రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకులు ధూమ్‌ధామ్‌గా జరిగాయి. ఆ వేడుకల్లో కళ్లు చెదిరే రేంజ్‌లో లగ్జరీయస్‌గా జరిగింది. ఆ వేడుకలు యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అతిథులు భోజనం దగ్గర నుంచి ధరించే బట్టల వరకు ప్రతీది ఓ సెన్సెషన్ అయ్యింది. ఆ వేడుకుల్లో నీతా అంబానీ తనయ ఇషా అంబానీ ధరించి వస్త్రాలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. అంబానీ బిడ్డ కాబట్టి ఆ రేంజ్‌లోనే ఉంటాయి కానీ అంతకు మించి 'వేరేలెవెల్' అన్నట్లు ఉండటంతోనే నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఆమె లెహంగాపై ధరించిన బ్లౌజ్‌కి సంబంధించిన వీడియోని చూసి అంబానీ బిడ్డ ఆ మాత్రం ఉంటుందిలే అని అంటున్నారు. మూడు రోజుల వేడుకల్లో చివరి రోజు చక్కటి లెహంగాతో అలరించారు ఇషా. అందులో ఆమె ధరించిన బ్లౌజ్ ప్రతి ఒక్కరిని స్టన్ అయిపోయేలా చేసింది. ఆ బ్లౌజ్‌ని మనం చెవులకు ధరించే జూకాలతో డిజైన్ చేశారు. కేవలం బంగారుపు జూకాలు కాదండోయ్. బంగారంతో పొదగబడిన వజ్రాలు, కెంపులు, వైఢ్యూర్యాలతో డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్‌ని డిజైన్ చేసింది ప్రముఖ డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లా. ఆ బ్లౌజ్‌లో ఉన్న ప్రతి ఆభరణం చాలా కళాత్మకంగా ఉంటుంది.
డిజైనర్ సందీప్ 2012లో 'ఇండియ ఫెంటాస్టిక్"లో ప్రదర్శించిన ఐకానిక్ బ్లౌజ్‌లను తలదన్నేలా ఐషా ధరించిన బ్లౌజ్‌ని తీర్చిదిద్దడం విశేషం. ఆ బ్లౌజ్‌పై ఇంత బరువైన నగలను చాల పొదినిగ్గా అమర్చడమే కాకుండా చూసేందుకు బండగా కనిపించకుండా ఎలా బ్లౌజ్‌పీస్‌పై అమర్చారా? అనిపించేలా తేలికైన ధారాలతో ఎంబ్రాయిడరీ చేశారు. ఆ జాకెట్ డిజైన్ నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే. అయితే అంతలా ఖరీదైన వజ్రాలు, కెంపులు, రత్నాలతో రూపొందిన బ్లౌజ్ ధర ఏకంగా కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఆ జాకెట్‌నే తమ్ముడి పెళ్లిలో ధరించి సందడి చేశారు ఇషా. ఆ అత్యంత లగ్జరీయస్ జాకెట్ డిజైన్ చేసిన విధానానికి సంబంధించిన వీడియోని నెట్టింట్ పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment