ధగధగమంటూ కాంతులీనే బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు?.. ప్రతిఒక్కరికీ పసిడిపైన మక్కువే. మరి ఆ బంగారాన్ని ఎవరు, ఎలా చూస్తున్నారన్నదే ఆసక్తికరం. ఇదే అంశంపైనే ఓ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ విశేషాలను ఈ కథనంలో మీకందిస్తున్నాం..
మనీవ్యూ సర్వే ప్రకారం, 3,000 మంది ప్రతివాదులలో 85 శాతం మంది బంగారాన్ని సంపద పరిరక్షణకు విలువైన ఆస్తిగా పరిగణిస్తున్నారు. అద్భుతంగా పెరుగుతన్న దాని విలువ, చారిత్రికంగా ఉన్న విశిష్టత వినియోగదారుల్లో విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాయి.
ముఖ్యంగా 25-40 ఏళ్ల వయస్సున్నవారు పదవీ విరమణ, ఇతర దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సంపదను నిర్మించడానికి వారి సాధారణ ఆర్థిక వ్యూహంలో భాగంగా భౌతిక, డిజిటల్ మార్గాల ద్వారా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారని సర్వే పేర్కొంది.
70 శాతం మంది భారతీయులు అంటే 10 మందిలో ఏడుగురు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించడం వారి పొదుపు అలవాట్లను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. డిజిటల్ యుగంలో బంగారంపై ఉన్న ఆసక్తి డిజిటల్ గోల్డ్ వైపు ఎక్కువగా నడిపిస్తోంది.
ఇదీ చదవండి: బంగారు ఆభరణాలే ఎక్కువ..
సర్వే డేటా ప్రకారం.. 35 ఏళ్లలోపు వారిలో 75 శాతం మంది భౌతిక బంగారం కంటే కూడా డిజిటల్ బంగారాన్ని ఇష్టపడుతున్నారు. దానికి లిక్విడిటీ, సౌలభ్యం ప్రధాన కారకాలుగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 50 శాతానికి పైగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్షిక మొత్తాలలో బంగారాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యం తమ పెట్టుబడి అలవాట్లను మార్చుకునే దిశగా అత్యంత లాభదాయకమైన లక్షణాలలో ఒకటి అని నమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment