
సృజనాత్మకతకు కాసింత మేథస్సును జోడించి కొత్త కొత్త ఆవిష్కరణలను సృష్టించిన వారెందరో ఉన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు తాము ఎదర్కొంటున్న సమస్యల నుంచి పుట్టుకొచ్చినవే. అచ్చం అలానే ఇక్కడొక సామాన్య వ్యక్తి తన సమస్యకు చెక్‌పెట్టే ఒక వినూత్న ఆవిష్కరణకు నాంది పలికాడు.
వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక బాబాజీ ఫ్యాన్‌తో కూడిన హెల్మట్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఎందుకలాగా అంటే..ఆయన ఎండలో వెళ్లినప్పడూ ఉక్కపోతను భరించలేక ఇబ్బందులు పడేవారు. అదీగాక సాధువులు, బాబాజీలు పాదాచారులగా బిక్షటన చేసి జీవిస్తుంటారు. అలా వారికి నచ్చిన ప్రాంతాలకు తరలిపోతూ...ఇక అక్కడే ఏ ఆశ్రమాలకో వెళ్లి జపాలు, ధ్యానాలు వంటివి చేస్తుంటారు.
అందరికి తెలిసిందే. ఆ క్రమంలో ఆ బాబాజీ పాదాచారిగా వెళ్తుంటే బయట ఎండ ధాటికి తట్టుకోలేక ఒక వినూత్న ఆవిష్కరణకు తెరలేపారు. అదే సోలార్ శక్తితో పనిచేసే ప్యాన్ హెల్మట్. ఆ వ్యక్తి ఒక హెల్మట్‌కి ఫ్యాన్, సోలార్ ప్లేట్ అమర్చి హెల్మట్ మాదిరిగా ధరించాడు. చూసేందుకు తలపాగ మాదిరిగా ఉంది. ఎంతటి ఎండలోనైనా హాయిగా చల్లటి గాలిని ఆశ్వాదిస్తూ వెళ్లేలా రూపొందించాడు. జనాలు కూడా ఆ బాబా తెలివికి మంత్రముగ్దులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग
— Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022
सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS
(చదవండి: ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్లే లవ్‌లో పడ్డా: లవ్ స్టోరీ వైరల్)