ఏపీలో నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి | Wearing Helmet mandator in AP from today onwards | Sakshi
Sakshi News home page

ఏపీలో నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి

Published Sun, Nov 1 2015 10:05 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

ఏపీలో నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి

ఏపీలో నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. ఏపీలో ఆ రోజు ఉదయం నుంచే రవాణా శాఖ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. హెల్మెట్ ధరించని వారిపై మొదటి సారి జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.  

గతంలో ఈ నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. చివరకు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించింది. వాహనదారులు హెల్మెట్‌ వాడటాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని సూచించింది. దీంతో ఈ నిబంధన కార్యరూపం దాల్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement