్యం ఇస్తుంది రకుల్ ప్రీత్ సింగ్! తన ఫ్యాషన్ ప్రాధాన్యంలో ఆమె లిస్ట్ చేసుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ..
జ్యూలరీ బ్రాండ్: మియార ధర:
ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మియార..1960 నుంచీ వారసత్వంగా వస్తున్న వ్యాపారాన్ని.. నేడు ఇద్దరు సోరీమణులు కలసి అంతర్జాతీయ బ్రాండ్‌గా నిలబెట్టారు ‘మియార’గా! విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్‌కి మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీల ఫేవరెట్ ఈ బ్రాండ్ అనీ పేరుంది. డిజైన్‌ను బట్టే ధర. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.
అభినవ్ మిశ్రా..
పేరుకు ఇది దేశీ బ్రాండ్ కానీ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించింది. ఖరీదైనది కూడా! దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కనీసం ఒక్కసారైనా ఈ డిజైనర్ వేర్‌ను ధరించి ఉంటారు. ప్రతి కస్టమర్‌కి నచ్చేలా.. నప్పేలా ట్రెడిషనల్, ట్రెండీ, ఫ్యాషనబుల్ డిజైన్స్‌ను అందించడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. దేశంలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. రకుల్ ధరించిన అభినవ్ మిశ్రా..చీర బ్రాండ్ ధర రూ. 70,000. ఇక రకుల్ ఫ్యాషన్ పరంగా ..నా దృష్టిలో ఫ్యాషన్ అనేది ఒక సహజ పక్రియ. మనం ధరించే దుస్తులు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అందుకే నేను ఎప్పుడూ నా కంఫర్ట్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాను! అని అంటోంది.
-దీపిక కొండె
(చదవండి: ఈ ఫోటో కనిపిస్తున్నది రాయి మాత్రం కాదు! అది ఏంటంటే..)
Comments
Please login to add a commentAdd a comment