న్యూఢిల్లీ - బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్లో మద్యం మత్తులో ఓ ప్రయాణికులు వీరంగం సృష్టించాడు. దాంతో సదరు ప్రయాణికుడిపై తోటి ప్రయాణికులు టీసీకి ఫిర్యాదు చేశారు. టీసీ ప్రయాణికుడి వీరంగంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరంగం సృష్టించిన ప్రయాణికుడిని ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులకు అప్పగించారు. రైల్వే పోలీసులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.