అయోధ్యలో లక్షల్లో తులసి మాలల విక్రయాలు! | Tulsi Garlands Were Traded in Lakhs in Ayodhya | Sakshi
Sakshi News home page

Ayodhya: అయోధ్యలో లక్షల్లో తులసి మాలల విక్రయాలు!

Published Tue, Nov 28 2023 9:52 AM | Last Updated on Tue, Nov 28 2023 10:01 AM

Tulsi Garlands Were Traded in Lakhs in Ayodhya - Sakshi

శ్రీరాముడు కొలువైన నగరమైన అయోధ్య(యూపీ)లో రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు  ఇక్కడికి తరలివస్తున్నారు. ఆలయ నిర్మాణంలో యువత భాగస్వాములవుతున్నారు. వారంతా సనాతన సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్నారు. 

ఇటీవలి కాలంలో ప్రత్యేక సందర్భాలలో యువత ఆలయాలకు చేరుకుని, పూజలు చేస్తుండటం మరింతగా కనిపిస్తోంది. కార్తీకమాసంలో అయోధ్యకు దాదాపు 30 లక్షల మంది రామభక్తులు తరలివచ్చారు. వీరిలో గరిష్ట సంఖ్యలో యువత ఉన్నారు. మరోవైపు అయోధ్యలో తులసి మాలల వ్యాపారం జోరుగా సాగుతోంది. లక్షల సంఖ్యలో తులసి మాలలు విక్రయమవుతున్నాయి. యువత తులసి మాలలు ధరించేందుకు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. 

రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు, భక్తుల రద్దీ మరింతగా పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.  ఇక్కడికి వచ్చే యువత తులసిమాల వేసుకోవాలని భావిస్తున్నారన్నారు. కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు తులసి మాలలను కొనుగోలు చేశారని వ్యాపారులు చెబుతున్నారు. తులసి మాలలను చేతితో తయారు చేసే భువన్ దేవి మాట్లాడుతూ తన భర్తతో పాటు చాలా కాలంగా తాను ఈ పనిలో నిమగ్నమయ్యానని, ఇప్పుడు యువత అమితంగా తులసిమాలలకు ఆకర్షితులు కావడం చూస్తున్నానని అన్నారు. గత ఏడాది కాలంగా తులసి, రోజా, రుద్రాక్ష మాలలను యువతీయువకులు కొనుగోలు చేస్తున్నారన్నారు.  

తులసి మాల ధారణతో మనస్సు, వాక్కు రెండింటికీ స్వచ్ఛత లభిస్తుందని చెబుతారు. తులసి మాల ధరించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెంపొందుతుందని, భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని అనుభూతి చెందుతారని భక్తులు నమ్ముతారు. తులసి మాల మనశ్శాంతిని అందిస్తుందని కూడా అంటారు. తులసి మాల ధరించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: భారత్‌ పొరుగు దేశాల్లో మరోమారు భూ ప్రకంపనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement