సీటు బెల్టు ధరిస్తేనే సురక్షితం
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్) : ప్రస్తుతం సీటు బెల్టు ధరించకపోవడం వలన తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందువల్ల వాహనదారులు తప్పనిసరిగా ధరించాలని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఆదేశాల మేరకు శనివారం అర్బన్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి ముఖ్య కూడళ్లలో, నగరంలో
అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్) : ప్రస్తుతం సీటు బెల్టు ధరించకపోవడం వలన తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందువల్ల వాహనదారులు తప్పనిసరిగా ధరించాలని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఆదేశాల మేరకు శనివారం అర్బన్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి ముఖ్య కూడళ్లలో, నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ఇతర ముఖ్య ప్రదేశాల్లో సీటుబెల్టు వాడకంపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అర్బన్ ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది కారులో సీటు బెల్టు ధరించని వారికి అవగాహన కల్పించారు. మోరంపూడి జాతీయ రహదారి వద్ద సీటు బెల్టు ధరించిన వారికి తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు, ఇన్‌స్పెక్టర్ కనకారావులు గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 3,413 కార్లను ఆపి అవగాహన కల్పించారు. అర్బన్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఎం.రజనీకాంత్, ఆర్.గంగాధర్, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రవాణా శాఖాధికారుల సైతం
మోరంపూడి జాతీయరహదారి కూడలిలో రవాణాశాఖాధికారులు సీటు బెల్టుధరించడంపై అవగాహన కల్పించారు. మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు కార్లను ఆపి సీటు బెల్టు ధరించాలని సూచించారు.